టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు | London Talk Bonala Jatara 2024 NRI NEWS Latest | Sakshi
Sakshi News home page

టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

Published Sat, Jul 13 2024 5:10 PM | Last Updated on Sat, Jul 13 2024 5:18 PM

London Talk Bonala Jatara 2024 NRI NEWS Latest

ప్రత్యేక ఆకర్షణగా తొట్టెల ఊరేగింపు,  పోతురాజు ఆటలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లండన్ కి ఉన్నత చదువులకోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, మన తెలంగాణ సంస్కృతి కోసం బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు. పోతురాజు విన్యాసాన్నీ ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రసంశించి సత్కరించారు.

టాక్ అధ్యక్షుడు  రత్నాకర్ కడుదుల మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణ రెడ్డి అధ్యక్షతన   ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతగా ఉపాధ్యక్షులు సత్య మూర్తి చిలుముల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  హౌంస్లౌ నగర డిప్యూటీ  మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్  పాల్గొన్నారు.

హౌంస్లౌ నగర డిప్యూటీ  మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ మాట్లాడుతూ.. యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని,  టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.

స్థానిక కౌన్సిళ్లర్లు అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, ఆదేశ్ ఫర్మాహాన్, బంధన చోప్రా మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి,  అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే,ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు.

కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని,. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని తెలిపారు.

టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ ,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు.టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు   అనిల్ కూర్మాచలం అన్న  తన సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నాం అని తేలిపారు.

సంస్థ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి మాట్లాడుతూ, టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో  మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన  ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.

ఎన్నారై బీ.  ఆర్. యస్ యూకే అధ్యక్షులు మరియు టాక్ జాతీయ కన్వీనర్  అశోక్ దూసరి గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, , ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన  నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్   స్పాన్సర్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపిక లతో ప్రశంసించారు. టాక్ ముఖ్య నాయకులు  సుప్రజ పులుసు, గణేష్ కుప్పలా, హరి గౌడ్ నవపేట్, సురేష్ బుడగం,   రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, శ్రీకాంత్, క్రాంతి  మాట్లాడుతూ  బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషం గా ఉందని  తెలిపారు. ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో  టాక్ అద్యక్షులు రత్నాకర్ కడుదుల, అశోక్ దూసరి, శుష్మున రెడ్డి, సత్య చిలుముల , మట్టా రెడ్డి , వెంకట్ రెడ్డి , సురేష్ బుడగం , జహ్నవి వేముల , రవి రేతినేని , రవి ప్రదీప్ పులుసు , రాకేష్ పటేల్ , సత్యపాల్ , మల్లా రెడ్డి,గణేష్ కుప్పాల , సత్యం కంది , శ్రీకాంత్ జెల్ల , శ్రీధర్ రావు , మధుసూదన్ రెడ్డి ,  శైలజ జెల్ల ,స్నేహ , శ్వేతా మహేందర్ , స్వాతీ , క్రాంతి , పవిత్ర , సుప్రజ , శ్వేత , శ్రీ విద్య , నీలిమ , పృద్వి , మని తేజ ,గణేష్ పాస్తం , నిఖిల్ రెడ్డి , హరి గౌడ్ , నవీన్ రెడ్డి , కార్తీక్ , రంజిత్ , రాజేష్ వాక, మహేందర్, వంశీ , ఆనంద్ , అక్షయ్ , పావని , జస్వంత్ , శివ వెన్న , నాగ్ , మాడి, వినోద్ , సన్నీ , సందీప్  తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement