![Jogini Syamala Slams Telangana Government - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/29/Jogini-Syamala.jpg.webp?itok=CMpmusz0)
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ విఫలం అయ్యాయని జోగిని శ్యామల ఫైర్ అయ్యారు. ఏర్పాట్ల లోపం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బోనం ఎత్తుకొని వెళ్లే క్యూ లైన్‌లో పోలీసులు ఇతర భక్తలను పంపారని అన్నారు.
మరోవైపు గంటల తరబడి బోనం ఎత్తుకుని లైన్‌లలో మహిళలు వేచి చూడాల్సివచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాలు ఉత్సవంలో పోలీసుల అత్యుత్సహం ప్రదర్శించారు. ఉజ్జయిని మహంకాళి డ్యూటీలో ఉన్న ఓ చానెల్ రిపోర్టర్‌పై పోలీసు అధికారి చేయి చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మీడియా పాయింట్ వద్ద రిపోర్టర్లు, కెమెరామెన్‌లు నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment