Ram Gopal Varma Comments On Anchor Syamala Goes Viral | నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు? - Sakshi
Sakshi News home page

RGV : యాంకర్‌ శ్యామలపై ఆర్జీవీ ఓపెన్‌ కామెంట్స్‌ వైరల్‌

Published Wed, Feb 16 2022 3:34 PM | Last Updated on Wed, Feb 16 2022 6:26 PM

Ram Gopal Varma Comments On Anchor Syamala Goes Viral - Sakshi

RGV Comments On Anchor Syamala: డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిందే చేస్తాడు.. ఎవరేమనుకున్నా పట్టించుకోడు.. ఇదీ ఆర్జీవీ నైజం. ఇక ఈ మధ్యకాలంలో లేడీ యాంకర్లను తెగ పొగిడేస్తున్న వర్మ తాజాగా యాంకర్‌ శ్యామలపై రొమాంటిక్‌ కామెంట్స్‌ చేశారు. 'బడవ రాస్కెల్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా యాంకర్‌ శ్యామలపై పొగడ్తలు కురిపించారు.

'ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఇప్పటివరకు ఎలా తప్పించుకున్నారు' అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కక్షణం షాక్‌ అయిన శ్యామల తెగ నవ్వేసింది. అలాగే తాను తోపు, రౌడీ, గూండాలతో పాటు రాస్కెల్‌ కూడా అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు. కాగా యాంకర్‌ శ్యామలపై ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement