సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద విషాదం | tragedy at mahankali temple in secunderbad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద విషాదం

Published Thu, Apr 14 2016 6:26 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద విషాదం - Sakshi

సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద విషాదం

సికింద్రాబాద్: సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. బాలరాజు అనే హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల జనాలు తిరుగుతుండగానే కూల్ డ్రింక్ కొనుక్కోని అందులో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడి ఎదురుగా చోటుచేసుకున్న ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనిలో రికార్డయిన ప్రకారం ఎరుపు రంగు చొక్కాలో ఆలయం వద్దకు వచ్చిన బాలరాజు కొద్ది సేపు అటు ఇటూ తిరిగాడు. ఇంతలో ఒక మహిళ మాత్రం అతడిని కలిసి వెళ్లింది.

ఆ తర్వాత అతడు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకొని అంతకుముందే సిద్ధంగా పెట్టుకున్న పురుగుల మందుతాగి అందరూ చూస్తుండగా తాగి ఒక రేకు డబ్బాలోకి వెళ్లి అందులో చనిపోయాడు. అయితే, అతడిని కలిసిన మహిళ అతడి భార్యనా లేక ఇంకెవరైననా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హోంగార్డ్స్ సంక్షేమం కోసం ఒకప్పుడు బాలరాజు ఎంతో కృషి చేశాడు. గతంలో హోంగార్డు అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా బాలరాజు పనిచేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement