సింగపూర్: బోనాల పండుగను సింగపూర్‌లో ఘనంగా నిర్వహించారు. బోనాలు నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో ఈ వేడుకలు 2021 జులై25న నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వం నిర్దేశించిన కరోనా నిబంధనల నడుమ ఈ వేడుకులు జరిగాయి.
మహంకాళీ ఆశీస్సులు
సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ(TCSS) భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పరిమిత సంఖ్యలో సభ్యులు బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని భక్తులు కోరుకున్నారు. కరోనా కోరల నుంచి ప్రపంచాన్ని కాపాడాలని సోసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఐదేళ్లుగా
ఐదేళ్ల కిందట తెలంగాణ కల్చరల్ సోసైటీ సభ్యులు సింగపూర్‌కి బోనాల పండుగను పరిచయం చేశారు. ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపు లో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేవి. ఈ ఆసరి కరోనా నిబంధనలతో పోతరాజు, పులివేషాలు సాధ్యపడలేదు.
బోనం సమర్ఫణ
ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో టీసీఎస్‌ఎస్ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్ కస్తూరి, గోనె నరేందర్ రెడ్డి రజిత, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ స్వాతి మరియు వ్యవస్థాపక మరియు పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి శ్రీదేవి దంపతులు ఉన్నారు. వీరితో పాటు సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి దంపతులు సొసైటీ తరపున ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా సునీతారెడ్డి, రోజారమణి, గోనే రజిత, జూలూరు పద్మజ, కాసర్ల శ్రీనివాసరావులు వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment