నిజామాబాద్: వాహనాలను రాంగ్‌రూట్‌లో నడిపినా, సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ హెచ్చరించారు. నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నగరంలోని 18 చోట్ల ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని సీపీ కేటాయించారని తెలిపారు. నగరంలోని వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలన్నారు. అత్యవసరంగా ఫోన్ ఎత్తాల్సి వస్తే రోడ్డుపక్కన నిలిపి మాట్లాడాలని సూచింంచారు.
మొదటి రోజు సోమవారం ఐదుచోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. మంగళవారం నుంచి 18 చోట్ల స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment