SECUNDERBAD
-
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదంతో హైటెన్షన్..
సాక్షి, సికింద్రాబాద్: రామ్‌గోపాల్‌పేట్‌లోని దక్కన్ స్టోర్ భవనంలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు భవనంలోకి రెండో అంతస్తు కూడా వ్యాప్తించాయి. ఎగిసిపడుతున్న మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి చేరకున్న 10 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాద స్థలంలో దాదాపు 4 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే, అగ్ని ప్రమాద భవనానికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే కిమ్స్ ఆసుపత్రి ఉన్నట్టు తెలుస్తోంది. దక్కన్ స్టోర్ నుంచి పొగలు ఆసుపత్రికి వరకు వెళ్తున్నట్టు సమాచారం. అగ్నిమపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఇదిలా ఉండగా.. దక్కన్ స్టోర్ నుంచి మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు వ్యాప్తి చెందాయి. తాజాగా దక్కన్ స్టోర్ బిల్డింగ్ లోపల నుంచి పేలుడు శబ్దాలు వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. మంటలు ఎంతకు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో మంటలు, తీవ్రమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన పొగ కారణంగా ఫైర్ సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారు. కాగా, మంటల భయంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక, రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ చీఫ్ విశ్వజిత్ మీడియాతో మాట్లాడారు. భవనం దగ్గరికి ఫైర్ ఇంజిన్లు వెళ్లే పరిస్థితి లేదన్నారు. అందుకే రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యం అవుతుందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నట్టు తెలిపారు. అవసరమైనే బిల్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు.. మంటలు అదుపులోకి రాకపోతే కెమికల్స్ సాయంతో అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కాగా, మంటలు అదుపులోకి రావడానికి మరిన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మంటలు ఇలాగే చెలరేగితే భవనం కూలిపోయే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. -
వందే భారత్: సికింద్రాబాద్ టూ విశాఖ.. పలు స్టేషన్ల ఛార్జీల వివరాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సంక్రాంతి రోజున ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనుండగా, సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తొలి పరుగు ప్రారంభించనుంది. సోమవారం విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రానుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి 697 కి.మీ. (రైలు మార్గం) దూరంలో ఉన్న విశాఖకు చేరుకునేందుకు ప్రస్తుతం మిగతా సూపర్‌ఫాస్ట్ రైళ్లలో సగటున 12 గంటలు పడుతోంది. కానీ వందేభారత్ వాటి కంటే మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల ముందే చేరుకునేలా పరుగుపెట్టనుంది. జనవరి 15న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదే ఇక, సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వందే భారత్ రైలుకు శనివారం నుంచే ఐఆర్సీటీసీలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఛార్జీలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ టు వరంగల్ - 520/- సికింద్రాబాద్ టు ఖమ్మం - 750/- సికింద్రాబాద్ టు విజయవాడ - 905/- సికింద్రాబాద్ టు రాజమండ్రి - 1365/- సికింద్రాబాద్ టు విశాఖపట్నం - 1665/-(CC) సికింద్రాబాద్ టు విశాఖపట్నం - 3120/-(EC). గుర్తుకొచ్చేది వేగమే... వందే భారత్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది దాని వేగమే. గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. అయితే, దాని వేగం అధికంగానే ఉన్నా, అంత వేగాన్ని తట్టుకునే ట్రాక్ సామర్థ్యం మనకు లేదు. ఈ మార్గంలో రైళ్ల గరిష్టవేగ పరిమితి 130 కి.మీ. మాత్రమే ఉంది. కానీ గరిష్ట పరిమితితో కాకుండా వందేభారత్ రైలు సగటున 90–100 కి.మీ. వేగంతోనే పరుగుపెట్టనుంది. ప్రస్తుతం ఇతర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల సగటు గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. మాత్రమే ఉంది. -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ పాటించాల్సిందే!
కోవిడ్-19 వైరస్ కొత్త వేరియెంట్ "ఒమిక్రాన్" వ్యాప్తి వేగంగా పెరుగుతున్న తరుణంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందే దాని వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవడం రైల్వే అధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో మనదేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు రైల్వే శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కఠినమైన మార్గదర్శకాలను దక్షిణ మద్య రైల్వే శాఖ జారీ చేసింది. ప్రతి రైల్వే కార్మికుడికి టీకాలు వేయడంతో పాటు మాస్క్ లేని వారికి రైల్వే స్టేషన్ల, రైళ్లలో ప్రవేశం లేదంటున్నారు అధికారులు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్లోకి వస్తే 500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లలో కొత్త ఆదేశాలు పాటించకుండా వెతికి పట్టుకొని మరి జరిమానా విధిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొత్త రూల్స్ పట్ల ప్రయాణికులకు అవగాహన కోసం ప్రకటనల బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని, కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు. (చదవండి: బ్యాంకింగ్ లిక్విడిటీలో తీవ్ర ఒడిదుడుకులు!) -
సికింద్రాబాద్ పద్మరావునగర్‌లో చిన్నారిని ఢికొన్న కారు
-
బడ్జెట్లో డబ్లింగ్‌కు రూ.200 కోట్లు..
సాక్షి, మహబూబ్‌నగర్: సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో మహబూబ్‌నగర్ స్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మహబూబ్‌నగర్ స్టేషన్ నుంచి ప్రతినిత్యం 5వేల నుంచి 6వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రై ల్వే క్రాసింగ్‌తో హైదరాబాద్ వెళ్లాలన్నా.. రా వాలన్నా గంటలతరబడి సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు డబ్లింగ్ రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని గత పదేళ్ల నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో నాలుగేళ్ల నుంచి కేంద్ర బడ్జెట్లో మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు అధికంగా నిధులు కేటాయిస్తున్నారు. బడ్జెట్లో డబ్లింగ్‌కు రూ.200 కోట్లు.. దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు నాలుగేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గతేడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించగా ఈ సారి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ రైల్వేలైన్ పనులు జిల్లా పరిధిలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఉందానగర్ నుంచి ప్రారంభమైన డబ్లింగ్ రైల్వే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ చివర్లో లేదా జనవరి వరకు గొల్లపల్లి వరకు డబ్లింగ్‌లైన్ పూర్తయ్యేలా ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. డబ్లింగ్‌లైన్‌లో భాగంగా విద్యుద్దీకరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలానగర్, రాజాపూర్, గొల్లపల్లి రైల్వే స్టేషన్లలో నూతన భవనాల పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లపల్లి స్టేషన్లో ఫ్లైవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. బాలానగర్ వాగుమీద రైల్వే వంతెన నిర్మిస్తున్నారు. చురుగ్గా సాగుతున్న డబ్లింగ్‌లైన్, విద్యుద్దీకరణ పనులు డబ్లింగ్తో తగ్గనున్న దూరభారం.. సికింద్రబాద్–మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్‌లైన్ పూర్తయితే జిల్లా ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు లభిస్తుంది. మహబూబ్‌నగర్ నుంచి 100 కిలోమీటరు దూరంలో ఉన్న సికింద్రాబాద్‌కు వెళ్లడానికి ప్యాసింజర్‌కు 3 గంటలు, ఎక్స్‌ప్రెస్‌కు 2.30 గంటల సమయం పడుతుంది. డబ్లింగ్ లైన్ పూర్తయితే ఒక గంట సమయం ఆదా అయ్యే పరిస్థితి ఉంది. వాణిజ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ప్రయాణికులకు సౌకర్యం ఈ ఏడాది బడ్జెట్లో మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు అధిక నిధులు కేటాయించారు. నిధులతో డబ్లింగ్ రైల్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మరిన్ని నిధులు కేటాయించి డబ్లింగ్ లైన్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి. డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యం లభిస్తుంది. క్రాసింగ్ ఉండవు. దీంతో గంటలోపే సికింద్రాబాద్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో ప్రయాణికులు సంఖ్య కూడా పెరుగుతుంది. సమయం ఆదా అవుతుంది. విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లేవారికి వెసులుబాటులో ఉంటుంది. – ఎస్కే పీరాన్, రిటైర్డ్ సీనియర్ సీసీఐ -
17న తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, తిరుపతి: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ఈనెల 17వ తేదీన ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెం.07430) ఈనెల 17వ తేదీ రాత్రి 8.10గంటలకు తిరుపతిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.35గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. -
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి తొలి బోనాలు
-
సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద విషాదం
సికింద్రాబాద్: సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. బాలరాజు అనే హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల జనాలు తిరుగుతుండగానే కూల్ డ్రింక్ కొనుక్కోని అందులో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడి ఎదురుగా చోటుచేసుకున్న ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనిలో రికార్డయిన ప్రకారం ఎరుపు రంగు చొక్కాలో ఆలయం వద్దకు వచ్చిన బాలరాజు కొద్ది సేపు అటు ఇటూ తిరిగాడు. ఇంతలో ఒక మహిళ మాత్రం అతడిని కలిసి వెళ్లింది. ఆ తర్వాత అతడు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకొని అంతకుముందే సిద్ధంగా పెట్టుకున్న పురుగుల మందుతాగి అందరూ చూస్తుండగా తాగి ఒక రేకు డబ్బాలోకి వెళ్లి అందులో చనిపోయాడు. అయితే, అతడిని కలిసిన మహిళ అతడి భార్యనా లేక ఇంకెవరైననా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హోంగార్డ్స్ సంక్షేమం కోసం ఒకప్పుడు బాలరాజు ఎంతో కృషి చేశాడు. గతంలో హోంగార్డు అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా బాలరాజు పనిచేశాడు. -
టీటీడీ సీవీఎస్వోగా చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తిరుమల: టీటీడీ కొత్త సీవీఎస్వోగా ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తుండిన టీటీడీ సీవీఎస్వో జీవీజీ.అశోక్‌కుమా ర్ వైఎస్సార్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. కొత్తసీఎస్వో ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈయన జిల్లాకు, టీటీడీకి సుపరిచతుడే. 2003లో తిరుపతి అదనపు ఎస్పీగా, 2010లో జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత కర్నూలు ఎస్పీగా పనిచేసి బదిలీపై సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వెళ్లారు. తాజాగా బదిలీపై టీటీడీకి వస్తున్నారు. గతంలో తిరుమల, తిరుపతిలోని భద్రతాపరమైన విధులు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక బందోబస్తునుసమర్థవంతంగా పర్యవేక్షించారు. విధి నిర్వహణలో ముక్కుసూటి, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా అశోక్‌కుమార్ బదిలీ టీటీడీ సీవీఎస్వో జీవీజీ.అశోక్‌కుమార్ కడప జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన హైదరాబాద్ నగర ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తూ 2012 ఏప్రిల్ 18న టీటీడీలో బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఏడాదిన్నర కాలం పనిచేశారు. తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సిబ్బందికి ప్రత్యేక కమెండో శిక్షణ ఇప్పించారు. నాలుగంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్ పనులను తూర్పు మాడ వీధి మినహా పూర్తి చేశారు. ఔట్ సెక్యూరిటీ పనుల ప్రతిపాదనలు వేగవంతమయ్యాయి. ఆలయానికి భద్రతగా ఉన్న ఆక్టోపస్ బలగాలను మరింత పటిష్టం చే శారు. రూ.2 కోట్లతో 2వేల సీసీ టీవీల ప్రాజెక్టుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేయించడంలో కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ తరహా భద్రతా వ్యవస్థను తిరుమలలో ఏర్పాటు చేసేందుకు కచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. టీటీడీకి ప్రత్యేకంగా రూ.కోటితో బాంబు డిస్పోజబుల్(బీడీ టీం)లు సిద్ధం చేయించారు. పరిపాలనలో, సిబ్బంది, ఉన్నతాధికారులతో సంబంధాలు నెరపడంలో సౌమ్యుడన్న పేరును సొంతం చేసుకున్నారు. స్వామి ఆశీస్సులతోఆనందంగా పనిచేశా శ్రీవారి ఆశీస్సులతో ఇక్కడ ఆనందంగా పనిచేశా. టీటీడీలో పనిచేసిన ఏడాదిన్నర కాలం కత్తిమీద సాము. అయినా సంతృప్తి మిగిలింది. ఆనందంగా ఉంది. -జీవీజీ.అశోక్‌కుమార్ టీటీడీ సీవీఎస్వో