సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రీతిసుదాన్.. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.
కాగా, ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2029 మే 15 వరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇక, ప్రీతిసుదాన్.. 29 ఏప్రిల్ 2025 వరకు సేవలందిస్తారు. కాగా, సుడాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో ఆమె డిగ్రీలు పొందారు. వాషింగ్టన్‌లో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకున్నారు. మరోవైపు.. ఆంధ్రా కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతిసుదాన్. సుడాన్ గతంలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ వంటి వివిధ కేంద్ర, రాష్ట్ర స్థాయి స్థానాల్లో పనిచేశారు. అలాగే విపత్తు నిర్వహణ, పర్యాటక రంగానికి సంబంధించిన హోదాలో పనిచేశారు. ఆమె ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా కూడా పనిచేశారు. అలాగే కరోనా సమయంలో ఆమె క్రియాశీలకంగా విధులు నిర్వహించారు.
~ 1983 batch IAS officer Preeti Sudan will be the new UPSC Chairperson, with effect from 1st August 2024.
~ President Droupadi Murmu approves the appointment@rashtrapatibhvn #UPSC pic.twitter.com/parkcQUv9f— DD News Odia (@DDNewsOdia) July 31, 2024
Comments
Please login to add a commentAdd a comment