సాక్షి, అనంతపురం: లాక్‌డౌన్ నేపథ్యంలో కొద్ది మంది మద్యం ప్రియులు అడ్డదారులు తొక్కుతున్నారు. మద్యం దాహాన్ని తీర్చుకునేందుకు కొద్ది మంది నాటుసారా, కల్లు, అక్రమ మద్యాన్ని ఆశ్రయిస్తుండగా.. మరికొందరు అడుగు ముందుకు వేసి ఏకంగా దగ్గు మందు, డైజోఫామ్ ట్యాబ్లెట్లు, వైట్‌నర్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాటుసారా, కల్తీ కల్లు, మద్యంపై చర్యలు ప్రారంభించిన అధికారులు.. మెడికల్ షాపులపైనా దృష్టి సారించారు. గుర్తింపు పొందిన డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందు, వైట్‌నర్లు, డైజోఫామ్ ట్యాబ్లెట్లను విక్రయించవద్దని మెడికల్ షాపు యాజమాన్యాలకు తేల్చిచెప్పారు. ఇందుకు అనుగుణంగా జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారులు.. మెడికల్ షాపు యాజమాన్యాలకు నోటీసులను కూడా అందజేశారు. చదవండి: 8 వేలు దాటిన కరోనా కేసులు
ప్రధానంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను బంద్ చేశారు. అంతేకాకుండా బార్లు కూడా మూతపడ్డాయి. దీంతో మద్యం దొరకడం కష్టంగా మారింది. ఇదే అదనుగా కొద్ది మంది అక్రమ మద్యం వ్యాపారానికి తెరలేపారు. టమాట లోడులతో పాటు అక్రమంగా మద్యాన్ని కర్ణాటక నుంచి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారులు పక్కా సమాచారంతో ఆదిలోనే అడ్డుకట్ట వేశారు. ఈ నేపథ్యంలో మందుబాబులు దగ్గు మందు, వైట్‌నర్లు, డైజోఫామ్ ట్యాబ్లెట్లను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇది అంతిమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయనుంది. ఈ నేపథ్యంలో గుర్తింపు పొందిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని విక్రయించవద్దని మెడికల్ షాపు యాజమాన్యాలకు ఎక్సైజ్‌శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు.
మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
జిల్లాలో మద్యం అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. నాటుసారా తయారీపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక మద్యానికి బానిసైన కొద్ది మంది డైజోఫామ్ ట్యాబ్లెట్లు, దగ్గుమందు, వైట్‌నర్ వాడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు విక్రయించవద్దని మెడికల్ షాపు యాజమాన్యాలకు నోటీసులు జారీచేశాం. – విజయశేఖర్, ఎక్సైజ్‌శాఖ డీసీ
చదవండి: కరోనా మిస్టరీలు
Comments
Please login to add a commentAdd a comment