నిజామాబాద్: ‘తాగాలి.. తాగి ఊగాలి..’ అనేది పాత సామెత. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ‘మరింతగా తాగాలి.. డ్రంకెన్ డ్రైవ్‌కు చిక్కి వేసినంత జరిమానా కట్టాలి’ అనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో వైన్స్ వ్యాపారులను లిక్కర్ అమ్మకాలు పెంచాలంటూ ఆబ్కారీ అధికారులు మెడమీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తుండడంతో గగ్గోలు పెడుతున్నారు.
బీర్ల అమ్మకాలను నామమాత్రం చేసి లిక్కర్ అమ్మకాలు భారీగా పెంచాలంటుండడంతో వ్యాపారులు గుస్సా అవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 180 వైన్స్‌లు ఉన్నాయి. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా తాజాగా ఉమ్మడి జిల్లాలోని అన్ని వైన్స్‌లకు రూ. 10 లక్షల మేర అరువు మీద సరుకు అంటగట్టారు.
వ్యాపారులు అయిష్టంగానే తీసుకున్నా రు. ఇందుకు సంబంధించి వ్యాపారుల వద్ద నుంచి బలవంతంగా ఇప్పటివరకు రూ. 13 కోట్ల మేర చె క్కులు వసూలు చేశారు. ఈ చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని ఆగస్టు 3న చెల్లించాలని డెడ్‌లైన్ వి ధించారు. ఇది చాలదన్నట్లు ఈ నెలాఖరుకు సంబంధించిన టార్గెట్ మేరకు కూడా నగదు చెల్లించి సరుకు తీసుకోవాల్సిందేనని హుకుం జారీ కావడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనా భా ఆధారంగా, గతంలో జరిగిన అమ్మకాల మేరకు లక్ష్యం విధించారు. అమ్మకాలు తగ్గితే సదరు వైన్స్‌లపై కేసులు నమోదు చేయాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయిలో అధికారులు కూడా వాపోతున్నారు. వర్షం కారణంగా అమ్మకా లు తగ్గినా ఊరుకునేది లేదని కమిషనరేట్ నుంచి కోప్పడుతుండడంతో అధికారులు సైతం టెన్షన్ ప డుతున్నారు.
అమ్మకాల పెంపు కోసం ఆబ్కారీ అధికారులు సర్కిల్స్ వారీగా నిరంతరం స మావేశాలు పెడుతున్నారు. అమ్మకాలు తగ్గితే మా త్రం ఆయా ప్రాంతాల్లో నాటుసారా, ఇతర రాష్ట్రాల మద్యం వస్తుందంటూ వైన్స్ వ్యాపారులను తిడుతుండడం విశేషం. ఉమ్మడి జిల్లాలో కొందరు ఆబ్కారీ సీఐలు దగ్గరుండి వ్యాపారులకు అప్పులిప్పించి మరీ సరు కు కొనిపించిన సందర్భాలు అనేకమున్నాయి.
మరోవైపు పోలీస్‌శాఖ..
మద్యం అమ్మకాల విషయంలో ఆబ్కారీ శాఖ ఒక్క చిన్న అవకాశం కూడా వదలట్లేదు. ప్రభుత్వం కూడా అమ్మకాల విషయంలో తగ్గేదే లేదంటోంది. 2021 నవంబర్‌లో లాటరీ ద్వారా వైన్స్‌లు దక్కించుకున్నవాళ్లు డిసెంబర్ 1 నుంచి షాపులు ప్రాంరంభించాల్సిన నేపథ్యంలో నవంబర్ 28వ తేదీనే వాళ్లకు సరుకు అంటగట్టారు.
షాపులు సమయానికి దొరకని వాళ్లు టెంటు వేసైనా సరే డిసెంబర్ 1న అ మ్మకాలు ప్రారంభించాలని ప్రభుత్వం తహసీల్దార్ల ద్వారా ఆదేశాలు జారీ చేయించడం గమనార్హం. అ యితే వైన్స్ వ్యాపారులు, పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ విషయమై ప్రస్తావించారు. ఆబ్కారీ అధికారులు పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం తమ టార్గెట్ తమకుందని, డ్రంకెన్ డ్రైవ్ ను ఆపడం కుదరదని తేల్చిచెప్పడంతో తకరారు ప డింది.
ఇటీవల ఉమ్మడి జిల్లాలోని ఒక చోట ఈ డ్రంకెన్ డ్రైవ్ నేపథ్యంలో ఒక వ్యక్తి వైన్స్ షెట్టర్‌ను కిందికి లాగి అమ్మకాలు చేయవద్దని గొడవ చేశాడు. దీంతో సదరు వ్యక్తిపై ఆబ్కారీ అధికారులు పోలీసు కేసు పెట్టారు. ఇలాంటి ఘటనలు పలుచోట్ల గతంలోనూ చోటుచేసుకున్నాయి. మొత్తంమీద ఆబ్కారీ అధికారులే దగ్గరుండి బెల్ట్ షాపులు మరిన్ని ఏ ర్పాటు చేసి అమ్మకాలు చేస్తుండడం విశేషం.
అధికారులే అనుమతులిచ్చి..
మద్యం బెల్టు దుకాణాలను నిర్మూలించాల్సిన ఆబ్కారీ అధికారులే వాటిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తుండడం విశేషం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో వీడీసీలు, మ రికొన్ని ప్రాంతాల్లో సర్పంచ్‌లు, పెద్దలు మద్యం అమ్మకాలను లేకుండా చేసేందుకు ఆయా గ్రామాల్లో బెల్టు షాపులను పెట్టకుండా కట్టుబా ట్లు విధించారు.
ఈ నేపథ్యంలో లిక్కర్ అమ్మకాలను పెంచేందుకు గాను ఆబ్కారీ అధికారులే బెల్టు షాపులు నిర్వహించేందుకు సహకరించాలని ఆయా గ్రామాల పెద్దలను, సర్పంచ్‌లను కలిసి మాట్లాడి ఒప్పిస్తుండడం విశేషం. ఎక్కువమంది సర్పంచ్‌లు బీఆర్‌ఎస్ వాళ్లే కావడంతో ఆబ్కారీ అధికారులు సంక్షేమ పథకాల కు డబ్బులు అవసరమనే మాటలు చెప్పి వారిని ఒప్పిస్తున్నారు. మరో విశేషమేమిటంటే బెల్టు షాపుల జోలికి వెళ్లొద్దంటూ పోలీసులకు సైతం చెప్పడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment