చిత్తలూరులో ఘనంగా బోనాల పండుగ
చిత్తలూరు(శాలిగౌరారం)
మండలంలోని చిత్తలూరు గ్రామంలో మంగళవారం మహంకాళమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మహంకాళమ్మ దేవతకు దూపదీపనైవేద్యాలను బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలతో తమ పాడిపంటలు మంచిగా వృద్ధిచెందాలని కోరుకుంటూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక సర్పంచ్ బొమ్మగాని రవి, ఎంపీటీసీ సుంకరి కరుణ వీరయ్య, ఉపసర్పంచ్ తరాల సువర్ణ అంతయ్య, మండల కోఆప్షన్ సభ్యులు దాసరి దేవచిత్తం, నాయకులు జయప్రకాశ్, శ్రీను, కొండల్‌కుమార్, నతానియేల్, కృష్ణమోహన్, మల్లయ్య, పాపయ్యలు దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.