Bejawada durgamma
-
దుర్గమ్మకు అగ్గిపెట్టెలో చీర సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను సోమవారం సమర్పించారు. బంగారం, వెండి జరీతో చేసిన ఈ చీరకు ప్ర త్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఐదు గ్రాముల బంగారం, పది గ్రాముల వెండిని ఉపయోగించి మంచి పట్టు దారాలతో ఈ చీరను నేశామన్నారు. దీని బరువు సుమారు 100 గ్రాములు ఉంటుందని తెలిపారు. చేనేత వృత్తిని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నానని వివరించారు. చదవండి: రామోజీ.. మీ ప్రేమ మాకు అక్కర్లేదు.. అప్పుడెక్కడ దాక్కున్నావు? -
దుర్గాదేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైనున్న జగజ్జనని దుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. మహాగౌరిగాశ్రీశైల భ్రమరాంబ శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నందివాహనంపై ఆసీనులను కావించి అలంకార మండపంలో ఉంచారు. తేజోనిధిగా సూర్య ప్రభపై.. నక్షత్ర వెలుగులో చంద్రప్రభపై తిరుమల కొండ మీద శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ సంబరం అంబరాన్ని తాకేలా సాగుతోంది. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్యప్రభపై ఊరేగుతూ స్వర్ణకాంతులతో దివ్యతేజోమూర్తి భక్తులకు దర్శనమి చ్చారు. రాత్రి చంద్రప్రభపై చల్లని చంద్రకాంతుల్లో భక్తులను అనుగ్రహించారు. శ్రీవేంకటేశ్వరుడికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు. సూర్యుడు తేజోనిధి, ప్రకృతికి చైతన్య ప్రదాత, సకల రోగాల నివారకుడు. స్వర్ణకాంతులీనే భాస్కరుడిని సప్తఅశ్వాల రథసారధిగా చేసుకుని మలయప్ప మత్స్య నారాయణుడి అలంకారంలో స్వర్ణ కాంతులీనుతూ ఉదయం వేళ తిరుమాడవీధుల్లో వైభవంగా విహరించారు. ఇక భగవంతుని మారు రూపమైన చంద్రుడిని వాహనంగా మలుచుకున్న వేంకటాచలపతి రాత్రి వేళలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు. -
లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం లలితాత్రిపుర సుందరీ అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. చక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా భక్తులను అనుగ్రహించారు. శుక్రవారం కావడంతో లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి పైన ఆది దంపతుల నగరోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. కాగా, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఆరో రోజైన శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. రేపు మూలా నక్షత్రం.. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి రూపంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహించనున్నారు. ఆ రోజు ఆలయానికి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో ఆ రోజు వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. మూలానక్షత్రం రోజు వృద్ధులు, వికలాంగులు దర్శనాలకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, మూలా నక్షత్రం సందర్భంగా ఆదివారం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. -
అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో నాలుగో రోజైన గురువారం దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టు వ్రస్తాలను సమర్పించారు. గురువారం సుమారు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. అన్నపూర్ణాదేవి విశేష అలంకారం కావడంతో భక్తులు ప్రసాద స్వీకరణకు బారులు తీరారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభు త్వ విఫ్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. నేడు శ్రీలలితా త్రిపుర సుందరిగా.. దసరా ఉత్సవాల్లో 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. -
బెజవాడ పోలీసుల అదుపులో బంగ్లాదేశీయులు
-
బెజవాడ దుర్గమ్మకు పాతబస్తీ బోనాలు
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 17న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించ డానికి శనివారం పాతబస్తీ నుంచి తరలివెళ్లారు. పాతబస్తీ హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాలయం నుంచి ప్రతినిధులు విజయవాడకు బయలుదేరారు. ఆదివారం విజయవాడలోని బ్రహ్మణ వీధి నుంచి ర్యాలీ లాగా బయలుదేరే బోనాల జాతర ఉత్సవాలను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ప్రారంభిస్తారని కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలిపారు. కళాకారులు, పోతరాజుల నృత్య ప్రదర్శనలతో ర్యాలీగా వెళ్లి కనక దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించనున్నామన్నారు. పాతబస్తీలోని 23 దేవాలయాల కమిటీ ప్రతినిధులతో పాటు 500 మంది కళాకారులు విజయవాడకు వె ళ్లారు.