న్యూజిలాండ్ లో ఘనంగా బోనాల వేడుకలు | Telangana NRI's in Newzealand celebrate bonalu | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ లో ఘనంగా బోనాల వేడుకలు

Jul 11 2016 2:46 PM | Updated on Oct 17 2018 4:43 PM

న్యూజిలాండ్ లో ఘనంగా బోనాల వేడుకలు - Sakshi

న్యూజిలాండ్ లో ఘనంగా బోనాల వేడుకలు

న్యూజిలాండ్లో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్లోని మౌంట్రాస్కిల్ ఫిక్లింగ్ సెంటర్లో బోనాల వేడుకను అట్టహాసంగా జరుపుకొన్నారు.

న్యూజిలాండ్లో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్లోని మౌంట్రాస్కిల్ ఫిక్లింగ్ సెంటర్లో బోనాల వేడుకను అట్టహాసంగా జరుపుకొన్నారు. అమ్మవారిని ప్రతిష్టించిన తర్వాత బోనాలు పెట్టి మహిళలు భక్తిశ్రద్ధలతో చీరెలు, ఒడిబియ్యం సమర్పించారు. ఆ తర్వాత అక్కడి తెలంగాణవాసులు సామూహిక భోజనాలు చేశారు. పానుగంటి శ్రీనివాస్ వేసిన పోతురాజు వేషం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శంకరమ్మ స్వయంగా రాసిన పాటను పాడి ఆకట్టుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఉత్సాహంగా బోనాల పండగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్దం దంపతులు, ఆక్లాండ్లో ఉన్న తెలంగాణ వాసులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ప్రెసిడెంట్ కల్యాణరావు, జనరల్ సెక్రటరీ దయాకర్ కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement