చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 17న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించ డానికి శనివారం పాతబస్తీ నుంచి తరలివెళ్లారు. పాతబస్తీ హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాలయం నుంచి ప్రతినిధులు విజయవాడకు బయలుదేరారు.
ఆదివారం విజయవాడలోని బ్రహ్మణ వీధి నుంచి ర్యాలీ లాగా బయలుదేరే బోనాల జాతర ఉత్సవాలను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ప్రారంభిస్తారని కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలిపారు. కళాకారులు, పోతరాజుల నృత్య ప్రదర్శనలతో ర్యాలీగా వెళ్లి కనక దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించనున్నామన్నారు. పాతబస్తీలోని 23 దేవాలయాల కమిటీ ప్రతినిధులతో పాటు 500 మంది కళాకారులు విజయవాడకు వె ళ్లారు.
బెజవాడ దుర్గమ్మకు పాతబస్తీ బోనాలు
Published Sat, Jul 16 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement