
ప్రేమ వివాహం
ప్రేమ సమాజం.. ఎంతో మంది అనాథల జీవితాల్లో వెలుగులు పంచుతోంది. జీవితంలో వారికి ఎదగటానికి అవకాశాలు కల్పిస్తోంది. వారి వివాహం దగ్గరుండి చేయించి ...
ప్రేమ సమాజంలో ఎదిగిన సతీష్
సింహాచలం దేవస్థానంలో శ్యామలతో కల్యాణం
రూ. 25వేలు నగదు అందించిన సమాజం పెద్దలు
డాబాగార్డెన్: ప్రేమ సమాజం.. ఎంతో మంది అనాథల జీవితాల్లో వెలుగులు పంచుతోంది. జీవితంలో వారికి ఎదగటానికి అవకాశాలు కల్పిస్తోంది. వారి వివాహం దగ్గరుండి చేయించి అండగా నిలబడుతోంది. అలా రెండేళ్ల ప్రాయంలో ప్రేమ సమాజంలో చేరి జీవితంలో ఎదిగిన ఓ యువకుడి వివాహం గురువారం రాత్రి జరగనుంది. అతనికి ప్రేమ సమాజం పెద్దలు, ప్రముఖుల ఆశీర్వాదాలు బలంగా ఉన్నాయి.
రెండేళ్ల వయసున్న మగబిడ్డ, నెలల వయసున్న ఆడ శిశువు(అతని సోదరి)ను 1993లో ఓ కానిస్టేబుల్ ప్రేమ సమాజంలో చేర్పించారు. ప్రేమ సమాజం పెద్దలు వారికి సతీష్, ఆషా అని నామకరణం చేశారు. అప్పటి నుంచి వారు అక్కడే పెరిగారు. సతీష్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న, పొందిన పిల్లల్లో సతీష్ ఒక్కడే పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం సిరిపురం వరుణ్‌మోటార్స్‌లో పనిచేస్తున్నాడు.
ఈ నెల 7వ తేదీ వరకు ప్రేమ సమాజంలోనే తలదాచుకున్న సతీష్‌కు గురువారం రాత్రి 10.10 గంటలకు సింహాచలం దేవ స్థానంలో బొబ్బిలికి చెందిన శ్యామలతో వివాహం కానుంది. ఏజ్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రతినిధి డాక్టర్ ఎన్‌ఎస్ రాజు వద్ద నర్సింగ్ అసిస్టెంట్‌గా ఆమె పనిచేస్తోంది. సతీ ష్‌కు ప్రేమ సమాజం అధ్యక్షుడు కంచర్ల రాం బ్రహ్మం, కార్యదిర్శ ఎంవీ రమణ, మాజీ కార్యదర్శి గణపతిరావు, కార్యవర్గ సభ్యులు రూ.25 వేల నగదు, ప్రేమసమాజం కార్యవర్గ సభ్యుడు, రిటైర్డ్ వుడా పరిపాలనాధికారి ఎస్‌కే త్రిపాఠి వివాహ సామగ్రి అందజేశారు.