మహంకాళీ అమ్మవారి ఘటాన్ని బయటకు తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు
నల్ల పోచమ్మ ఆలయంలో పూజలు
లక్డీకాపూల్: ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం తెలంగాణ ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజాభవన్‌కి విచ్చేసిన సీఎం, మంత్రులకు భట్టి దంపతులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.
పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భట్టి దంపతులు బోనాలకు, మహంకాళి అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత నల్ల పోచమ్మ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశా రు. అనంతరం మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఎమ్మెల్యే ఎన్ ఉత్తమ్ పద్మావతి, పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు బోనమెత్తారు. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి జోగిని తలపై ఎత్తారు.
డిప్యూటీ సీఎం నివాసం నుంచి ప్రజాభవన్ ఆవరణలోని నల్ల పోచమ్మ దేవాల యం వరకు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యా సాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి భట్టి విక్రమార్క దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమరి్పంచారు. నల్ల పోచమ్మ దేవాలయంలో భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment