కర్నూలు జిల్లా పాములపాడు మండలం సుంకులమ్మకొట్టాల గ్రామంలో ఒక యువతి ఉరి వేసుకుని మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్యామల(20) ఆత్మకూరులోని ఒక కాలేజీలో డిగ్రీ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.