సాక్షి, గుంటూరు : మాచర్ల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ అజ్ఞాతంలోకి వెళ్లటంతో.. నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ మొదలైంది. గతంలో అధిష్టానం ముగ్గురు ఛైర్ పర్సన్‌ల పదవీ కాలాన్ని పంచింది. అప్పట్లో శ్రీదేవి అనే ఛైర్ పర్సన్‌ను బలవంతంగా పదవీనుంచి తొలగించటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత వచ్చిన మంగమ్మను సైతం బలవంతంగా పదవీనుంచి రాజీనామా చేయించారు.
మంగమ్మ స్థానంలో షాకీర్ హున్నీసాను ఎన్నుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 15 మంది కౌన్సిలర్లతో షాకీర్ హున్నిసా బుధవారం సమావేశానికి హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఆమెను మున్నిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు.ఇందుకు అంగీకరించని మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ తన వర్గానికి చెందిన పదిమంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లింది. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన మంగమ్మ కోరం ఉంటుందా? ఎన్నిక జరుగుతుందా? అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment