permision
-
బాగా తాగు..! తాగి ఊగు..! దొరికితే అంతే సంగతులు..!!
నిజామాబాద్: ‘తాగాలి.. తాగి ఊగాలి..’ అనేది పాత సామెత. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ‘మరింతగా తాగాలి.. డ్రంకెన్ డ్రైవ్‌కు చిక్కి వేసినంత జరిమానా కట్టాలి’ అనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో వైన్స్ వ్యాపారులను లిక్కర్ అమ్మకాలు పెంచాలంటూ ఆబ్కారీ అధికారులు మెడమీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తుండడంతో గగ్గోలు పెడుతున్నారు. బీర్ల అమ్మకాలను నామమాత్రం చేసి లిక్కర్ అమ్మకాలు భారీగా పెంచాలంటుండడంతో వ్యాపారులు గుస్సా అవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 180 వైన్స్‌లు ఉన్నాయి. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా తాజాగా ఉమ్మడి జిల్లాలోని అన్ని వైన్స్‌లకు రూ. 10 లక్షల మేర అరువు మీద సరుకు అంటగట్టారు. వ్యాపారులు అయిష్టంగానే తీసుకున్నా రు. ఇందుకు సంబంధించి వ్యాపారుల వద్ద నుంచి బలవంతంగా ఇప్పటివరకు రూ. 13 కోట్ల మేర చె క్కులు వసూలు చేశారు. ఈ చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని ఆగస్టు 3న చెల్లించాలని డెడ్‌లైన్ వి ధించారు. ఇది చాలదన్నట్లు ఈ నెలాఖరుకు సంబంధించిన టార్గెట్ మేరకు కూడా నగదు చెల్లించి సరుకు తీసుకోవాల్సిందేనని హుకుం జారీ కావడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనా భా ఆధారంగా, గతంలో జరిగిన అమ్మకాల మేరకు లక్ష్యం విధించారు. అమ్మకాలు తగ్గితే సదరు వైన్స్‌లపై కేసులు నమోదు చేయాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయిలో అధికారులు కూడా వాపోతున్నారు. వర్షం కారణంగా అమ్మకా లు తగ్గినా ఊరుకునేది లేదని కమిషనరేట్ నుంచి కోప్పడుతుండడంతో అధికారులు సైతం టెన్షన్ ప డుతున్నారు. అమ్మకాల పెంపు కోసం ఆబ్కారీ అధికారులు సర్కిల్స్ వారీగా నిరంతరం స మావేశాలు పెడుతున్నారు. అమ్మకాలు తగ్గితే మా త్రం ఆయా ప్రాంతాల్లో నాటుసారా, ఇతర రాష్ట్రాల మద్యం వస్తుందంటూ వైన్స్ వ్యాపారులను తిడుతుండడం విశేషం. ఉమ్మడి జిల్లాలో కొందరు ఆబ్కారీ సీఐలు దగ్గరుండి వ్యాపారులకు అప్పులిప్పించి మరీ సరు కు కొనిపించిన సందర్భాలు అనేకమున్నాయి. మరోవైపు పోలీస్‌శాఖ.. మద్యం అమ్మకాల విషయంలో ఆబ్కారీ శాఖ ఒక్క చిన్న అవకాశం కూడా వదలట్లేదు. ప్రభుత్వం కూడా అమ్మకాల విషయంలో తగ్గేదే లేదంటోంది. 2021 నవంబర్‌లో లాటరీ ద్వారా వైన్స్‌లు దక్కించుకున్నవాళ్లు డిసెంబర్ 1 నుంచి షాపులు ప్రాంరంభించాల్సిన నేపథ్యంలో నవంబర్ 28వ తేదీనే వాళ్లకు సరుకు అంటగట్టారు. షాపులు సమయానికి దొరకని వాళ్లు టెంటు వేసైనా సరే డిసెంబర్ 1న అ మ్మకాలు ప్రారంభించాలని ప్రభుత్వం తహసీల్దార్ల ద్వారా ఆదేశాలు జారీ చేయించడం గమనార్హం. అ యితే వైన్స్ వ్యాపారులు, పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ విషయమై ప్రస్తావించారు. ఆబ్కారీ అధికారులు పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం తమ టార్గెట్ తమకుందని, డ్రంకెన్ డ్రైవ్ ను ఆపడం కుదరదని తేల్చిచెప్పడంతో తకరారు ప డింది. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని ఒక చోట ఈ డ్రంకెన్ డ్రైవ్ నేపథ్యంలో ఒక వ్యక్తి వైన్స్ షెట్టర్‌ను కిందికి లాగి అమ్మకాలు చేయవద్దని గొడవ చేశాడు. దీంతో సదరు వ్యక్తిపై ఆబ్కారీ అధికారులు పోలీసు కేసు పెట్టారు. ఇలాంటి ఘటనలు పలుచోట్ల గతంలోనూ చోటుచేసుకున్నాయి. మొత్తంమీద ఆబ్కారీ అధికారులే దగ్గరుండి బెల్ట్ షాపులు మరిన్ని ఏ ర్పాటు చేసి అమ్మకాలు చేస్తుండడం విశేషం. అధికారులే అనుమతులిచ్చి.. మద్యం బెల్టు దుకాణాలను నిర్మూలించాల్సిన ఆబ్కారీ అధికారులే వాటిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తుండడం విశేషం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో వీడీసీలు, మ రికొన్ని ప్రాంతాల్లో సర్పంచ్‌లు, పెద్దలు మద్యం అమ్మకాలను లేకుండా చేసేందుకు ఆయా గ్రామాల్లో బెల్టు షాపులను పెట్టకుండా కట్టుబా ట్లు విధించారు. ఈ నేపథ్యంలో లిక్కర్ అమ్మకాలను పెంచేందుకు గాను ఆబ్కారీ అధికారులే బెల్టు షాపులు నిర్వహించేందుకు సహకరించాలని ఆయా గ్రామాల పెద్దలను, సర్పంచ్‌లను కలిసి మాట్లాడి ఒప్పిస్తుండడం విశేషం. ఎక్కువమంది సర్పంచ్‌లు బీఆర్ఎస్ వాళ్లే కావడంతో ఆబ్కారీ అధికారులు సంక్షేమ పథకాల కు డబ్బులు అవసరమనే మాటలు చెప్పి వారిని ఒప్పిస్తున్నారు. మరో విశేషమేమిటంటే బెల్టు షాపుల జోలికి వెళ్లొద్దంటూ పోలీసులకు సైతం చెప్పడం కొసమెరుపు. -
ఫార్ములావన్ రేసులకు బ్రిటన్ అనుమతి
లండన్: ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని కరోనా మింగేసింది. టెన్నిస్ ప్రియుల్ని ఈ అంశం బాధించింది. అయితే ఫార్ములావన్‌కు (ఎఫ్1) మాత్రం ఈ గండం లేదు. ప్రీమియం స్పోర్ట్ ఈవెంట్ అయిన ఫార్ములావన్ రేసులకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సిల్వర్‌స్టోన్ వేదిక ‘లాక్డౌన్’ నుంచి ‘ఓపెన్’ కానుంది. ఇక్కడ జరిగే రెండు రేసుల్లో పాల్గొనే వారి కోసం 14 రోజుల క్వారంటైన్ నిబంధనకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ ‘రయ్ రయ్’ కూతతో మోతెక్కనుంది. జూలై, ఆగస్టులో ఇక్కడ రెండు రేసులు జరుగనున్నాయి. బ్రిటన్ నిర్ణయంపై ఫార్ములావన్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ సీజన్లో రేసులు మళ్లీ మొదలయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. దీనిపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం సూచించే ముందు జాగ్రత్త చర్యలతో ముందడుగు వేస్తాం. ఈ రేసుల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తాం’ అని ఎఫ్1 అధికారి ఒకరు వెల్లడించారు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ కంటే ముందుగా... జూలై 5, 12వ తేదీల్లో ఆస్ట్రియాలో, 19న హంగేరీలో ఎఫ్1 రేసులు జరుగనున్నాయి. మొత్తానికి ఇంగ్లండ్‌లో ఆటలకు గేట్లు ఎత్తేయనున్నారు. దీంతో చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. -
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
-
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. స్నాతకోత్సవం ముగిసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, తను హాలు నుంచి బయటికి (బలవంతం చేయనప్పటికీ) రావాలని కోరారని తెలిపారు. ఇది తనకు తీరని అవమానమని కేరళకు చెందిన రుబీహా కంట తడి పెట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయవచ్చనే అనుమానంతోనే తనను కాన్వొకేషన్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా తన సర్టిఫికెట్‌ను మాత్రమే తీసుకుని, గోల్డ్‌మెడల్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ ఒక్కరికీ సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దారుణానికి వ్యతిరేకంగా తన బంగారు పతకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విద్యావంతులైన యువతగా తాము బలమైన వైఖరి తీసుకోవాలన్నారు. అయితే ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు. కాగా, విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలలో రుబీహా క్రమం తప్పకుండా పాల్గొనేవారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ క్యాంపస్ పర్యటనకు వ్యతిరేకంగా ఆమె నిరసనలకు నాయకత్వం వహించినట్టుగా సమాచారం. మరోవైపు బంగారు పతకాలను గెల్చుకున్న ఇతర విద్యార్థులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా కొంతమంది కేవలం సర్టిఫికెట్లను మాత్రమే స్వీకరించారు. -
‘హెచ్–1బీ’పై ట్రంప్ మరో పిడుగు!
హెచ్–1బీ వీసాదారుల కుటుంబాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పిడుగు వేయనున్నారు. సాధారణంగా హెచ్–1బీ వీసా ఉన్నవారు పెళ్లయ్యాక జీవిత భాగస్వామిని హెచ్–4 వీసాపై అమెరికా తీసుకెళ్తారు. హెచ్–4 వీసా ఉన్నవారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా అనుమతులిచ్చారు. తాజాగా ఆ అనుమతులను రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా హోంల్యాండ్ శాఖ ప్రకటించింది. ఒకవేళ ఈ అనుమతులు రద్దయితే భారతీయులు సహా దాదాపు లక్ష మంది అమెరికాలో ఉద్యోగాలు మానుకుని మళ్లీ ఇళ్లలో కూర్చోవాల్సి ఉంటుంది. సొంతంగా సంపాదించుకోగలిగిన ప్రతిభ ఉన్నప్పటికీ వారంతా తమ భర్తలు/భార్యల సంపాదన మీదే ఆధారపడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్–4 వీసాపై పనిచేస్తున్న భారతీయులు దాదాపు 70 వేల మంది ఉంటారనీ, వారిలోనూ 90 శాతం భార్యలేనని ఓ అంచనా. నాడు సానుకూలంగా స్పందించిన ఒబామా ‘హెచ్–1బీ వీసా కలిగిన తమ జీవిత భాగస్వామితో కలసి ఉండేందుకు సొంత దేశాన్ని వదిలి హెచ్–4 వీసాపై అమెరికా వచ్చేవారిలో ఎక్కువ మంది విద్యావంతులు, తగిన ప్రతిభ ఉన్నవారే. వీరంతా ఇళ్లకు ఎందుకు పరిమితం కావాలి? వీరికి ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. వీరినీ పనిచేసేందుకు అనుమతించాలి’ అని డిమాండ్లు రావడంతో హెచ్–4 వీసాపై వచ్చినవారు 2015 మే 26 నుంచి అమెరికాలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఒబామాæ సర్కారు ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు వరకు హెచ్–1బీ వీసా ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా కంపెనీల్లో పనిచేయాలంటే తమ భార్యలు/భర్తలకు గ్రీన్‌కార్డ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటికే లక్ష మందికి అనుమతులు 2015 జూన్–2017 జూన్ మధ్య వివిధ దేశాలకు చెందిన 1,04,748 మంది హెచ్–4 వీసాదారులు ఉద్యోగం చేసేందుకు అనుమతులు పొందారు. 2015లో 26,856 మంది, 2016లో 41,526 మంది 2017 జూన్ వరకు 36, 366 మంది హెచ్–4 వీసాదారులకు ఉద్యోగం చేసే అనుమతులు లభించాయి. ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు నిలిపేస్తే వీరందరూ కొలువులు కోల్పోతారు. కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకునే వారికీ ఇబ్బందే. కొన్ని కుటుంబాల్లో పిల్లలు అమెరికాలోనే పుట్టి వారికి అమెరికా పౌరసత్వమే సంక్రమించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పిల్లలు కలిగిన హెచ్–4 వీసాదారులను పనిచేసేందుకు అనుమతించకపోవడం అన్యాయమేనని ఓ వాదన. ఎన్నికల హామీలో భాగమే! అమెరికా జాతీయుల ఉద్యోగాలను ఇతర దేశాల వారు కొల్లగొడుతున్నారనీ, తాను గెలిస్తే దీనిని కట్టడి చేస్తానన్నది ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీ. హెచ్–1బీ సహా పలు వర్క్ వీసాల విధానాలను సమీక్షించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఉంది. హెచ్–4 వీసా కలిగిన వారికి పనిచేసేందుకు ఉన్న అనుమతులను రద్దు చేసే ప్రతిపాదనను మొదట ఈ ఏప్రిల్‌లోనే ప్రభుత్వం తెచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చొచ్చు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తీర్మానం ఒక్కటే... అనుమతులు 65
- లెక్కా పత్రం లేదు – కాతేరు అడ్డగోలుగా దోచేశారు – ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణ అనుమతులు – 65 దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియని వైనం – నిధుల జమా ఖర్చులు ఇప్పటికీ అప్పగించని సెక్రటరీ సత్యప్రసాద్ – చోద్యం చూస్తున్న పంచాయతీ ఉన్నతాధికారులు తీర్మానం ఒక్కటే...అనుమతులు మాత్రం 65. రాజమహేంద్రవరానికి కూతవేటు దూరంలో ఉన్న కాతేరు పంచాయతీలో లీలలివీ. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.30 కోట్లు నిధులు పక్కదారి పట్టాయని ఇటీవల చేసిన దర్యాప్తులో బట్టబయలయింది. నిధుల్లోనే కాదు ఆదాయం వచ్చే వివిధ మార్గాల్లో దారి కాచి మరీ నిధులు మింగేసిన ఘటనలు బయటపడుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు వచ్చిన దరఖాస్తులకు అనుమతులిచ్చామని ... ఇవన్నీ ఒకే తీర్మానంతో చేశామని సంబంధితాధికారులు చెబుతుండడంతో విన్నవారు విస్తుపోతున్నారు. ఇక వసూళ్లు చేసిన పన్నులు కూడా స్వాహా చేసి చేతులు దులుపుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు పంచాయతీని అధికారులు, స్థానిక నేతలతో కలిసి అడ్డగోలుగా దోచేసిన వ్యవహారంలో ఇప్పటి వరకూ నిధుల జమా ఖర్చులు చెప్పలేదు. ప్రతి పనినీ నిబంధనలకు విరుద్ధంగా చేసి కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. భవన నిర్మాణ అనుమతులు ఎన్ని ఇచ్చారో లెక్కా పత్రం లేదు. ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారంటే పాలన ఏ విధంగా సాగుతుందో స్పష్టమవుతోంది. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొరుకొండ మండలాల్లో 21 గ్రామాలను రాజమహేద్రవరం నగరపాలక సంస్థలో కలిపే ప్రతిపాదనలు గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. నగరానికి కూత వేటు దూరంలోనే కాతేరు పంచాయతీ కూడా ఉంది. ఇక్కడ తాజాగా చేసిన ప్రజా సాధికారత సర్వే ప్రకారం 8,900 గృహాలున్నాయి. జనాభా సంఖ్య 30 వేలకు పైగా ఉంది. విలీన ప్రతిపాదన నేపథ్యం, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో పంచాయతీ పాలక వర్గ ఎన్నికలు నిర్వహించ లేదు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పాలనా వ్యవహారాలు సాగుతున్నాయి. ఇంత పెద్ద పంచాయతీలో ఐదేళ్ల నుంచి పాలక మండలి లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను అడ్డగోలుగా వాడేసి లెక్కలు కూడా రాయలేదు. ఇంటి, కుళాయి పన్నులు ఇష్టానుసారం వసూలు చేసి సొంతానికి వాడుకున్నారు. కొత్త కుళాయి కనెక్షన్ కోసం రూ.4500 నుంచి రూ.6000 వసూలు చేశారు. ఆ నిధులన్నింటినీ పంచాయతీ జనరల్ ఖాతాకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకున్నారు. గతంలో కాతేరు పంచాయతీగా పని చేసి ప్రస్తుతం రూరల్ మండలంలోనే ఓ పెద్ద పంచాయతీలో పని చేస్తున్న కార్యదర్శి కుళాయి కనెక్షన్ కోసం ఇంటి యజమానుల వద్ద రూ.2,500 వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి మందలించడంతో 70 మందికి రూ.2500 లెక్కన తిరిగి ఇచ్చేశారు. ఇప్పటికీ లెక్కలు చెప్పని సస్పెండైన కార్యదర్శి, ప్రత్యేక అధికారి... పంచాయతీలో కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు రూ.1.30 కోట్లు గోల్మాల్ అయ్యాయన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఇందులో అధికంగా తప్పతోవ పట్టినట్టుగా తెలుస్తోంది. ట్రాక్టర్ కొనుగోలు చేసినా ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన బిల్లులు పెట్టలేదంటున్నారు. ఈ వ్యవహారం దాదాపు నాలుగు నెలల నుంచి జరుగుతున్నా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదిర్శి నుంచి జమా లెక్కలు స్వాధీనం చేసుకోలేదు. చర్యలు చేపట్టామని చెప్పేందుకు తూతూ మంత్రంగా కార్యదర్శి సత్యప్రసాద్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని చోద్యం చూస్తున్నారు. ఇన్చార్జి కార్యదిర్శిగా తొర్రేడు కార్యదర్శిని నియమించి నెలరోజులకుపైగా అవుతున్నా పంచాయతీకి సంబంధించిన రికార్డులు అప్పగించలేదు. సోమవారం రూరల్ మండలంలోని పంచాయతీల పాలనపై కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కాతేరు నిధుల వ్యవహారం చర్చకు వచ్చింది. ఇప్పటి వరకు నిధుల ఖర్చుకు సంబంధించిన రికార్డులు అప్పటి కార్యదర్శి సత్యప్రసాద్ నుంచి ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డీఎల్పీవో వరప్రసాద్‌ను ప్రశ్నించారు. కార్యదర్శిని సస్పెండ్ చేశామని డీఎల్పీవో బదులివ్వగా అతన్ను పిలిచి రికార్డులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. ఇంటి ప్లాన్ అనుమతులు, ఆదాయం ఎంత? అన్న వివరాలు కూడా లేకపోవతే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు మాయం... కాతేరు పంచాయతీలో అధికారులు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారనడానికి ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే ఓ ఉదాహరణని అన్నారు. ఇలా ఇచ్చిన 65 భవన నిర్మాణాలకు సంబంధించిన యజమానుల దరఖాస్తులు మాత్రం మాయమయ్యాయి. ఆ 65 భవనాలు ఎక్కడివో తేల్చే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు ఇచ్చారా? ఇస్తే ఆ భవనాలు ఎవరివో విచారణలో తేలనుంది. మెమో జారీ చేస్తున్నాం... సస్పెండైన కార్యదర్శి రికార్డులు అప్పగించాల్సి ఉంది. ఈ విషయం ప్రస్తుత ఇన్చార్జ్ కార్యదర్శి మా దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన రికార్డులు కూడా అప్పగించాల్సిందిగా కార్యదిర్శి సత్యప్రసాద్, ప్రత్యేక అధికారిగా ఉన్న ఈవోపీ ఆర్ అండ్ ఆర్డీలకు మెమో జారీ చేస్తున్నాం. 65 భవన నిర్మాణాలకు సంబంధించిన తీర్మానం పంచాయతీ కార్యాలయంలో ఉంది. కానీ 65 మంది భవన నిర్మాణదారులు దరఖాస్తులు ఉన్నాయో లేదో తెలియదు. ఈ వ్యవహారం ప్రత్యేక అధికారిగా ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టిలో ఉంది. – వరప్రసాద్, డీఎల్పీవో, రాజమహేంద్రవరం. -
'ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతి త్వరగా ఇవ్వండి'
- ఉమాభారతికి ఎంపీ వినోద్ లేఖ న్యూఢిల్లీ: బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరుతూ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం ఇక్కడ మీడియా కు విడుదల చేశారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేం దుకు ఇప్పటికే ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. దీనికి సీడబ్ల్యూసీ అనుమతి కోసం 2010లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ప్రాజెక్టు సీఈ సమర్పించా రు. ‘రాష్ట్ర నీటి పారుదల శాఖలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఉన్నప్పుడు సీడబ్ల్యూసీ పాత్రను కేవలం అంతర్రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీ వంటి అంశాలకే పరిమితం కావాలని నిబంధనలు చెబుతున్నాయి. సీడబ్ల్యూసీ తన పాత్ర వరకే పరి మితమై అనుమతులు త్వరగా మంజూరు చేసేలా చైర్మన్‌కు ఆదేశాలు జారీచేయగల రు. త్వరగా అనుమతి వస్తే జాతీయ ప్రా జెక్టు హోదా ప్రకటనకు మార్గం సుగమం అవుతుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.