
సాక్షి, అమరావతి: నెల్లూరు యువతిపై అమానుష దాడి, విశాఖలో తొమ్మిదేళ్ల బాలికలపై జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనలపై వెంటనే స్పందించిన సీఎం జగన్ వెంటనే కఠిన చర్యలకు ఆదేశించారని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ దారుణాలకు పాల్పడిన నిందితులను తక్షణం అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఈ రెండు ఘటనల్లో బాధితుల పరిస్థితిని చైర్‌పర్సన్ స్వయంగా వాకబు చేశారు. పోలీస్ అధికారులతో మాట్లాడి దర్యాప్తు వివరాలను తెలుసుకోడమే కాక కమిషన్ సభ్యుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment