mahankali temple
-
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
-
మహంకాళి దేవాలయం వద్ద మొండెం లేని మనిషి తల
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లిలో దుండగులు... గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేశారు. ఆ తర్వాత.. తలను, మొండెంను వేరు చేసి విరాట్‌నగర్‌లోని మహంకాళి ఆలయం వద్ద పడేశారు. దేవాలయం వద్ద తలను చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయం చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలను, డాగ్స్వ్కాడ్లను రంగంలోకి దింపారు. హత్యకు ఏదైన వివాహేతర సంబంధం ఉందా?.. నరబలి కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: భర్త ఇంటి ముందు యువతి ధర్నా -
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో తొక్కిసలాట
-
వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారు
-
బోనాల జాతర
-
అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-
అమ్మవారే కరోనాను తరిమి కొట్టాలి..
రాంగోపాల్‌పేట్: ఎటు చూసినా భక్త జన సందోహం, అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరే భక్త జనం, ఫలహార బండ్ల ఊరేగింపులు, తొట్టెల సమర్పణలకు వచ్చే యువత తీన్మార్ స్టెప్పులు...శివసత్తుల పూనకాలు....అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులు.. ఇదీ ఏటా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా కనిపించే కమనీయ దృశ్యం...ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించే ప్రజాప్రతినిధులు...అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వీవీఐపీలు, వీఐపీలతో కొనసాగే సందడి. అయితే ఈ ఏడాది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అమ్మవారిని దర్శించుకోవాలని, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న భక్తులకు నిరాశే మిగిల్చింది. అమ్మవారి జాతర ప్రారంభమైనప్పటి నుంచి చరిత్రలో మొదటి సారిగా భక్తులు లేకుండానే బోనాల జాతర మొదలైంది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ జన జాతర ఈ ఏడాది జనం లేని జాతరగా చరిత్రలో నిలిచిపోనుంది. లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహంకాళి దేవాలయం చుట్టు ఎక్కడ భక్తుల జాడ కనిపించ లేదు. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అయితే అధికారులు అమ్మవారికి భక్తుల బోనం లేకున్నా సంప్రదాయాల్లో ఎలాంటి లోటు లేకుండా, శాస్త్రోక్తంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పూజలు... మంత్రి ఇంటి నుంచి తొలి బోనం కోవిడ్ నిబంధనల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర సంప్రదాయాలతో వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం 4.05 నిమిషాలకు మహాహారతితో మహంకాళి అమ్మవారికి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని కుటుంబ సభ్యులు బోనాన్ని దేవాలయం బయటి వరకు తెచ్చి ఆలయ ఈవో మనోహర్‌రెడ్డికి అప్పగించారు. మహాహారతి అనంతరం ఆలయ అధికారులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఆలయ సిబ్బంది అమ్మవారికి 7 బోనాలను సమర్పించారు. ఉదయం 4.45 నిమిషాలకు వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు ఆర్యసమాజ్, దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం హోమం చేశారు. కనిపించని భక్త జనం కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది బోనాల జాతరలో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అమ్మవారికి జరిగే పూజలన్నీ మాత్రం యధావిధిగా ఆలయ అధికారులు నిర్వహించారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులు రాకుండా చూశారు. ఈ విషయం తెలియని కొందరు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనాలు సమర్పించేందుకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. అమ్మవారే కరోనాను తరిమి కొట్టాలి: మంత్రి తలసాని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని మహంకాళి అమ్మవారే తరిమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలరా వ్యాధిని తరిమికొట్టడంతో 1815లో అప్పయ్యదొర మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారన్నారు. నాడు కలరా వ్యాధిని తరిమికొట్టిన అమ్మవారే నేడు కరోనాను కూడా దేశం నుంచి పారదోలాలని ప్రార్థించారు. అయితే ఈ ఏడాది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాతరకు భక్తులను అనుమతించడం లేదని ఇందుకు వారు క్షమించాలని కోరారు. ప్రభుత్వ సూచనలను భక్తులు, స్థానిక ప్రజలు పాటిస్తూ ఇంట్లోనే బోనాల ఉత్సవాలు జరుపుకున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు 9.30 గంటలకు రంగం ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో మరో ప్రధాన ఘట్టం రంగం. అవివాహిత మహిళ అమ్మవారికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ అమ్మవారి ముందు పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. అమ్మవారు ఆమెను ఆవహించగా ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాట అమ్మవారే పలుకుతున్నట్లుగా భక్తుల నమ్మకం. సోమవారం ఉదయం 9.30 గంటలకు భవిష్యవాణి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుండటం, భక్తుల బోనాలు లేకుండానే జాతర జరుగడంతో అమ్మవారి నుంచి ఎలాంటి వాక్కులు వినవలసి వస్తుందోనని భక్తులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అనంతరం అమ్మవారి సాగనంపే నిర్వహిస్తారు. దీంతో బోనాల జాతర ముగుస్తుంది. దూరం నుంచి దండం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రాంగోపాల్‌పేట్ పాత పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పోలీసులు కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తులను అనుమతించడం లేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచే అమ్మవారికి దండం పెట్టుకుని వెనుదిరిగి వెళ్లారు. -
కనక దుర్గమ్మకి బంగారు బోనం
సాక్షి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మకి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన బోనాలకు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ సురేష్ బాబు స్వాగతం పలికారు. జమ్మిదొడ్డి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి సన్నిధికి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కాలినడకన చేరుకున్నారు. జమ్మిదొడ్డి వద్ద కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (కరువు సీమలో సిరులు) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది దుర్గమ్మకు బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. కరొనా కారణంగా అమ్మవారికి ఆడంబరంగా కాకుండా కేవలం పరిమితంగానే బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అదే విదంగా ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తలిపారు. సాయంత్రం 7 గంటల వరకు శాకాంబరిదేవీగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను అనుసరించి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. -
26 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం
సాక్షి, యాకుత్‌పురా : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ అధ్యక్షుడు జి.రాజారత్నం తెలిపారు. ఆలయ 72వ వార్షిక బోనాల నేపథ్యంలో సోమవారం ఆలయ ప్రార్థనా మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చారిత్రాత్మకమైన ఈ దేవాలయాన్ని 77 రోజుల లాక్డౌన్ అనంతరం సోమవారం తెరిచామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పించామన్నారు. బోనాల పండగ నిర్వహించే 11 రోజులు అన్ని పూజలు నిర్వహించి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించమని వేడుకుంటామన్నారు. ఈ నెల 26 నుంచి ఐదు శుక్రవారాల పాటు బోనాల వేడుకలు నిర్వహించనున్నామన్నారు. కుంకుమార్చనను ఈ నెల 26న, జూలై 3, 10, 17, 24వ తేదీలతో నిర్వహిస్తామన్నారు. జూలై 10న అమ్మవారి కలశ స్థాపన, మహాభిషేకం నిర్వహించి ధ్వజారోహణతో 11 రోజుల పాటు నిర్వహించే బోనాల జాతరను ప్రారంభిస్తామన్నారు. జూలై 11 నుంచి 18వ తేదీ వరకు అమ్మవారికి వివిధ పూజలు, 19న బోనాల పండగ సందర్భంగా అమ్మవారికి బోనాల సమర్పణ, శాంతి కల్యాణం నిర్వహిస్తామన్నారు. 20న పోతురాజుల స్వాగతం, రంగం, భవిష్యవాణి నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా బోనాల పండగ రోజున జిల్లాల నుంచి భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జూలై 10 నుంచి 17వ తేదీ వరకు భౌతిక దురాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు వీలు కల్పిస్తున్నామన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని... ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్, ఫారెస్ట్ కన్జర్వేటర్ శోభ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌లకు విజ్ఞప్తి పత్రాలను అందజేశామన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి కె.దత్తాత్రేయ, కోశాధికారి ఎ.సతీష్, సంయుక్త కార్యదర్శి చేతన్ సూరి, కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్, సభ్యులు ఎం.వినోద్, ఎం.ముఖేశ్‌లు పాల్గొన్నారు. -
మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయండి
-
అక్బరుద్దీన్ ఒవైసీ వినతి.. కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రిని కలసి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో నిర్వహించే బోనాలు దేశవ్యాప్తంగా లాల్‌దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నా చాలినంత స్థలం లేకపోవడం వల్ల ఆలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోవట్లేదని.. దీనివల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. ‘లాల్ దర్వాజ మహంకాళి ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారు. కానీ ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉంది. ఇంత తక్కువ స్థలం ఉండటం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయండి. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశముంది. వారికి ప్రత్యామ్నాయంగా జీహెచ్ఎంసీ అధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని కోరుతూ స్వయంగా (ముఖ్యమంత్రి) మీరు బంగారు బోనం సమర్పించారు. ఆలయ విస్తరణకు ఆ సమయంలోనే ప్రకటన కూడా చేశారు. ఇక పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్ మసీద్ మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయండి. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారు. మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతోంది..’అని అక్బరుద్దీన్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. -
బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా బోనం సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల ఉంటే నేను ఇంకా బాగా ఆడతానని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆమె అమ్మవారిని కోరుకున్నారు. ప్రభుత్వం అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. సినీనటి పూనమ్‌కౌర్ కూడా బోనమెత్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి బోనం సమర్పించి.. దర్శనం చేసుకున్నారు. -
ఆ ఆలయాన్ని పేల్చేస్తాం : లష్కరే
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో భీకర దాడులతో అలజడి సృష్టిస్తామని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది. అక్టోబర్ 20, నవంబర్ 9 తేదీల్లో భీకర దాడులు చేపడతామని లష్కర్ ఏరియా కమాండర్ మౌల్వి అబు షేక్ రావల్పిండి నుంచి హెచ్చరిక లేఖ రాసినట్టు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. అక్టోబర్ 20న ఎలాంటి విధ్వంసం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నా నవంబర్ 9న ఎలాంటి అలజడి రేగుతుందనే ఆందోళనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని పేల్చివేస్తామని సైతం లష్కరే హెచ్చరించడంతో నిఘా, భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఉగ్ర సంస్థ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసిందనే అనుమానంతో భోపాల్, గ్వాలియర్, కట్ని, జబల్పూర్లో హై అలర్ట్ ప్రకటించారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లకు లష్కరే దాడుల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. 2008 నవంబర్ 26న ముంబై పేలుళ్లలో 166 మంది మరణించడం, 300 మందికి పైగా గాయపడిన దారుణ ఘటనను లష్కరే ఉగ్రవాద సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఘనంగా బోనాలు.. క్యూ కట్టిన ప్రముఖులు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బోనాల సందడి వెల్లివిరుస్తోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తజనం బారులు తీరారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని తెలిపారు. రేపు ఊరేగింపు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. క్యూ కట్టిన ప్రముఖులు.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరామ్, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించి.. మొక్కులు చెల్లించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని నాయిని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలాలు అందరికీ అందాలని అమ్మను వేడుకున్నట్టు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగల్లో. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని చెబుతారు. అప్పటినుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. బోనం ఎత్తుకుని..అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. -
పోలీసుల తీరుపై జోగిని శ్యామల ఫైర్
-
తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ విఫలం అయ్యాయని జోగిని శ్యామల ఫైర్ అయ్యారు. ఏర్పాట్ల లోపం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బోనం ఎత్తుకొని వెళ్లే క్యూ లైన్లో పోలీసులు ఇతర భక్తలను పంపారని అన్నారు. మరోవైపు గంటల తరబడి బోనం ఎత్తుకుని లైన్లలో మహిళలు వేచి చూడాల్సివచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాలు ఉత్సవంలో పోలీసుల అత్యుత్సహం ప్రదర్శించారు. ఉజ్జయిని మహంకాళి డ్యూటీలో ఉన్న ఓ చానెల్ రిపోర్టర్‌పై పోలీసు అధికారి చేయి చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మీడియా పాయింట్ వద్ద రిపోర్టర్లు, కెమెరామెన్లు నిరసన వ్యక్తం చేశారు. -
బోనమెత్తిన భాగ్యనగరి
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట జనసంద్రమైంది. ఆదివారం ప్రారంభమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలకు జనం వేలాదిగా తరలి వచ్చారు. అశేష జనవాహిని మధ్య లంగర్‌హౌస్ నుంచి ప్రారంభమైన అమ్మవారి తొట్టెల ఊరేగింపు ఫతే దర్వాజా, చోటా బజార్, బడా బజార్, గోల్కొండ చౌరస్తాల గుండా కోటకు చేరుకుంది. భారీ తొట్టెల కోట ప్రధాన ద్వారం నుంచి అమ్మవారి ఆలయం వరకు ముందుకు సాగగా.. భక్తులు వెంట వెళ్లారు. మరోవైపు గోల్కొండ బంజార దర్వాజ నుంచి పటేలమ్మ మొదటి బోనం ఊరేగింపు కఠోర గంజ్, మొహల్లాగంజ్‌ల గుండా కోటకు చేరుకుంది. ఈ సందర్భంగా నగీనా బాగ్‌లోని నాగదేవత ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా బోనాల ప్రారంభానికి విచ్చేశారు. ఆలయాలకు రూ.15 కోట్ల నిధులు: ఇంద్రకరణ్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిపూజతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వినోద్ ఆధ్వర్యంలో మంత్రులు లంగర్‌హౌస్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత అమ్మవారికి బోనాల ర్యాలీ ప్రారంభమైంది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. బోనాల సందర్భంగా ఆలయాల అభివృద్ధి కోసం విడుదల చేసిన రూ.15 కోట్ల నిధులు కేవలం జంటనగరాల కోసమేనని చెప్పారు. మిగిలిన జిల్లాలకు కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మొదటి రోజు ఉత్సవాలతోనే అధికారులు చేతులు దులుపుకోవద్దని, గోల్కొండలో జరిగే తొమ్మిది వారాల పూజలకు ప్రతి శాఖ అధికారి భక్తులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోల్కొండ బోనాల ఉత్సవాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆలయాల అభివృద్ధికి సీఎం పెద్దపీట వేశారని, కేవలం ప్రధాన ఆలయాలకే పరిమితం కాకుండా గల్లీల్లోని చిన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. -
ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే...
సారంగాపూర్ : ‘నా ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా’ నని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న అన్నారు. ఆదివారం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దుబ్బరాజన్న ఆలయంలో మహంకాళి రాజన్నను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతోనే గ్రామాల్లో క్రియాశీల రాజకీయాలను ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల అధ్యక్షులు అనంతుల గంగారెడ్డి, పొరండ్ల గంగారెడ్డి, ప్రధానకార్యదర్శులు బొమ్మ ప్రమోద్, రామానుజం, ఉపసర్పంచ్ స్వామి పాల్గొన్నారు. -
ఘనంగా ముగిసిన బోనాల వేడుకలు
నగరంలో బోనాల వేడుకలు ఘనంగా ముగిశాయి ఆట్టహాసంగా జరిగిన బోనాల ఉత్సవాలు అంబరాన్ని అంటేలా జరిగాయి. సోమవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆనంతరం పూరవీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపులు నిర్వహించారు. అంతే కాకుండా అమ్మవారికి ప్రత్యేక నైవేధ్యాన్ని సమర్పించేందుకు మేకపోటేళ్ల బండ్లపై ఫలహారపు బండి ఊరేగింపుతో విచ్చేసి సమర్పించారు. ఫలహరపు బండ్ల ఊరేగింపులు అమ్మవారిని పూరవీధుల్లో ఊరేగింపు వంటి కార్యక్రమాలు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కొనసాగాయి. అంబర్‌పేట మహంకాళి ఆలయానికి పెద్ద ఎత్తున ఫలరహారపు బండ్లు ఊరేగింపుగా వచ్చాయి. అలాగే అంబర్‌పేట పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, బాగ్ అంబర్‌పేట తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల వద్ద ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా జరిగాయి. -
పరవశం
-
మహంకాళి ఆలయంలో ప్రారంభమైన బోనాలు
ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరీ దేవాలయంలో 67వ బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గణపతి పూజ, పుణ్యహవచనము, రుత్విక్ వరణం, దీక్షారాధన, అఖండ దీపస్థాపన, నవగ్రహారాధన, కలశస్థాపన, అమ్మవారి అభిషేకం, సాయంత్రం 6 గంటలకు అమ్మ వారికి సహస్రనామార్చన, కుంకుమార్చన, మహా మంగళ హారతి తదితర కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ కమిటీ చైర్మన్ జె.శంకరయ్య గౌడ్, కమిటీ సభ్యులు సురేందర్ ముదిరాజ్, మధుసూదన్ గౌడ్, వి.అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మహంకాళి టెంపుల్ వద్ద బ్యాగు కలకలం
హైదరాబాద్‌సిటీ: ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద గురువారం వేకువజామున ఓ బ్యాగు కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాగును ఆలయ పరిసరాల్లో వదిలి వెళ్లారు. ఆ బ్యాగులో బాంబు ఉందేమోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరవేయడంతో చత్రినాక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు వచ్చి బ్యాగును పరిశీలించారు. బ్యాగులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద విషాదం
సికింద్రాబాద్: సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. బాలరాజు అనే హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల జనాలు తిరుగుతుండగానే కూల్ డ్రింక్ కొనుక్కోని అందులో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడి ఎదురుగా చోటుచేసుకున్న ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనిలో రికార్డయిన ప్రకారం ఎరుపు రంగు చొక్కాలో ఆలయం వద్దకు వచ్చిన బాలరాజు కొద్ది సేపు అటు ఇటూ తిరిగాడు. ఇంతలో ఒక మహిళ మాత్రం అతడిని కలిసి వెళ్లింది. ఆ తర్వాత అతడు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకొని అంతకుముందే సిద్ధంగా పెట్టుకున్న పురుగుల మందుతాగి అందరూ చూస్తుండగా తాగి ఒక రేకు డబ్బాలోకి వెళ్లి అందులో చనిపోయాడు. అయితే, అతడిని కలిసిన మహిళ అతడి భార్యనా లేక ఇంకెవరైననా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హోంగార్డ్స్ సంక్షేమం కోసం ఒకప్పుడు బాలరాజు ఎంతో కృషి చేశాడు. గతంలో హోంగార్డు అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా బాలరాజు పనిచేశాడు. -
అమ్మవారి 'రంగం'