Telugu Cultural Association
-
హాంగ్‌కాంగ్‌లో ముచ్చటైన తెలుగు సాంస్కృతిక ఉత్సవం
సౌత్ చైనా సముద్ర తీరాన వున్న చిన్న ద్వీపం 'హాంగ్‌కాంగ్' లో ఇతర భారతీయ ప్రాంతాల వారితో పాటు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. వారి సంఖ్య చాలా తక్కువే అయినా, మన తెలుగు భాష , దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకి అందించే కృషి లో భాగంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పండుగ, ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల ఉత్సాహాన్ని మేళవించి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అధ్యక్షులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా 'తెలుగు సాంస్కృతిక ఉత్సవం' లో ముద్దులొలికే చిన్నారుల ఫాన్సీ డ్రెస్ ,పద్యాలు - శ్లోకాలు, భక్తి పాటలు, టాలీవుడ్ - కూచిపూడి నృత్యాలు, వయోలిన్ , కీబోర్డ్ , తబలా వాయిద్యాల తో చక్కని చిక్కని కర్నాటిక్ సంగీతాలు, అక్షరమాలలో సంపూర్ణ రామాయణం కథ, చిత్ర లేఖనం ..ఇలా అనేక అంశాలలో పిల్లలు తమ ప్రతిభలతో అందరిని మురిపించారు. వ్యాఖ్యాతలుగా ఇక్కడ పెరిగి పెద్దయి, ఇదే వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చిన రజిత మరియు హర్షిత, ఇద్దరు అక్కాచెల్లెలిద్దరు చక్కటి తెలుగులో నిర్వహించారు. ముఖ్య అతిధులుగా కౌన్సలార్ శ్రీ. కె. వెంకట రమణ గారు,కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ హాంగ్ కాంగ్ & మకావ్, స్థానిక ఇంటర్నేషనల్ ప్రైమరీ స్కూల్ హెడ్ శ్రీమతి ప్రియా కాంతన్ మరియు హాంగ్ కాంగ్ ఆర్ట్అఫ్ లివింగ్ టీచర్ శ్రీమతి సీమా హిరానందాని విచ్చేసి, పిల్లల ప్రతిభలని చూసి ఆనందించి, మెచ్చుకొని తల్లి తండ్రులని ప్రశంసించారు. పిల్లల్ని ఇలాగే తమ భాష, సంస్కృతీ, దేశం గురించిన ఇటువంటి కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనే లా ప్రోత్సహించాలని, సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. అతిధులకు తమ కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమ కార్యవర్గ సభ్యులను, వ్యాఖ్యాతలను, పిల్లలను వారి తల్లి తండ్రులకు దయవాదాలు తెలుపుతూ, అభినందించారు. -
ఆస్టిన్‌లో ఉత్సాహంగా దసరా - దీపావళి వేడుకలు
టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో తెలుగు కల్చర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి పండుగల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ గాయకులు గీత మాధురి ,అఖిల మమందుర్, ఆదిత్య ఐయాంగర్లు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో టీసీఏ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బత్తుల ప్రెసిడెంట్ ఎలెక్ట్ అర్జున్ అనంతుల ,సెక్రెటరీ శ్రీనివాస్ బైరపనేని ,ట్రెజరర్ వెంకట్ సాదినేని , స్పోర్ట్స్ కమిటీ చైర్ పరమేశ్వర్ రెడ్డి నంగి, ఫైనాన్స్ సెక్రటరీ మధుకర్ , ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ సెక్రటరీ చిన్నపరెడ్డి, మెంబర్షిప్ సెక్రటరీ భరత్ పిస్సాయ్ , కల్చరల్ సెక్రటరీ శైలజ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ వెంకటరామి రెడ్డి ఉమ్మ, రామ్ హనుమంత్ మల్లిరెడ్డి, మురళీధర్ రెడ్డి వేలూరు ధన్యవాదాలు తెలిపారు. -
సింగపూర్‌లో బోనాల పండుగ
సింగపూర్: బోనాల పండుగను సింగపూర్‌లో ఘనంగా నిర్వహించారు. బోనాలు నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో ఈ వేడుకలు 2021 జులై25న నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వం నిర్దేశించిన కరోనా నిబంధనల నడుమ ఈ వేడుకులు జరిగాయి. మహంకాళీ ఆశీస్సులు సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ(TCSS) భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పరిమిత సంఖ్యలో సభ్యులు బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని భక్తులు కోరుకున్నారు. కరోనా కోరల నుంచి ప్రపంచాన్ని కాపాడాలని సోసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదేళ్లుగా ఐదేళ్ల కిందట తెలంగాణ కల్చరల్ సోసైటీ సభ్యులు సింగపూర్‌కి బోనాల పండుగను పరిచయం చేశారు. ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపు లో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేవి. ఈ ఆసరి కరోనా నిబంధనలతో పోతరాజు, పులివేషాలు సాధ్యపడలేదు. బోనం సమర్ఫణ ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్ కస్తూరి, గోనె నరేందర్ రెడ్డి రజిత, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ స్వాతి మరియు వ్యవస్థాపక మరియు పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి శ్రీదేవి దంపతులు ఉన్నారు. వీరితో పాటు సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి దంపతులు సొసైటీ తరపున ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా సునీతారెడ్డి, రోజారమణి, గోనే రజిత, జూలూరు పద్మజ, కాసర్ల శ్రీనివాసరావులు వ్యవహరించారు. -
టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు
టొరంటో : తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరంటో(టీసీఏజీటీ) ఆధ్వర్యంలో మెగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. టొరంటోలోని బిషప్ ఆల్లెన్ అకాడమీ క్యాథలిక్ సెకండరీ స్కూల్లో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. టీసీఏజీటీ సెక్రటరీ దేవి చౌదరి ప్రాంభోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆటా, పాటలతో పాటూ పలు సంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. టోరంటో చుట్టు పక్కన ప్రాంతలైన మర్కమ్, బ్రాంప్టన్, మిస్సిసౌగా, ఓక్విల్లే, వాటర్డౌన్, కిట్చెనర్, వాటర్లూ, కేంబ్రిడ్జి, హామిల్టన్, మిల్టన్లతో పాటూ ఇతర ప్రాంతాలనుంచి వందలాది కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. గత ముప్పై ఏళ్లుగా టీసీఏజీటీ అందిస్తున్న సేవలను ప్రెసిడెంట్ కోటేశ్వరరావు పోలవరపు వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్టీలు, స్పాన్సర్లు, వాలంటీర్లుకు ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సూర్య బెజవాడ, దేవి చౌదరిలు కృతజ్ఞతలు తెలిపారు. -
తెలుగు సంస్కృతి, కళల పరిరక్షణకు సరికొత్త వేదిక
అనంతపురం జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల చొరవ ‘తెలుగు కల్చరల్ అసోసియేషన్’ ఏర్పాటు సాక్షి, బెంగళూరు : కన్నడ నాడులో తెలుగు సంస్కృతీ సౌరభాలను పరిమళింపజేయడంతో పాటు తెలుగు వారికి మాత్రమే సొంతమైన ప్రత్యేక కళలను పరిరక్షించేందుకు కొత్త వేదిక ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పుట్టిపెరిగి, అనంత పురం జేఎన్టీయూలో చదివి, బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న ఉద్యోగాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. సంస్థ కార్యకలాపాలు శనివారం నుంచి ప్రారంభమైన సందర్భంగా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఐటీఎస్ డెరైక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ...రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరినీ సంస్కృతి పరమైన బంధంతో ఏకం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో సంస్థ తరఫున కవితాగోష్టులు, కోలాటం, కూచిపూడి తదితర కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న మూడు నెలల్లో సంస్థలో వెయ్యి మంది సభ్యులను చేర్పించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. సంస్థ తరఫున తెలుగు కళలు, సాంప్రదాయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కళల పరిరక్షణకు కూడా పాటుపడతామని చెప్పారు. తెలుగు కల్చరల్ అసోసియేషన్ కి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరేందుకు త్వరలోనే రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీని సంస్థ సభ్యులు కలవనున్నారన్నారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక సభ్యులు ఎం.సి.ఎస్.రెడ్డి, డి.వి.జె.ఎస్.శ్రీధర్, హన్నన్, శ్రీధర్ గుప్తా, హరి తదితరులు పాల్గొన్నారు.