బాధిత బాలికను పరామర్శిస్తున్న వాసిరెడ్డి పద్మ
రాజమహేంద్రవరం క్రైం: బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మధురపూడికి చెందిన బాలిక సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురై, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పద్మ ఆదివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..
► ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తాం.
► మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చట్టాలు తీసుకువచ్చారు. దీనిలో దిశ చట్టం ఒకటి.
► ఈ చట్టం కింద దోషులను కఠినంగా శిక్షిస్తాం.
► ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment