syamala
-
కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి
-
చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
కమ్మర్పల్లి (నిజామాబాద్): వరద కాలువలో చెల్లెల్ని కాపాడబోయి అక్క నీట మునిగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గాం«దీనగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గాం«దీనగర్‌కు చెందిన చిత్తారి రాజు, మంజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కాలనీకి చెందిన పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి కామారెడ్డి నుంచి మంజుల తండ్రితోపాటు ఆమె సోదరి పానేటి శ్యామల కూడా వచ్చారు.పంచాయితీ జరుగుతున్న సమయంలో మంజుల ‘నేను చనిపోతా’అంటూ పరుగెత్తికెళ్లి కాలనీకి పక్కనే గల కాలువ వద్దకు వెళ్లి అందులో దూకింది. చెల్లెల్ని కాపాడేందుకు శ్యామల, కాలనీ వాసులు కూడా కాలువ వద్దకు వెళ్లారు. శ్యామల ధైర్యం చేసి కాలువలోకి దూకింది. కాలనీ వాసులు చీరను విసరగా మంజుల దాన్ని పట్టుకొని పైకి వచ్చింది. కానీ శ్యామల ప్రమాదవశాత్తు కాలువలో మునిగిపోయి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్యామల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోపై యాంకర్ శ్యామల రియాక్షన్
-
భర్త ఆటో డ్రైవర్.. భార్యకు డాక్టరేట్
బంజారాహిల్స్ (హైదరాబాద్): భర్త ఆటో డ్రైవర్.. అయితేనేం అతని భార్య పట్టుదలతో డాక్టరేట్ సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా బొడ్డెమ్మ పాటలు, జనజీవన చిత్రన అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకుని తగిలి శ్యామల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సంపాదించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన శ్యామల బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఓయూ ఓరియంటల్ విభాగం తెలుగు శాఖ నుంచి డాక్టరేట్ పొందారు. శ్యామల ఆంధ్రసారస్వత పరిషత్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా బొడ్డెమ్మ ఆటలో పాటలను ముందు తరాల వారికి లిఖితరూపకంగా అందించాలనుకున్నారు. బొడ్డెమ్మ పాటలను పరిశోధనాంశంగా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన పీహెచ్డీ సిద్ధాంత గ్రంథానికి సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు పర్యవేక్షకులుగా వెంకట్‌రెడ్డి, సిల్మా నాయక్ సహకరించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామల భర్త చెరుకు రాంచందర్ ఆటో నడుపుతూ తనను చదివించారని ఆయన కష్టాన్ని వృథా చేయకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్: 80వ పుట్టినరోజు.. కేజీల విత్తనాలు) -
నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు? యాంకర్ శ్యామలపై వర్మ కామెంట్స్
RGV Comments On Anchor Syamala: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిందే చేస్తాడు.. ఎవరేమనుకున్నా పట్టించుకోడు.. ఇదీ ఆర్జీవీ నైజం. ఇక ఈ మధ్యకాలంలో లేడీ యాంకర్లను తెగ పొగిడేస్తున్న వర్మ తాజాగా యాంకర్ శ్యామలపై రొమాంటిక్ కామెంట్స్ చేశారు. 'బడవ రాస్కెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా యాంకర్ శ్యామలపై పొగడ్తలు కురిపించారు. 'ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఇప్పటివరకు ఎలా తప్పించుకున్నారు' అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కక్షణం షాక్ అయిన శ్యామల తెగ నవ్వేసింది. అలాగే తాను తోపు, రౌడీ, గూండాలతో పాటు రాస్కెల్ కూడా అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు. కాగా యాంకర్ శ్యామలపై ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. -
హల్చల్ : కత్రినా క్యూట్ లుక్స్.. ఊర్వశి మెరుపులు
♦ గోల్డెన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఊర్వశి ♦ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో శిల్పారెడ్డి ♦ ఆ హుక్ స్టెప్ నా ఫేవరేట్ అంటున్న శిల్పా శెట్టి ♦ సంతోషంగా ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలంటున్న హరితేజ ♦ రీల్స్‌తో అదరగొడుతున్న టిక్‌టాక్ స్టార్స్ ♦ రీల్స్ పోస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్ ♦ అకీరాతో ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్ ♦ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఝాన్సీ ♦ ఈ వారం అద్భుతంగా ఉండబోతుందన్న ఉపాసన ♦ నో మేకప్లుక్ ఫోటో షేర్ చేసిన నటి షెఫాలి View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ
సాక్షి, హైదరాబాద్: భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించారు. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13 గంటల 43 నిమిషాల్లోనే ఈది ఔరా అనిపించారు. శ్రీలంక తీరం నుంచి శుక్రవారం ఉదయం 4.15 గంటలకు బయల్దేరిన ఆమె సాయంత్రం 5.58 గంటలకు రామేశ్వరంలోని ధనుష్కోటి చేరుకున్నారు. 2012లో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది పాక్ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లో ఈదిన సంగతి తెలిసిందే. ఆయనే శ్యామలకు ఈతలో మెళకువలు నేర్పి, మెరుగైన శిక్షణ ఇప్పించారు. కాగా, పాక్ జలసంధిని ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళ శ్యామల కావడం విశేషం. యానిమేటర్ నుంచి స్విమ్మర్ వరకు.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామలది మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్ లిఫ్టర్. తాను క్రీడారంగంలో ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం వాటికి దూరంగా ఉంచాలని ఆయన భావించారు. శ్యామలను ఐఏఎస్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ చదువుపై అంతగా ఆసక్తిలేని శ్యామల.. చిత్రకళపై దృష్టిసారించి యానిమేటర్ అయ్యారు. మా జూనియర్స్ చానల్లో యానిమేషన్ సిరీస్ చేశారు. లిటిల్ డ్రాగన్ అనే యానిమేషన్ సినిమా కూడా తీశారు. అయితే, ఆ సినిమాతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో యానిమేషన్‌కు విరామిచ్చారు. అనంతరం 44 ఏళ్ల వయసులో స్విమ్మింగ్ నేర్చుకుని మరో కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. పలు ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. గతంలో హుగ్లీలో 14 కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా పాక్ జలసంధిని విజయవంతంగా అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు. -
శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆ శ్యామలదేవి ఎవరో కూడా తెలియదు. నా భూమి పక్క భూమి ఆమెది అని తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ... నన్ను ఇప్పటివరకూ కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. (మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు) కాగా భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఈ నెల 6వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది. -
బొమ్మలేసే చేతులు నదిని గెలిచాయి
ఈమె పేరు శ్యామల గోలి. చిన్నప్పటి నుంచి చదువులో యావరేజ్.. తండ్రి ఒకటి తలిస్తే తాను ఇంకోటి నేర్చుకున్నారు. ఎవరూ ఊహించని దారి ఎంచుకున్నారు.. బొమ్మల్ని కదిలించి యానిమేటర్ అయ్యారు.. నష్టాలకు ఎదురీదారు. తన 44వ యేట స్విమ్మింగ్‌ను కెరీర్‌గా తీసుకున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఇటీవల (డిసెంబర్ 22వ తేదీన) హుగ్లీలో పధ్నాలుగు కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ అన్ని విజయాల వెనక ఒక ఫెయిల్యూర్ ఇచ్చిన ప్రేరణ ఉంది. తండ్రి చెప్పిన మాట తాలూకు శక్తి ఉంది. శ్యామల సొంతూరు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట. మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్ లిఫ్టర్. చాలా రికార్డులు బ్రేక్ చేశారు. కాని తన ముగ్గురు పిల్లలను క్రీడలకు దూరంగా పెట్టారు. ఆటల్లో నెగ్గుకు రాగలరేమో కాని ఆ రంగంలోని రాజకీయాల్లో నెగ్గుకు రావడం కష్టమని.. ఆ రంగంలోని కష్టనష్టాలను చూసి, అనుభవించిన వాడిగా. వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్లినప్పుడల్లా జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిల్లో ఐఏఎస్ ఆఫీసర్ల హోదా, వాళ్లకు అందే గౌరవాలు చూసి తన పెద్ద కూతురు శ్యామల (శ్యామలకు ఒక తమ్ముడు, చెల్లి)ను ఐఏఎస్ చేయాలని నిశ్చయించుకున్నాడు. శ్యామల మాత్రం అనుకోలేదు, ఆసక్తీ చూపించలేదు. అందుకే ఆమె గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం. పెళ్లితో కాదు.. ఆర్థిక స్వాతంత్య్రంతో.. చదువులో అంతగా ఆసక్తిలేని శ్యామలకు మొదటి నుంచీ చిత్రలేఖనం మీదే శ్రద్ధ. హైస్కూల్లో ఉన్నప్పుడే బీఈడీ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ కోసం కాన్సెప్ట్ డెవలప్‌చేసి.. బొమ్మలు గీసిస్తూండేవారు. పిల్లలను ఆటలకు దూరంగా ఉంచారే కాని తండ్రిగా వెంకటరాజు పిల్లలనెప్పుడూ బంధించలేదు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక్క మగపిల్లాడి మధ్య లింగవివక్షనూ చూపించలేదు. చిన్నప్పుడొకసారి శ్యామల తనకు ఇష్టమైన సినిమా నటుడి బొమ్మతో ఉన్న పేపర్‌ను పుస్తకానికి అట్టగా వేసుకుంటే చూసి ‘‘ అమ్మాయికి పెళ్లి పరమావధి కాదు.. ఆర్థిక స్వాతంత్య్రంతోనే జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఇలాంటి బొమ్మలు పెళ్లి మీదకు ఆలోచనలు మళ్లిస్తాయి’’ అని కూతురిని హెచ్చరించారు. ఆ మాటతో అప్పటికప్పుడు అట్టను చించనైతే చించేశారు కాని చదువు మీద ఆసక్తయితే పెంచుకోలేదు ఆమె. ఫలితం.. టెన్త్‌లో ఫెయిల్. ఆ ఫెయిల్యూరే ఆమెలో పట్టుదలను పెంచి తర్వాత విజయాలను చూపించింది. నాగార్జున యూనివర్శిటీలో ఎమ్మే సోషియాలజీ చేయించింది. తర్వాత.. ‘‘ఏముంది? పెళ్లి. మా వారి పేరు మోహన్. సివిల్ ఇంజనీర్. అయితే మా నాన్న మాట మాత్రం మరచిపోలేదు’’అంటూ తన జీవితంలోని తర్వాత ఘట్టం చెప్పారు శ్యామల. రెండేళ్లకు బాబు పుట్టాడు. అప్పుడు వాళ్లాయన ఉద్యోగరీత్యా గుజరాత్లో ఉన్నారు. ఒకసారి సంక్రాంతి కోసమని సామర్లకోట వచ్చారు. తర్వాత రెండు నెలలకే బంధువుల పెళ్లి ఉంటే చంటిబాబుతో మళ్లీ అంతదూరం ప్రయాణం చేసి రావడం కష్టమని శ్యామలను ఊళ్లోనే ఉంచి అతను వెళ్లిపోయారు. ఆ టైమ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు శ్యామల. కాకినాడలోని ఎరీనా మల్టీమీడియా ఇన్స్టిట్యూట్లో చేరి మల్టీమీడియా, వెబ్‌డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. యేడాది కోర్స్‌ను మూడు నెలల్లో పూర్తిచేశారు శ్యామల. సరిగ్గా అప్పుడే భర్తకు బెంగళూరు బదిలీ అయింది. మకాం బెంగళూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓ ఊరికి మారింది. యానిమేషన్ సిరీస్.. మల్టీ మీడియా, వెబ్‌డిజైనింగ్‌లో డిప్లొమా కోర్స్ ఇచ్చిన నేర్పు, నైపుణ్యంతో, తండ్రిమాటనూ ప్రాక్టికల్ చేయడానికి ఫోటోగ్రాఫిక్స్ స్టూడియో పెట్టారు. మంచి లాభాల్లో సాగుతూన్నప్పుడే పిల్లాడి స్కూల్ కోసం బెంగళూరుకి షిఫ్ట్ కావల్సి వచ్చింది. ఖాళీగా కూర్చోవడం ఇష్టంలేక ఉద్యోగం కోసం వెదికారు. చిన్న యానిమేషన్ స్టూడియోలో ఉద్యోగం దొరికింది. అప్పటికే బాబు కోసం స్పైడర్ మాన్లాంటి యానిమేషన్ క్యారెక్టర్ ఒకటి తయారు చేయాలని పంచతంత్ర కథలను తనే రిటోల్డ్ చేసుకొని.. బొమ్మలు గీస్తూ.. గ్రాఫిక్ చేస్తూ .. వాటికి తన వాయిస్‌నే రికార్డ్ చేస్తూండేవారు ఇంట్లో. తను పనిచేస్తున్న స్టూడియోలోనే మణిరత్నం ‘బాయ్స్’సినిమాలోని ఒక పాటకు విజువల్ ఎఫెక్ట్స్ తయారు చేసిన శరత్ అనే యానిమేటర్‌తో పరిచయం అయింది ఆమెకు. ‘‘ఆయన పనితీరు గమనిస్తూండేదాన్ని. ఆయనేమో తనను ఎక్కడ కాపీ కొడతున్నానో అనుకొని మానిటర్‌ను నాకు కనపడకుండా తిప్పుకొనేవారు. ఆనక నా వర్క్ గురించి తెలిసి కొన్ని టెక్నిక్స్ నేర్పించాడు’’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు శ్యామల. తర్వాత కొద్దికాలానికే ఆ స్టూడియో మూత పడింది. కాని ఆమె ఆగలేదు. డిజిటల్ డ్రీమ్ డిజైనర్స్ పేరుతో వెబ్డిజైనింగ్లోకి అడుగిడారు ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకొని. చెన్నై నుంచి సౌది అరేబియాదాకా దాదాపు రెండువందలకు పైగా దేశీ, విదేశీ ప్రాజెక్ట్‌లకు పనిచేశారు. ఈలోపు భర్తకు హైదరాబాద్‌లో మంచి అవకాశం రావడంతో అనివార్యంగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది ఆమె. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్స్‌కి పనిచేస్తూనే తన చిరకాల వాంఛ అయిన యానిమేషన్ ప్రాజెక్ట్ మీదా మనసు పెట్టారు. ఆ పైలట్ ప్రాజెక్ట్స్‌ను తీసుకొని ప్రతి టీవీ చానల్‌కు వెళ్లి డెమోస్ ఇచ్చేవారు. ఏ చానలూ స్పందించలేదు. యేడాది తర్వాత ‘మా టీవీ’ వాళ్లు ‘మా జూనియర్స్’ చానెల్‌ను ప్రారంభిస్తూ ఆమెను పిలిచారు యానిమేషన్ సిరీస్ కావాలని. అప్పడు దొరికింది యానిమేషన్ ఫిలమ్సలో ఆమెకు బ్రేక్. పిల్లలున్న ప్రతి ఇంటికీ గోలి శ్యామల సుపరిచితులయ్యారు. ఏకైక మహిళా యానిమేషన్ సిరీస్ ప్రొడ్యూసర్‌గా దాదాపు పదేళ్లు కొనసాగారు. సొంత ప్రొడక్షన్లో కొన్ని ప్రయోగాలూ చేశారు. అందులో భాగంగానే లిటిల్ డ్రాగన్ అనే యానిమేషన్ మూవీ తీసి ఆర్థికంగా నష్టపోయారు. దాంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అది శారీరక ఆరోగ్యం మీదా ప్రభావం చూపించడంతో యానిమేషన్‌ను పాజ్ చేశారు. స్విమ్మింగ్‌తో.. చిన్నప్పటి నుంచి నీళ్లంటే భయపడే శ్యామల తన ఆరోగ్యాన్ని నీటిలోనే వెదుక్కున్నారు. మూడేళ్ల కిందట ఈత నేర్చుకొని. కెరీర్‌గా మలచుకుని. 44వ యేట రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగిన పోటీలు, ఈవెంట్లలో పాల్గొని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్‌ను దాటేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. ‘‘సాధించాలనే పట్టుదలకు వయసు ఏ మాత్రం అడ్డుకాదని నన్ను ప్రోత్సహిస్తున్న కోచ్ ఆయుష్ యాదవ్‌కు కృతజ్ఞతలు. నా ప్రతి ఎఫర్ట్ నాకో కొత్త విషయాన్ని నేర్పింది. మరింత తర్ఫీదునిచ్చింది. వీటన్నింటికీ వెన్నంటే ఉన్న మా వారు, మా అబ్బాయి, మా నాన్నే నా స్ట్రెన్త్. విమెన్ సేఫ్టీకి సంబంధించి ఒక యానిమేషన్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన ఉంది’’ అని చెప్తారు శ్యామల గోలి. – సరస్వతి రమ -
ఆ క్రెడిట్ రెబల్స్టార్దా? శ్యామలదా?!
పెళ్లయి ఇరవై మూడేళ్లయింది. అప్పుడే తీసి కడిగిన పెళ్లి ఫొటోలా ఫ్రెష్‌గా ఉన్నారు! ఇన్నేళ్ల బాధ్యతలు, ఒత్తిళ్లు, పిల్లల పెంపకం.. ఇవేవీ.. వీళ్ల అనురాగ బంధాన్నిచెక్కు చెదరనివ్వలేదా! ‘‘ఎందుకు చెదరనిస్తాయి?’’ అని అడుగుతున్నారు ఈ దంపతులు. క్రెడిట్ ఎవరిది? రెబల్స్టార్దా, శ్యామలగారిదా?! ‘‘చిన్నచిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుంటే.. ఆ క్రెడిట్ ఇద్దరిదీ అవుతుంది’’ అని అంటున్న మిస్టర్ అండ్ మిసెస్ కృష్ణంరాజుతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఈ సండే మీకోసం. ఇటీవల కృష్ణంరాజుగారికి ఆరోగ్యం బాగాలేదని విన్నాం.. ఏం జరిగింది? శ్యామల: ఏం లేదు.. జస్ట్ వైరల్ ఫీవర్. దానికే ఎవరికి వాళ్లు ‘క్రిటికల్’ అని ఊహించుకున్నారు. మనిషి బాగున్నప్పుడు అలా అనుకుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. కృష్ణంరాజు: ఆ బాధ, కోపంతోనే నేను గన్ షూట్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోను తను సోషల్ మీడియాలో పెట్టింది. అనవసరమైన గాసిప్పులు ప్రచారం చేస్తే షూట్ చేస్తానని అర్థం (నవ్వులు). మరి... పెళ్లి రోజుని (నవంబర్ 20) ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? శ్యామల: వైరల్ ఫీవర్ అని చెప్పాను కదా. అందుకని ఇంట్లోనే చేసుకున్నాం. మామూలుగా అయితే లంచ్‌కో, డిన్నర్‌కో బయటకు వెళతాం. పిల్లలు మంచి హోటల్స్‌లో మాకోసం పార్టీ ఎరేంజ్ చేస్తారు. మీ పెళ్లయి 23 ఏళ్లు అట కదా... ఇన్నేళ్ల వైవాహిక జీవితం గురించి... కృష్ణంరాజు: ఇన్నేళ్లయిందా అనిపిస్తోంది. రోజులు అంత వేగంగా వెళ్లిపోయాయనిపించింది అంటే జీవితం హ్యాపీగా ఉన్నట్లే. ఒక మంచి కలలా సాగిపోతోందంటే.. మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కారణం. కోపాలు ఎవరికైనా ఉంటాయి. అలా కోపం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుకోం. కోపం తగ్గి, కొంత గ్యాప్ ఇచ్చాక మాట్లాడుకుంటాం చూడండి.. అది మాత్రం భలే ఉంటుంది. పెళ్లి రోజుకి కానుకలు ఇచ్చుకుంటారా? శ్యామల: కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్. నేనేం కొనుక్కున్నా కాదనరు. నేను పెట్టుకునే నగలు, కట్టుకునే చీరలు అన్నీ ఆయన కొనేవే. అన్నింటికీ మించి ఆయనే నాకు పెద్ద బహుమతి. మరి.. శ్యామలగారు ఇచ్చిన బహుమతుల గురించి? కృష్ణంరాజు: నేను ‘మెటీరియల్ గిఫ్ట్’లని నమ్మను. తనే నాకు గిఫ్ట్. శ్యామల: నేను మాత్రమే కాదు.. బుద్ధిమంతులైన ముగ్గురు పిల్లలను గిఫ్ట్‌గా ఇచ్చా(నవ్వుతూ). కృష్ణంరాజుగారికి మీరు అభిమాని. అభిమాన హీరోతో పెళ్లి విశేషాలు చెబుతారా? శ్యామల: పెళ్లిరోజున కృష్ణంరాజుగారి వైపు తలెత్తి చూడాలంటే వణుకు. అలా తలొంచుకుని కూర్చున్నాను. ఎలాగో ధైర్యం కూడదీసుకుని ముందు కాళ్ల నుంచి మెల్లిగా చూసుకుంటూ ముఖం చూశాను. నాకసలు కలా? నిజమా? అర్థం కాలేదు. పెళ్లికి ముందు రోజు విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చాం. మాకు మంచి విడిది ఏర్పాటు చేశారు. నాకు చిన్నప్పటినుంచీ జామకాయలంటే ఇష్టం. విడిదింట్లో జామచెట్టు ఉంది. నేను వెళ్లి కోసుకుంటుంటే ‘పెళ్లి కూతురివి.. అలా కొయ్యకూడదు’ అని అమ్మ మందలించింది. మీ మీద ‘రెబల్ స్టార్’ ట్యాగ్ ఉంది. మీ ఆహార్యం చూస్తేనే వణుకు సహజం. మరి.. శ్యామలగారికి మీరు ధైర్యం చెప్పారా? కృష్ణంరాజు: ఏం భయపడొద్దు అన్నాను. శ్యామల: వీళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ. అందుకని అమ్మ భయపడింది. అంతమందిలో నేను ఇమడగలుగుతానా లేదా అని భయం. కానీ కృష్ణంరాజుగారు నాతో ‘ఎవరో ఏదో అంటారని నువ్వు భయపడొద్దు. ఏ పని చేసినా చక్కగా చెయ్’ అని బాగా ధైర్యం ఇచ్చారు. మరి.. పెళ్లి చూపుల గురించి? శ్యామల: వాళ్ల కజిన్‌ని పంపించారు. అమ్మాయిని బలవంతంగా ఒప్పించి, పెళ్లి చేస్తున్నారా? ఇష్టపడే చేసుకుంటుందా? అడిగి తెలుసుకోమన్నారు. ‘నాకిష్టం’ అని చెప్పాను. ఆయన కజిన్ వచ్చేసరికి మా ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నాను. ‘నేను వెళ్లేసరికి వదినగారు పిల్లలతో ఆడుకుంటున్నారు’ అని ఆయన చెబితే, ‘అయితే ఓకే.. మనస్తత్వం కూడా పిల్లల్లానే ఉంటుంది. మంచిదే’ అని నా ఫొటో చూసి, ఓకే చేశారు. కృష్ణంరాజుగారి మొదటి భార్య చనిపోయాక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు... బాగా చూసుకుంటారో లేదోననే డౌట్ ఏమైనా ఉండేదా? శ్యామల: అస్సలు లేదు. ఆయన మంచితనం గురించి ముందే మాకు తెలుసు. ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరుంది. అయితే పెద్ద ఫ్యామిలీలో ఇమడగలనా? అనే భయం అమ్మకి ఉండేది. కానీ నేను వచ్చిన కొన్నాళ్లకే అందరికీ దగ్గరయ్యాను. ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది? కృష్ణంరాజు: బేసిక్‌గా నా అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. వారి అభిప్రాయాలను తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా నడుచుకుంటాను. ఒకరి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే అండర్స్టాండింగ్ ఉండదు. తన విషయంలోనే కాదు.. నా పిల్లల విషయంలోనూ నేను అంతే చేస్తాను. ముందు వాళ్లేమనుకుంటున్నారో వింటాను. ఒక్కరి మాటే నెగ్గాలనుకోం. పిల్లలను నమ్మాలి. వాళ్లు ఎక్కడికెళ్లినా ప్రశ్నలు అడగడం, ఇంటికొచ్చాక ఎక్కడికెళ్లావని అడుగుతుండడం వల్ల ఎలాగూ అమ్మానాన్న మనల్ని నమ్మడం లేదు.. చేస్తే ఏం పోతుందిలే అన్నట్లుగా పిల్లల మనస్తత్వం మారుతుంది. ఆ స్కోప్ ఇవ్వకూడదు. శ్యామల: మనం నమ్మితే పిల్లలు ఆ నమ్మకాన్ని నిలబెడతారన్నది మా ఇద్దరి అభిప్రాయం. కృష్ణంరాజు: ‘జీన్స్’ అంటారు కదా.. అది నిజమే. ఆ ఫ్యామిలీ తాలూకు జీన్స్ పిల్లలకు కచ్చితంగా వస్తాయి. నా చిన్నప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే నన్ను పిలిచి ‘మన కుటుంబం ఇలాంటిది. మన పూర్వీకులు ఇలాంటివారు’ అని చెబితే, నా మనసులో నాటుకుపోయింది. మా నాన్నగారు ఎన్నో వందల కుటుంబాలను ఆదుకున్నారు. ఓసారి వరద వస్తే.. ఆ ఊరి చుట్టూ గట్టు కట్టించారు. వరద నీళ్లు ఇళ్లల్లోకి వస్తే.. ఆ ఊళ్లో ఉన్నవాళ్లను మా ఇంట్లోనే ఉండమని, వాళ్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్, మేలో కొంతమందికి పనులు ఉండేవి కాదు. వాళ్లకు బస్తాలు బస్తాలు బియ్యం ఇచ్చేవారు. పని చెప్పాలి కదా అని ఏదో పని చెప్పేవారు. అయితే ఎంతమందికి చెబుతారు. అందుకని పని చెప్పలేనివాళ్లకు కూడా సహాయం చేసేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. అవన్నీ తెలిసిన వ్యక్తిగా నాకూ సహాయం చేయడం అలవాటైంది. అలాగే కుటుంబ పరువుకి నష్టం కలగకూడదనేది డెవలప్ అయింది. అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పినట్లుగా ఇప్పుడు నేను నా పిల్లలకు చెబుతుంటాను. అలాగే మా నాన్నగారికి ఉన్న సహాయ గుణం నాకు వచ్చినట్లుగా నా పిల్లలకూ వచ్చింది. ‘కుటుంబ గౌరవం’ అనే విషయాన్ని నా పిల్లలు కూడా తెలుసుకున్నారు. పిల్లలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తిలతో కృష్ణంరాజు దంపతులు మీకు ముగ్గురు ఆడపిల్లలు... చదువుల విషయంలో, ఇతర వ్యక్తిగత విషయాల్లో వాళ్లకు మీరు ఇస్తున్న గైడెన్స్ గురించి? కృష్ణంరాజు: మా అమ్మాయిలు ఎప్పుడైనా డౌన్ అయితే ‘యు ఆర్ కృష్ణంరాజుస్ డాటర్.. యు ఆర్ గ్రేట్. డోంట్ వర్రీ. భయపడొద్దు. మీ గురించి ఎవరో ఏదో చెబుతారని అనుకోవద్దు. నేను నమ్మను’ అని చెబుతుంటాను. అలా నమ్మి పెంచడంవల్ల ముగ్గురూ చదువులో బెస్ట్. మా పెద్దమ్మాయి సాయిప్రసీద లండన్‌లో మెరిట్ మీద ఎంబీఏ సీట్ సంపాదించుకుంది. ఇప్పుడు ప్రొడక్షన్ వైపు రావాలనుకుంటోంది. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ప్రొడక్షన్ కోర్స్ చేస్తోంది. చిన్న పాప సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుతోంది. మంచి పర్సంటేజ్ రావడంతో జేఎన్టీయులో సీట్ వచ్చింది. ఇంకో దాంట్లో కూడా వచ్చింది. తను బొమ్మలు బాగా గీస్తుంది. వాళ్ల ప్రభాస్ అన్నయ్య బర్త్‌డేకి బొమ్మ గీసి ఇస్తుంది. మూడోపాప సైకాలజీ చదువుతానంది. సరే.. మూడు నాలుగు లక్షలు డొనేషన్ కడతా అన్నాను. ఒకరోజు వచ్చి ‘నా మూడు లక్షలు నాకు ఇవ్వండి’ అంది. ఏంటని అడిగితే ‘నాకు మేనేజ్మెంట్ కోటా అక్కర్లేదు.. ఇదిగో నేను మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాను. సీట్ నేనే తెచ్చుకుంటా. డొనేషన్ కట్టాలనుకున్న డబ్బు నాకివ్వండి’ అంది. తండ్రి పేరుని వాడుకోవడం తప్పు కాదు. అయితే వాళ్లంతట వాళ్లు సీట్ సంపాదించుకోవాలనుకున్నారు. నటుడిగా నేను చాలా గొప్పవాడిని అయ్యుండొచ్చు. కానీ వ్యక్తిగా కూడా నాకు చెడ్డ పేరు లేదనే అనుకుంటాను. గౌరవంగా బతకాలన్నది నా అభిప్రాయం. పిల్లలు కూడా అదే అనుకుంటారు. పిల్లలు ఇంత చక్కగా పెరగడంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది? కృష్ణంరాజు: తన పాత్రే ఎక్కువ ఉంటుంది. నిద్ర లేచిన దగ్గర్నుంచి వాళ్లకి ఏం కావాలి? ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే చదువుకోగలుగుతారు? ఇలా అన్నీ తనకు తెలుసు. తనకి నాతో కలిపి మొత్తం నలుగురు పిల్లలు. మరి.. ముగ్గురు అమ్మాయిలను పెంచడం కష్టంగా ఉందా? బాబునా? శ్యామల: (నవ్వుతూ).. నాకు ఈయన్ని పెంచడమే చాలా ఇష్టం. కంటికి రెప్పలా చూసుకుంటాను. పిల్లలు పుట్టాక చాలామంది భర్త మీద ప్రేమ తగ్గిందని, శ్రద్ధ తగ్గిందని అంటారు. కానీ నాకు మాత్రం ముందు ఆయనే. ఆయన్ను చూసుకుంటూ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను. పిల్లల సెలవులప్పుడే నేను గుడికి వెళుతుంటాను. ఆ సమయంలో వాళ్ల నాన్న దగ్గర పిల్లల్ని పెట్టి నేను పూజలకు వెళతాను. ఒంటరిగా ఆయన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను. మీ పుట్టింటికి కూడా వెళ్లలేదా? మీ అత్తింటివాళ్లు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? శ్యామల: వెళ్లాలన్నా ఆ టైమ్‌కి ఎవరైనా ఆయన దగ్గర ఉంటేనే వెళతాను. అది కూడా ఒకటీ రెండు రోజులు మాత్రమే. మా పెళ్లికిముందు మా మామయ్యగారికి నేను కలలో కనిపించానట. ఆ అమ్మాయే మన ఇంటికి కోడలిగా వస్తుందని అన్నారట. నేను అత్తింటికి రాగానే ‘నాకు కలలో కనిపించిన అమ్మాయి తనే. నా కొడుకుని బాగా చూస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అన్నారు. అత్తింట్లో ప్రేమకు లోటు లేదు. కృష్ణంరాజుగారికి అందరి ఆకలి తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. ఆ విషయంలో అత్తింట్లో వాళ్లకి భార్య ఎలా చూస్తుందో అని కాస్త టెన్షన్ ఉండేది. కానీ నేను వచ్చి, చూసుకోవడం మొదలుపెట్టాక ఆ టెన్షన్ పోయింది. (మధ్యలో కృష్ణంరాజు అందుకుంటూ).. మా అమ్మ అయితే చాలా టెన్షన్ పడేది. ఆకలైనా చెప్పేవాడిని కాదు. నీరసం వచ్చి అలా నిద్రపోయేవాడిని. అందుకని వాడు అడగడు.. మనమే పెట్టాలని పెట్టేది. ఇప్పుడు ఈవిడ అలానే పెడుతుంది. మరి.. షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఎలా? శ్యామల: ఆయన కోసం పని చేసేవాళ్లను కూడా ట్రైన్చేసి పెట్టాను. ‘సార్ అడగరు.. మధ్యలో మీరే అడుగుతూ ఉండండి’ అని చెప్పాను. వాళ్లు కూడా అలానే చేస్తారు. కృష్ణంరాజుగారు భోజనప్రియుడు.. మీరు చేసే వంటల్లో ఆయనకు బాగా నచ్చినవి? శ్యామల: అన్నీ ఇష్టమే. ముఖ్యంగా నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. అయితే ఇంతకుముందుకన్నా ఇప్పుడు తక్కువ తింటున్నారు. ఈ మధ్య ఎవరో ‘ఏంటి సార్.. మరీ తక్కువ తింటున్నారు?’ అని అడిగితే ‘మేం ఏడుజన్మలకు సరిపడా తినేశాం’ అన్నారు (నవ్వులు). ఆయనకు పెసరట్టు అంటే ఇష్టం. వాళ్ల పెద్దక్కగారు బాగా చేసేవారు. ఆవిడ దగ్గర్నుంచి ఆయన నేర్చుకుని, నాకు నేర్పించారు. ఆయన చేపల కూర కూడా మీరు వంట ఎలా నేర్చుకున్నారు? కృష్ణంరాజు: నేను వేటకు వెళ్లేవాడిని. పచ్చ పావురాలు అని ఉండేవి. చాలా రుచిగా ఉంటాయి. పొద్దున్నే అవి వేటాడి తీసుకు వస్తే.. అక్కడే అడవిలో వండి పెట్టేవాళ్లు. కొండ గొర్రె అంటారు. అది కూడా బాగుంటుంది. లంచ్‌కి కొండ గొర్రె. ఒక్కోసారి పులి గాండ్రింపులు వినపడినప్పుడు వంట చేసేవాళ్లు భయపడి పారిపోయేవాళ్లు. అప్పుడు నేనే వంట చేసేవాడిని. అయితే నాకు అన్నం వార్చడం వచ్చేది కాదు. రెండు మూడు సార్లు చేతులు కాల్చుకున్నాను కూడా. రామారావుగారు నిషేధం విధించాక వేట మానేశాను. ఎప్పుడైనా పులిని వేటాడారా? కృష్ణంరాజు: లేదు. అయితే నా వెనకాల నుంచి ఒక్క పరుగుతో ముందుకు వెళ్లింది. పులి మహా పిరికి. తననెవరైనా ఎటాక్ చేస్తారనే అనుమానం కలిగితేనే అది ఎటాక్ చేస్తుంది. లేకపోతే చేయదు. శ్యామల: మీకు ఓ పులి ఫ్యాన్ కదా.. కృష్ణంరాజు: అవును. ఒక పులి ఉండేది. ‘కటకటాల రుద్రయ్య’ కోసం ఆ పులిని తీసుకొచ్చారు. అది గాండ్రించడం మొదలుపెట్టింది. నేను దాని మెడ దగ్గర మెల్లిగా అలా నిమురుతూ మచ్చిక చేసుకున్నాను. ఆ పులితో నాకు ఫైట్‌సీన్ ప్లాన్ చేశారు. అంతకుముందు నేను దాని మెడ పట్టుకుంటే విసిరి కొట్టింది. అంతదూరం పడ్డాను. అయితే మచ్చిక చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీ అయిపోయింది. నేను దాని మెడ పట్టుకుంటే అది అలా చూస్తూ ఉండిపోయింది. చివరికి మేమే అది ఫైట్ చేసినట్లు మ్యానిపులేట్ చేశాం (నవ్వుతూ). అదే పులిని ఏడాది తర్వాత వేరే సినిమా కోసం తీసుకొస్తే.. నన్ను గుర్తుపట్టేసి, ఫ్రెండ్లీ అయిపోయింది. లాభం లేదని దాన్ని పంపించేసి, వేరే పులిని తీసుకొచ్చి, ఫైట్ సీన్ తీశాం. మీ విషయాలు వింటుంటే భలే ఉంది... ఫైనల్లీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్‌కి కొన్ని టిప్స్? ఇద్దరూ: ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకుంటున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయితే పెళ్లయ్యాక కొంతమంది మగపిల్లలు మారిపోతున్నారు. ఆంక్షలు పెడుతున్నారు. ఫ్రెండ్లీనెస్ పోతోంది. అది తప్పు. అది తెలుసుకోలేక గొడవలు పడి విడిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి కొన్ని జంటలు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటున్నట్లు ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య ఆ పోటీ తప్పు. ఇద్దరూ సమానం అనుకోవాలి. అలాగే ‘ఈగో’ సమస్యలు ఒకటి. కొంచెం మనసు పెట్టి ఆలోచించి, చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉంటే కాపురం హాయిగా ఉంటుంది. – డి.జి. భవాని మీ ఇంటి నుంచి వేరే సెలబ్రిటీల ఇంటికి క్యారేజ్‌లు వెళుతుంటాయట కదా? శ్యామల: వెళుతుంటాయి. వస్తుంటాయి కూడా. కృష్ణంరాజుగారి కోసం షూటింగ్ లొకేషన్‌కి భోజనం తీసుకెళ్లేదాన్ని, మొత్తం యూనిట్‌కి సరిపడా పట్టుకెళ్లేదాన్ని. చిరంజీవిగారి ఇంట్లో దోసెలు బాగుంటాయి. ఆ మధ్య చిరంజీవిగారిని కలిసినప్పుడు ఆ మాట అంటే.. ‘అన్నయ్యా.. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ ఎన్నింటికి చేస్తావో చెప్పు.. ’ అని అడిగి, ఒక ఆదివారం దోసెలు, రెండు రకాల చట్నీలు పంపించారు. ఎంజాయ్ చేస్తూ తిన్నాం. సురేఖ (చిరంజీవి సతీమణి) గారు అంత బాగా చేస్తారు. మా ఇంట్లో బిర్యానీ చేసి, ఆవిడ పంపిన క్యారియర్‌లో పెట్టి పంపించాం. చిరంజీవిగారు మధ్యాహ్నం తిని, సాయంత్రం కూడా తింటానని ఉంచమన్నారట. ఆ మధ్య మోహన్బాబుగారింట్లో జరిగిన పార్టీకి వెళ్లినప్పుడు చిరంజీవిగారు ఆ విషయం చెప్పారు. ప్రభాస్ గురించి? శ్యామల: మా ఆయన్ను ‘పెద్ద బాజీ’ అని బాబు పిలుస్తాడు. నన్ను ‘కన్నమ్మా’ అని పిలుస్తాడు. ప్రభాస్ మాకు కొడుకే. ఇప్పుడు మా ప్రభాస్ ఏమంటాడంటే.. ‘ఇన్నేళ్లు కష్టపడ్డారు. ఇప్పుడు మీరు సుఖపడాలి. మిమ్మల్ని మేం హ్యాపీగా చూడాలి’ అని వాళ్ల పెదనాన్నతో అంటాడు. పెదనాన్న అంటే.. ఆయనకు సుప్రీమ్ అన్నమాట. అంత ప్రేమ. చెల్లెళ్లతో కూడా చాలా ప్రేమగా ఉంటాడు. -
‘కేసీఆర్.. శ్యామల కన్నీళ్లు కనిపించలేదా’
సాక్షి, హైదరాబాద్ : బంగారు తెలంగాణలో సగభాగం అయిన మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళల ఓట్లతో రాష్ట్రంలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. నేడు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని, మహిళలు నరకకూపంలోకి వెళ్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఆదివారం జరిగిన బోనాల వేడుకల్లో మహిళలు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. మేం మాట్లాడితే రాజకీయాలని కొట్టిపారేస్తారని, మరి భవిష్యవాణి చెప్పిన అమ్మవారే ఇలాంటివి చెప్పడం రాష్ట్రం మొత్తం టీవీల్లో చూసిందన్నారు. ఆకుల విజయం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బంగారు బోనం తెచ్చినా కూడా మహిళల్లో ఆనందం లేదు. అధికారులు, పోలీసుల దురుసు ప్రవర్తనతో జోగిని శ్యామల కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మీ ప్రభుత్వ చేతకాని తనం. శ్యామల కన్నీళ్లు మీకు కనిపించలేదా కేసీఆర్. బంగారు బతుకమ్మతో పాటు బంగారు బోనం సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎంపీ కవితది అయింది. రాష్ట్రంలో మహిళ అంటే కవిత ఒక్కరేనా. ఇంకో మహిళ కూడా కనిపించడం లేదా.? నిన్న మహిళా రిపోర్టర్లు, యాంకర్లు అక్కడ ధర్నా చేయాల్సిన దుస్థితి. భవిష్యవాణి చెప్పే వారు(స్వర్ణలత), జోగిని శ్యామల ఇలా అందరూ ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆలోచించాలి. కవితకు ఏం అర్హత ఉంది? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు జాతర చేసుకుంటుంటే సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీస్ అధికారి సుమతి దురుసుతనానికి మీరు కారణం కాదా. స్వామీజీని బహిష్కరించిన తీరు, జోగిని పట్ల మీ తీరుపై మీరు సమాధానం చెప్పాలి. వచ్చే రోజుల్లో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరిస్తున్నాం. సికింద్రాబాద్‌లో బోనాన్ని ఏ అర్హతతో కవిత ఎత్తుకున్నారు. కవితకు, సికింద్రాబాద్‌కు ఏమైనా సంబందం ఉందా. సీఎం కేసీఆర్ సతీమణి బోనం ఇస్తే మాకు ఏ అభ్యంతరం ఉండేది కాదు. బోనాల నేపథ్యంలో జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని’ ఆకుల విజయ డిమాండ్ చేశారు. బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
‘శ్యామల చెప్పింది నిజమైతది’
సాక్షి, హైదరాబాద్: ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని శ్యామలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హన్మంతరావు మద్దతు తెలిపారు. శ్యామల చెప్పింది నిజమైతదని, తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వపాలన ముగియక తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణలో సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కావాలనే నిర్వహించడంలేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. గ్రామాలకు ప్రత్యేక అధికారుల వస్తే తరిమి కొట్టండని వీహెచ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో డిక్టేకర్ రాజ్యం నడుస్తోందని, ప్రజలు ఈ ప్రభుత్వంపైన తిరగబడితే కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు తాయిలాలే తప్ప రాజకీయంగా న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య చెప్పి, ఇప్పుడు మళ్లీ బీసీల గణన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని వీహెచ్ కోరారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయించే ఆనవాయితీ ఉందని తెలిపారు. ప్రజల్లో తిరిగే ఓపిక ఇంకా ఉందని, కాంగ్రెస్ కోసం ఒక కార్యకర్తలా పనిచేస్తానని పేర్కొన్నారు. -
శ్యామల ఫైర్.. స్పందించిన తలసాని
సాక్షి, హైదరాబాద్ : బోనాల పండుగ ఘనంగా జరిగిందని, విదేశీయులు సైతం ఈ సంబరాలకు హాజరయ్యారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందంటూ కొందరు కామెంట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం జరిగిన రంగం కార్యక్రమం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. జోగిని శ్యామల కాస్త ఇబ్బంది పడ్డారని విన్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. లక్షల మంది వచ్చినప్పుడు జరిగిన అసౌకర్యాన్ని ఆమె అర్థం చేసుకోవాలంటూ శ్యామలకు మంత్రి తలసాని సూచించారు. ‘చిన్న చిన్న అసౌకర్యాలు జరిగాయి. స్థలం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు బాగా సహకరించాయి. అయితే జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు పూర్తిగా తెలుసు. ప్రభుత్వంపై ఆమె కామెంట్ చేయడం సరికాదు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని’ మంత్రి తలసాని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ -
పోలీసుల తీరుపై జోగిని శ్యామల ఫైర్
-
తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ విఫలం అయ్యాయని జోగిని శ్యామల ఫైర్ అయ్యారు. ఏర్పాట్ల లోపం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బోనం ఎత్తుకొని వెళ్లే క్యూ లైన్లో పోలీసులు ఇతర భక్తలను పంపారని అన్నారు. మరోవైపు గంటల తరబడి బోనం ఎత్తుకుని లైన్లలో మహిళలు వేచి చూడాల్సివచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాలు ఉత్సవంలో పోలీసుల అత్యుత్సహం ప్రదర్శించారు. ఉజ్జయిని మహంకాళి డ్యూటీలో ఉన్న ఓ చానెల్ రిపోర్టర్‌పై పోలీసు అధికారి చేయి చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మీడియా పాయింట్ వద్ద రిపోర్టర్లు, కెమెరామెన్లు నిరసన వ్యక్తం చేశారు. -
ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ గాడ్ గిఫ్ట్
ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ దేవుడిచ్చిన వరమని ప్రముఖ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల అన్నారు. బాహుబలి-2 సినిమా వీక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... 'ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది నా మాట కాదు. ప్రపంచం అంతా ఒకటే మాట. అదే బాహుబలి. దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమిమీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం బాహుబలి సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే రాజమౌళి, ప్రభాస్ ఫ్యామీలి కూడా. ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ గాడ్ గిఫ్ట్. వెరీ ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను' అని అన్నారు. మరోవైపు బాహుబలి-2 చిత్రంపై ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమాలో ప్రభాస్-అనుష్క జంట చాలా బాగుందని, అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా అదిరిపోయాయని తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు మిగిలిన దిక్షిణాది రాష్ట్రాల్లోనూ బాహుబలి దుమ్మురేపుతున్నాడు. త్రివేండ్రం, చెన్నైల్లో సినీ ప్రేమికులు బాహుబలికి సాహో అంటున్నారు. ఇక బాహుబలి ఫీవర్‌తో ఉత్తరాది ఊగిపోతోంది. ఖాన్ త్రయం సినిమాలకు మించిన క్రేజ్‌తో నార్త్‌లోనూ దుమ్మురేపుతోంది. మల్టీఫ్లెక్స్‌ల నుంచి మామూలు థియోటర్ల వరకూ ఎక్కడ చూసినా బాహుబలి సందడే కనిపిస్తోంది. -
ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ గాడ్ గిఫ్ట్
-
నయీమ్‌లానే ఉన్నారు
కృష్ణంరాజు సతీమణి శ్యామల గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖయ్యూం భాయ్’. కట్టా రాంబాబు, నందమూరి తారకరత్న, ప్రియ, హర్షిత, చలపతిరావు, సుమన్ తదితరులు ముఖ్య పాత్రల్లో భరత్ పారేపల్లి దర్శకత్వంలో పత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో కట్టా శారద చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు సాగర్, నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ నాగభూషణం ఆవిష్కరించారు. శ్యామల మాట్లాడుతూ– ‘‘రాంబాబుగారు అచ్చం నయీమ్‌లానే ఉన్నారు. టీజర్ బాగుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, భరత్‌కి, యూనిట్‌కి మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ‘‘భరత్ మంచి టెక్నీషియన్ అయినా రావాల్సినంత పేరు రాలేదు. ‘ఖయ్యూం భాయ్’ ఆయనకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం యాక్షన్ నేపథ్యంలో ఉంటుంది. మే రెండో వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ చిత్రం చేశా. క్వాలిటీ, ఖర్చు విషయంలో రాజీ పడలేదు’’ అని కట్టా రాంబాబు చెప్పారు. కట్టా శారద, నటుడు బెనర్జీ, నిర్మాత టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
మతిస్థిమితంలేని యువతి ఆత్మహత్య
మల్యాల: కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన మతి స్థిమితంలేని ఓ యువతి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ముస్కు శ్యామల(21) అనే యువతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. తల్లి లచ్చవ్వ కూతురిని పలు హాస్పిటల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది. మంగళవారం తల్లి లచ్చవ్వ బీడీలు ఇచ్చేందుకు కంపెనీకి వెళ్లగా శ్యామల తలుపులు వేసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టగా అప్పటికే 90 శాతం కాలిపోయింది. 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా ఆమె అప్పటికే మృతిచెందింది. -
వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య
నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం బండారి శ్యామల(32) అనే వివాహిత తన ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత సంవత్సరం నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి బ్రతుకుదెరువు నిమిత్తం 10 క్రితం వచ్చి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వివాహితకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చనిపోతా...అనుమతి ఇవ్వండి
మదనపల్లి(చిత్తూరు జిల్లా) : బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు న్యాయమూర్తి ఎదుట మొరపెట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం ఉదయం మదనపల్లి రెండవ అదనపు జిల్లా కోర్టులో చోటుచేసుకుంది. మదనపల్లి విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాయిపేట నారాయణ, శ్యామల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కూలిపనులు చేసుకుని జీవించేవారు. వీరి రెండవ కుమార్తె రెడ్డిమాధవి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఏడాది కాలంగా ఆమె బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. బెంగుళూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో పెద్దపెద్ద ఆస్పత్రులలో చూపించినా ప్రయోజనం లేకపోయింది. రెడ్డిమాధవి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోంది. ఆమె చిక్కిశల్యమైంది. ఇటీవల బెంగుళూరు ప్రైవేటు ఆస్పత్రిలో చూపిస్తే 6లక్షలు ఖర్చు తెస్తే వైద్యం చైస్తామని చెప్పారు. కూలిపనులు చేసుకునే తాము అంతమొత్తం భరించలేమని, ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో తాము కాలం గడుపుతున్నామని, అందువల్ల తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని వారు న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఈ మేరకు న్యాయమూర్తికి లేఖ అందజేశారు. -
ప్రేమ వివాహం
ప్రేమ సమాజంలో ఎదిగిన సతీష్ సింహాచలం దేవస్థానంలో శ్యామలతో కల్యాణం రూ. 25వేలు నగదు అందించిన సమాజం పెద్దలు డాబాగార్డెన్: ప్రేమ సమాజం.. ఎంతో మంది అనాథల జీవితాల్లో వెలుగులు పంచుతోంది. జీవితంలో వారికి ఎదగటానికి అవకాశాలు కల్పిస్తోంది. వారి వివాహం దగ్గరుండి చేయించి అండగా నిలబడుతోంది. అలా రెండేళ్ల ప్రాయంలో ప్రేమ సమాజంలో చేరి జీవితంలో ఎదిగిన ఓ యువకుడి వివాహం గురువారం రాత్రి జరగనుంది. అతనికి ప్రేమ సమాజం పెద్దలు, ప్రముఖుల ఆశీర్వాదాలు బలంగా ఉన్నాయి. రెండేళ్ల వయసున్న మగబిడ్డ, నెలల వయసున్న ఆడ శిశువు(అతని సోదరి)ను 1993లో ఓ కానిస్టేబుల్ ప్రేమ సమాజంలో చేర్పించారు. ప్రేమ సమాజం పెద్దలు వారికి సతీష్, ఆషా అని నామకరణం చేశారు. అప్పటి నుంచి వారు అక్కడే పెరిగారు. సతీష్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న, పొందిన పిల్లల్లో సతీష్ ఒక్కడే పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం సిరిపురం వరుణ్‌మోటార్స్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీ వరకు ప్రేమ సమాజంలోనే తలదాచుకున్న సతీష్‌కు గురువారం రాత్రి 10.10 గంటలకు సింహాచలం దేవ స్థానంలో బొబ్బిలికి చెందిన శ్యామలతో వివాహం కానుంది. ఏజ్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రతినిధి డాక్టర్ ఎన్ఎస్ రాజు వద్ద నర్సింగ్ అసిస్టెంట్‌గా ఆమె పనిచేస్తోంది. సతీ ష్కు ప్రేమ సమాజం అధ్యక్షుడు కంచర్ల రాం బ్రహ్మం, కార్యదిర్శ ఎంవీ రమణ, మాజీ కార్యదర్శి గణపతిరావు, కార్యవర్గ సభ్యులు రూ.25 వేల నగదు, ప్రేమసమాజం కార్యవర్గ సభ్యుడు, రిటైర్డ్ వుడా పరిపాలనాధికారి ఎస్కే త్రిపాఠి వివాహ సామగ్రి అందజేశారు. -
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
కర్నూలు జిల్లా పాములపాడు మండలం సుంకులమ్మకొట్టాల గ్రామంలో ఒక యువతి ఉరి వేసుకుని మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్యామల(20) ఆత్మకూరులోని ఒక కాలేజీలో డిగ్రీ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రత్యేక గీతాల్లో నటించను: శ్యామల
ప్రత్యేక గీతాల్లో నటించే ఉద్దేశం తనకు లేదని టీవీ వ్యాఖ్యాత, నటి శ్యామల అన్నారు. బెస్ట్ యాంకర్ల జాబితాలో తన పేరు ఉండాలన్న కోరికను ఆమె వ్యక్తపరిచారు. లౌక్యం, ఒక లైలా కోసం సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. అయితే సినిమాల కోసం టీవీ షోలు వదులుకోబోనని స్పష్టం చేశారు. సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేసే అవకాశం వచ్చిన వార్తలపై శ్యామల స్పందించారు. ప్రస్తుతం ప్రత్యేక గీతాల్లో నటించే ఉద్దేశం తనకు లేదన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర కావాలన్నదే తన లక్ష్యమన్నారు. కర్ణాటకకు చెందిన శ్యామల తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. అయితే దీనికోసం తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని చెప్పారు. చిన్నప్పుడు పరిషత్ నాటకాల్లో నటించానని వెల్లడించారు. ఓ తెలుగు నాటకంలో ఉత్తమ బాలనటిగా అవార్డు కూడా అందుకున్నానని కూడా తెలిపారు. అభిషేకం, లయ, హ్యేపీ డేస్ సీరియల్స్ లో నటించిన శ్యామలకు 18 ఏళ్ల వయసులో పెళ్లైంది. భర్త, అత్తింటివారు అండగా నిలవడం వల్లే కెరీర్ ఆటంకం లేకుండా ముందుకుసాగుతోందని తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
తొగుట, న్యూస్‌లైన్ : విద్యుదాఘాతంతో ఓ కూలి మృతి చెందిన సంఘటన మండలంలోని కాన్గల్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల పలు ఇళ్లలో మూడు రోజులుగా ఏ వస్తువు పట్టుకున్నా.. విద్యుత్ షాక్ వస్తోంది. అయితే బుధవారం కాలనీకి చెందిన వ్యవసాయకూలీ బత్తుల బాలనర్సయ్య (30) సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళాడు. దీంతో విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య శ్యామల, నలుగురు పిల్లలున్నారు. అయితే కాలనీలో మూడు రోజుల కిందట ఏర్పాటు చేసిన సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కు ఎర్తింగ్ లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా ఈ తంతు జరుగుతున్నా సంబంధిత అధికారులు రాకపోవడంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాలనీలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బాగు చేయాలని కో రుతున్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతున్నారు. -
అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య
చేగుంట, న్యూస్‌లైన్: అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండల పరిదిలోని పోతాన్‌పల్లి గ్రామంలో అది వారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి శ్యామల, భర్త అంజనేయు లు వారికి ఉన్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తన వ్యవసాయ భూమిలో బోరుబావిని తవ్వించారు. దానికొసం కొంత అప్పు చేశారు. అప్పులు తీర్చే విషయంలో మనస్థాపం చెందిన శ్యామల(35) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై వినాయక్‌రెడ్డి గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమెదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఎరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
స్థితప్రజ్ఞుడే శ్రీమంతుడు
ఓ ప్రశాంత ఏకాంత సమయాన రాధాకృష్ణుల మధ్య సంభాషణ ఇలా సాగింది. రాధ: కృష్ణా! నీవింత సుకుమారంగా కనిపిస్తావు, నీ శ్యామల రూపం సమ్మోహన ప్రేమ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. అపారమైన ప్రేమ కారుణ్యాలు నీ యెదలో తాండవిస్తాయి. కానీ నాదొక సందేహం... కృష్ణుడు: సందేహమెందుకు? అడుగు రాధా! రాధ: అంతులేని అల్లరి చేష్టలు, వాటితోపాటు రాక్షస సంహారాలు... ఇవన్నీ ఏమిటో నాకర్థం కావటం లేదు కృష్ణా! కృష్ణుడు: రాధా! నాకు శత్రువులెవ్వరూ లేరు, పనిగట్టుకుని నేనెవ్వరినీ సంహరించడమూ లేదు. ఇవన్నీ ప్రకృతి పరిధిలోనే జరుగుతున్నాయి. దాని నిమయనిర్ణయాల మేరకు జనన మరణాల ప్రస్థానం నాటకీయంగా సాగుతోంది. సృష్టిలోని ప్రతి క దలిక వెనుక ప్రేరణాత్మకమైన ప్రకృతిసూత్రం ఇమిడి ఉంటుంది. చూడు ప్రియసఖీ! రైతు నేలలో విత్తనాలను పాతిపెడతాడు. ద్వేషం చేత కాదు కదా! ఆ విత్తనానికి రైతు చర్య అర్థం కాకపోవచ్చు కాని జరిగేదేమిటంటే ఆ విత్తనంలోంచే పచ్చని మొలక అంకురించి మొక్కగా, చెట్టుగా పరిణతి చెంది ఫలభరితమౌతుంది. అంటే విత్తనంగా మరణిస్తేగాని మొలకగా అంకురించే అవకాశమే లేదు కదా! ఈ విధంగానే జననమరణాల గమనం కూడా. మరణం పాలబుగ్గల పరిశుద్ధ శిశోదయానికి ముఖద్వారమవుతుంది. చైతన్యవంతమైన ఆత్మకు మరణమెక్కడిది? వివిధ రూపాలుగా అవతరించి మార్పు చెందడం తప్ప. ఈ అవగాహన రహితమైన మనస్సు అనుకూలతను కారుణ్యంగా, ప్రతికూలతను కాఠిన్యంగా భావిస్తుంది. ఈ ప్రకృతే దైవాకృతి. ఈ వైవిధ్య రూపాలన్నీ ప్రకృతి యొక్క విభిన్న పాత్రలే, జనన మరణాలు, సుఖదుఃఖాలు, చీకటి వెలుగులనే ద్వంద్వాలను కల్పించి చిద్విలాస క్రతువు నిరంతరాయంగా జరుపుతుంది ఆ అఖండ జ్ఞానస్వరూపిణియైన పరాప్రకృతి. ఈ జ్ఞానమెరిగి జీవించువాడే స్థితప్రజ్ఞుడు. ఈ జ్ఞానమెరిగి పయనించువాడే మందస్మిత శ్రీమంతుడు... అని ప్రబోధించాడు కలువ కన్నుల కన్నయ్య. ఆ ప్రబోధంతో రాధ హృదయం ప్రకాశించి, ‘‘ప్రభూ! ఆ సూత్రమూ, ఆ జ్ఞానమూ, ఈ పంచభూతాత్మక విశ్వమూ నీవే కదా! ప్రత్యేకించి ‘ప్రకృతి’ అని సంబోధిస్తావెందుకు?’’ అని రాధమ్మ అంటే అవునన్నట్లు మందహాసంతో తన మధుకాంతిని రాధమీద ప్రసరించి తన అనన్యస్థితిని ప్రకటించాడు కృష్ణ పరమాత్మ. - (రామకృష్ణానంద రచించిన ‘ఆరాధనామాధవుడు’ నుంచి)