సౌత్ చైనా సముద్ర తీరాన వున్న చిన్న ద్వీపం 'హాంగ్‌కాంగ్' లో ఇతర భారతీయ ప్రాంతాల వారితో పాటు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. వారి సంఖ్య చాలా తక్కువే అయినా, మన తెలుగు భాష , దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకి అందించే కృషి లో భాగంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పండుగ, ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల ఉత్సాహాన్ని మేళవించి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అధ్యక్షులు తెలిపారు.
ఈ సంవత్సరం కూడా 'తెలుగు సాంస్కృతిక ఉత్సవం' లో ముద్దులొలికే చిన్నారుల ఫాన్సీ డ్రెస్ ,పద్యాలు - శ్లోకాలు, భక్తి పాటలు, టాలీవుడ్ - కూచిపూడి నృత్యాలు, వయోలిన్ , కీబోర్డ్ , తబలా వాయిద్యాల తో చక్కని చిక్కని కర్నాటిక్ సంగీతాలు, అక్షరమాలలో సంపూర్ణ రామాయణం కథ, చిత్ర లేఖనం ..ఇలా అనేక అంశాలలో పిల్లలు తమ ప్రతిభలతో అందరిని మురిపించారు. వ్యాఖ్యాతలుగా ఇక్కడ పెరిగి పెద్దయి, ఇదే వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చిన రజిత మరియు హర్షిత, ఇద్దరు అక్కాచెల్లెలిద్దరు చక్కటి తెలుగులో నిర్వహించారు.
ముఖ్య అతిధులుగా కౌన్సలార్ శ్రీ. కె. వెంకట రమణ గారు,కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ హాంగ్ కాంగ్ & మకావ్, స్థానిక ఇంటర్నేషనల్ ప్రైమరీ స్కూల్ హెడ్ శ్రీమతి ప్రియా కాంతన్ మరియు హాంగ్ కాంగ్ ఆర్ట్అఫ్ లివింగ్ టీచర్ శ్రీమతి సీమా హిరానందాని విచ్చేసి, పిల్లల ప్రతిభలని చూసి ఆనందించి, మెచ్చుకొని తల్లి తండ్రులని ప్రశంసించారు.
పిల్లల్ని ఇలాగే తమ భాష, సంస్కృతీ, దేశం గురించిన ఇటువంటి కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనే లా ప్రోత్సహించాలని, సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. అతిధులకు తమ కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమ కార్యవర్గ సభ్యులను, వ్యాఖ్యాతలను, పిల్లలను వారి తల్లి తండ్రులకు దయవాదాలు తెలుపుతూ, అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment