
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన అనంతరం వాసిరెడ్డి పద్మ తొలిసారి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌కు వాసిరెడ్డి పద్మ ప్రత్యేక కృతజ‍్క్షతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేయాలని సీఎం చెప్పారని వాసిరెడ్డి పద్మ తెలిపారు.