
పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుర్మయ్య గౌడ్
గద్వాల క్రైం: పురుగు మందు తాగి ఓ కారు డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం చోటుచేసుకుంది. గద్వాల సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పెంట్లవెల్లి మండలం కొండూరుకు చెందిన చుక్క రామన్‌గౌడ్ కుమారుడు కుర్మయ్యగౌడ్(26) గత నాలుగేళ్ల నుంచి గద్వాలలోని పత్తి మిల్లు యజమాని చంద్రశేఖర్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల చంద్రశేఖర్‌రెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కావడంతో ఆమె కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అయితే బుధవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలోని ఓ గదిలో పురుగు మందు తాగాడు. అనంతరం గదిలో నుంచి బయటికి వస్తున్న క్రమంలో కార్యాలయం ముందు కిందపడ్డాడు. గమనించిన స్థానికులు ఆరా తీయగా పురుగుమందు తాగినట్లు వివరించాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తె లుసుకున్న చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్ లక్ష్మీదేవ మ్మ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఈ యన ఆత్మహత్యకు గల కారణాలు తెలి యాల్సి ఉంది.ఈ ఘటనపై కుర్మయ్యగౌడ్ తండ్రి రామన్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
గద్వాలలో కలకలం..
మార్కెట్ చైర్మన్ డ్రైవర్ కుర్మయ్యగౌడ్ మార్కెట్ కార్యాలయంలో పురుగు మందు తాగి మృతి చెందడంతో గద్వాలలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పలువురు మార్కెట్ కమీషన్‌దారులు, కూలీలు, సిబ్బంది కలత చెందారు. అనంతరం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment