
మహంకాళి టెంపుల్ వద్ద బ్యాగు కలకలం
హైదరాబాద్‌సిటీ: ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద గురువారం వేకువజామున ఓ బ్యాగు కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాగును ఆలయ పరిసరాల్లో వదిలి వెళ్లారు. ఆ బ్యాగులో బాంబు ఉందేమోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరవేయడంతో చత్రినాక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు వచ్చి బ్యాగును పరిశీలించారు. బ్యాగులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.