
- పీవీ సింధు
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్ నగరంలోని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారిని శనివారం ఉదయం కుటుంబసమేతంగా దర్శించుకుంది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి వచ్చిన సింధుకు ఆలయ పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకున్న సింధు కుటుంబసభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రతియేటా అమ్మవారి సన్నిధికి వచ్చి బోనాలు సమర్పిస్తానని తెలిపింది.