ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరీ దేవాలయంలో 67వ బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరీ దేవాలయంలో 67వ బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గణపతి పూజ, పుణ్యహవచనము, రుత్విక్ వరణం, దీక్షారాధన, అఖండ దీపస్థాపన, నవగ్రహారాధన, కలశస్థాపన, అమ్మవారి అభిషేకం, సాయంత్రం 6 గంటలకు అమ్మ వారికి సహస్రనామార్చన, కుంకుమార్చన, మహా మంగళ హారతి తదితర కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ కమిటీ చైర్మన్ జె.శంకరయ్య గౌడ్, కమిటీ సభ్యులు సురేందర్ ముదిరాజ్, మధుసూదన్ గౌడ్, వి.అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.