shaligouraram
-
విచారణ పేరుతో ఎస్ఐ వేధింపులు
-
మహిళపై కన్ను.. వీఆర్‌కు శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్
సాక్షి, నల్గొండ జిల్లా: శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ మహిళ మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వేధింపుల ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కి పిలిపించి టీ పెట్టించారని.. చికెన్ ఫ్రై, చేపల కూడా వండటం వస్తే బయట కలుద్దామంటూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ మెసేజ్ చేశాడంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. విచారణ పేరుతో గంటన్నర సేపు తన రూమ్‌లో నిలబెట్టి నానా మాటలు అన్నాడు. ఏదన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేయమన్నాడు. ఇక్కడి విషయాలు ఎవరికన్నా చెప్తే నీతో పాటు కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. తనపైనే కుల సంఘాల నేతలతో దుష్ర్పచారం చేయిస్తున్నాడు’’ అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
నల్లగొండ: విమాన డ్రోన్ కలకలం.. ఎయిర్టెల్ సిమ్, సీసీ కెమెరాలు..
శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలోని పంటపొలాల్లో ఆదివారం విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ పడిపోయింది. అదే సమయంలో ఆప్రాంతంలో మేకలు మేపుతున్న ఓ మేకల కాపరి కొంత భయాందోళనకు గురయ్యాడు. కాసేపటి తర్వాత దగ్గరకు వెళ్లి చూసి ఆ విషయాన్ని తన కుమారుడికి ఫోన్‌చేసి చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన కొంతమంది యువకులు డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పగా, ఎస్ఐ సతీష్ అక్కడికి వచ్చి డ్రోన్‌ను పరిశీలించారు. ఈ డ్రోన్‌లో ఎయిర్టెల్ సిమ్, సీసీ కెమెరాలు, జీపీఎస్, బ్యాటరీ ఉన్నట్లు గుర్తించారు. 76 నంబర్‌తో ఉన్న ఈ డ్రోన్ రెక్కలపై ఎఫ్ఎల్216020220415099 నంబర్ ఉన్నట్లు ఎస్ఐ చెప్పారు. ఐదడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పుతో ఉన్న ఈ డ్రోన్ 15 కిలోల బరువు ఉందన్నారు. పంటపొలాల్లో పడిపోయిన ఈ డ్రోన్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తర్వాత బాంబ్ స్క్వాడ్ ఘటనాస్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో ఎలాంటి బాంబుల ఆనవాళ్లు లేవని నిర్ధారించింది. డ్రోన్లోని సిమ్‌కార్డును తీసి కనెక్ట్ చేసేందుకు యత్నించగా, సిమ్‌కార్డు కనెక్ట్‌కాలేదు. అనంతరం డ్రోన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇది కూడా చదవండి: మరో రెండ్రోజులు ఉక్కపోతే.. -
అది హత్యా.. ఆత్మహత్యా!.. 4 నెలల క్రితం బాలిక అనుమానాస్పద మృతి
సాక్షి, నల్గొండ: పన్నెండేళ్ల బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.. ఆత్మహత్యేమో అని భావించిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ గ్రామంలోని కొందరి వ్యవహారశైలిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో బాలిక మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం చేయించారు. ఇదంతా జరిగి నాలుగు నెలలైంది. ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. పైగా ఇటీవల సదరు బాలిక సమాధి తవ్వేసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంతకాలమైనా పోలీసులు ఏమీ తేల్చడం లేదని, నిందితులను విచారించలేదని బాలిక తల్లిదండ్రులు శుక్రవారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. నాలుగు నెలల కింద ఘటన పెర్కకొండారం గ్రామానికి చెందిన పెరుమాండ్ల రమేశ్–పుషష్పలతల కుమార్తె మెర్సి(12). స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదివే ఆమె.. ఈ ఏడాది జూలై 13న ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. మెర్సి నోట్‌బుక్‌లో సుసైడ్ నోట్ రాసి పెట్టి ఉంది. ఆమెది ఆత్మహత్యగా భావించిన తల్లిదండ్రులు, బంధువులు అదేరోజు రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియల సమయంలో గ్రామానికి చెందిన కట్ట పద్మారావు, పెరుమాండ్ల కృష్ణ, పెరుమాండ్ల ప్రభాకర్‌లు ఆ ఇంటికి వచ్చి.. నోట్‌బుక్‌లో రాసి ఉన్న సుసైడ్ నోట్‌ను చించివేశారు. మెర్సి మృతి చెందిన మూడో రోజు ఆమె సమాధి వద్ద తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో తల్లిదండ్రులకు అనుమానం వచ్చిన, పద్మారావు, కృష్ణ, ప్రభాకర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూతగాదాల నేపథ్యంలో వారే తమ కుమార్తెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే తప్పుడు సుసైడ్‌నోట్‌ను వారే రాసి, తర్వాత చించివేశారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరో రోజున సమాధి నుంచి మెర్సి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆ తర్వాత కేసు ముందుకు కదలలేదు. సమాధి తవ్వేసి ఉండటంతో..: మెర్సి తల్లిదండ్రులు కుమార్తెకు నివాళులు అర్పించేందుకు గత నెల 28న సమాధి వద్దకు వెళ్లారు. కానీ అప్పటికే సమాధి తవ్వి పైకప్పు రాయి దూరంగా పడవేసి ఉంది. తల్లిదండ్రులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు కేసు విచారణ చేపట్టలేదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని వివరించారు. దీనితో ఎస్పీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేస్తున్నాం మెర్సి మృతిపై తల్లిదండ్రుల ఫిర్యా దు ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం. కేసును పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అవాస్తవం. మెర్సి పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దాని ఆధారంగా విచారణ జరుగుతోంది. మెర్సి సమాధిని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేసిన విషయం వాస్తవమే. ఈ ఘటనపైనా దర్యాప్తు చేపట్టాం. కానీ సమాధిలో మృతదేహం ఉందో, లేదో మేం చూడలేదు. సీఐ రాఘవరావు, శాలిగౌరారం -
నీటితొట్టిలో పడి బాలుడి మృతి
సాక్షి, శాలిగౌరారం(నల్గొండ) : నీటితొట్టిలో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం గ్రామానికి చెందిన కారింగుల శంకరయ్య–పద్మ దంపతులకు కుమార్తె, కుమారుడు శివ(9)లు ఉన్నారు. కుమార్తె కళాశాల విద్య చదువుతుండగా కుమారుడు శివ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. రోజువారీ మాదిరిగానే పాఠశాలకు వెళ్లివచ్చిన శివ సాయంత్రం రాగానే ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి వద్దకు కాళ్లు కడుక్కునేందుకు వెళ్లాడు. కొద్దిమేర నీరు ఉండటంతో డబ్బాతో నీటిని అందుకునేందుకు నీటితొట్టి(గోళెం)లోకి వంగాడు. దీంతో ప్రమాదవశాత్తు జారి అందులో తలకిందులుగా పడిపోవడంతో నీటిలో శివ తల మునిగి ఊపిరాడక మృతిచెందాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన శివ తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కునేందుకని నీటితొట్టి వద్దకు వెళ్లేసరికి వారి కుమారుడు నిర్జీవంగా పడిఉన్నాడు. దీంతో వారు గట్టిగా కేకలు వేస్తూ వెంటనే కుమారుడిని నీటితొట్టిలో నుంచి బయటకు తీసి చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. విషయం గ్రామంలో దావనంలా వ్యాపించడంతో శివ మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. ఆవిరైన తల్లిదండ్రుల ఆశలు కారింగుల శంకరయ్య–పద్మ దంపతులు తమకు ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి ఆ బాలుడి ప్రాణాలను హరించడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. తమ కుమారుడి మృతితో శివ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిరీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల రోదనను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటినిగార్చక ఉండలేకపోయారు. నాచే ప్రాణం తీసిందా..? కారింగుల శివ మరణానికి నీటితొట్టికి ఉన్న నాచే కారణమా..? అంటే.. అవునపిస్తోంది. శంకరయ్య ఇంటిలో వాడుకునే నీటికోసం ఇంటి ఆవరణలో ఉన్న సిమెంట్ నీటితొట్టి లోపలి భాగంలో పూర్తిగా నాచు పేరుకుపోయింది. నీటితొట్టిలో అడుగు భాగంలో కొద్దిమేర నీరు ఉండటంతో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లిన శివ డబ్బాతో నీటిని అందుకునేందుకు దాని అంచుపై చేయిపెట్టి లోపలికి ఒరిగాడు. ఈక్రమంలో నీటితొట్టిపై ఉన్న నాచువల్ల చేయి జారడంతో అదుపుతప్పి ప్రమదవశాత్తు తలకిందులుగా జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో తల నీటిలో మునగడంతో ఊపిరాడక మృతిచెందాడు. నీటితొట్టిలో నాచులేకుంటే ప్రాణం పోయిఉండేది కాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్జీ కొత్తపల్లిలో ఉద్రిక్తత
సాక్షి, శాలిగౌరారం : మండలంలో గురువారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలు మండలంలోని ఎన్జీ కొత్తపల్లి, ఆకారం, చిత్తలూరు గ్రామాల్లో ఘర్షణలు, ఆందోళనలకు దారితీశాయి. ఎన్నికల సందర్భంగా ఎన్జీ కొత్తపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరో వ్యక్తి పట్ల దుర్భాషలాడటంతో గొడవ మొదలయ్యింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి కొన్ని నిముషాల ముందే గొడవ జరుగడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. దీంతో సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ గోపాలరావు సిబ్బందితో హుటాహుటిన ఎన్జీ కొత్తపల్లి గ్రామానికి చేరుకొని ఇరువర్గాలకు చెందిన వారిని చెదరగొట్టాడు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జ్ జరగడంతో ప్రజలు తోపులాటకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎంపీటీసీ గన్నపురెడ్డి కళమ్మలక్ష్మారెడ్డితో పాటు మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాఠశాలకు వెళ్లే రోడ్డుపై ధర్నాకు దిగారు. అదే సమయంలో ఈవీఎంలకు రక్షణగా వచ్చిన పోలీసు వాహనాన్ని అడ్డుకొని చుట్టుముట్టారు. చేసేదేమిలేక పోలీసులు కిందకు దిగి పోలింగ్ కేంద్రానికి నడిచివెళ్లారు. ఇదిలా ఉండగా పోలీసుల లాఠీచార్జితో స్వల్ప గాయానికి గురైన సంకటి శ్రీను అనేవ్యక్తి అవమానంతో పురుగులమందు తాగాడు. అదే సమయంలో వచ్చిన పోలీసులకు చెందిన మరో వాహనంలో బాధితుడిని వెంటనే నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే రాత్రి కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలింగ్ కేంద్రంవద్ద ఉన్న పోలీసులను అడ్డుకునేందుకు వెళ్లారు. పరిస్థితిని గమనించిన ఎస్ఐ గోపాలరావు గుట్టుచప్పుడుకాకుండా డొంకమార్గంలో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను తరలించారు. దీంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆందోళనకారులు అక్కడ పోలీసులు, ఎన్నికల సిబ్బంది లేకపోవడంతో తీవ్రంగా ఆగ్రహిస్తూ ఈవీఎంలను, బందోబస్తు పోలీసులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని తెలుసుకున్న సీఐ క్యాస్ట్రోరెడ్డి ఎన్జీ కొత్తపల్లి గ్రామానికి చేరుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధిత వ్యక్తులతో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్న సీఐ హామీతో ఆందోళనను విరమించారు. అప్పటికే రాత్రి తొమ్మిది గంటలు కావడంతో గ్రామంలో ఏమి జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఆకారం గ్రామంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల మధ్య గొడవ ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువురు బాహాబాహికి దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకిదిగి సమస్యను సద్దుమణిగించారు. అదేవిధంగా చిత్తలూరు గ్రామంలో కూడా రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు గొడవలకు పాల్పడటంతో పోలీసులు ఆయా వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ పాదూరి శంకర్‌రెడ్డికి లాఠీ దెబ్బలు తగలడంతో నాయకులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గొడవలు పడుతున్న కార్యకర్తలను చెదరగొట్టే క్రమంలో లాఠీలు తగిలాయని, పోలీసులు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
నయీంను కాపాడింది కాంగ్రెస్సే
శాలిగౌరారం : సమైక్య రాష్టంలో దశాబ్దకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే నరహంతక నయీంను పెంచి పోషించిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం మండలంలోని ఊట్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీం కేసు విచారణలో తమపేర్లు ఎక్కడ బయట పడతాయోనని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అంతర్మథనంలో ఆందోళన చెందుతూ బయటకు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. టీఆర్ఎస్పార్టీ ఉద్యమ కాలంలో న యీం వల్ల రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులను పోగొట్టుకొని తీరని నష్టానికి గురైందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాడు ఐదు సంవత్సరాలుగా భువనగిరి ఎంపీగా పనిచేశారని, అప్పుడు న యీం అంటే ఏమిటో కోమటిరెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసం పదువులను ఆశించే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నయీంతో సంబంధాలు కచ్చితంగా ఉన్నాయని, సిట్ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్నారు. నయీం నరహంతకుడని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరహంతకులను అంతమొందించేందుకు నరకాసురవధ చేపట్టిందన్నారు. సమావేశంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు యానాల పాపిరెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, కట్టంగూరు జెడ్పీటీసీ మాద యాదగిరి, సింగిల్‌విండో చైర్మన్ లోకసాని రంగారెడ్డి, నాయకులు అయితగోని వెంకన్న, పూజర్ల శంభయ్య, భూపతి యాదయ్య, కోక యాదయ్య, వేముల లింగయ్య, ఇద్దయ్య, దార అశోక్, యారాల జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
నయీం కేసును సీబీఐకి అప్పగించాలి
శాలిగౌరారం : గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శాలిగౌరారం మండల కేంద్రంలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలందరికీ నయీంతో సంబంధాలు ఉన్నాయని, వారిని కాపాడేందుకే సిట్‌తో విచారణ జరిపించారన్నారు. నయీంతో అంటకాగినవారి వివరాలు పూర్తిస్థాయిలో మీడియాలో ఆధారాలతో సహా ప్రచారం జరిగినా వారిపై చర్యలు మాత్రం శూన్యమన్నారు. నయీం కేసును తప్పుదోవ పట్టించేందుకు జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ముందట వేసుకుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను ఓడించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం నాపై కుట్రపన్ని నయీంతో బెదిరింపులకు పాల్పడిందన్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని వద్దనుండి లభ్యమైన సొమ్ము కేసీఆర్ వశం చేసుకున్నాడని అన్నారు. నయీం డైరీపై అనేక చర్చలు జరిగాయని, ఆ డైరీలో పేర్లు ఉన్నవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నయీం డైరీలోని పేజీలు చింపివేశారా అని సీఎం కే సాఆర్ను ప్రశ్నించారు. నయీంకు సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు, అధికారులను అరెస్ట్ చేసేంతవరకు ఊరుకునేదిలేదని, చట్టసభల్లో ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కేసీఆర్ పాలన ప్రజల పాలన కాదని, అది ఒక కుటుంబ పాలన మాత్రమేనన్నారు. ప్రజలకు ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త అంకుటిత దీక్షతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అన్నెపర్తి జ్ఞానసుందర్, బండపల్లి కొమరయ్య, మురారిశెట్టి కృష్ణమూర్తి, తాళ్లూరి మురళి, నూక సత్తయ్య, అన్నెబోయిన సుధాకర్, చామల మహేందర్‌రెడ్డి, ఎర్ర యాదగిరి, షేక్ జహంగీర్, ఇంతియాజ్, నోముల విజయ్‌కుమార్, గూని వెంకటయ్య, గుండ్ల వెంకటయ్య, బొమ్మగాని రవి, రామస్వామి, మల్లయ్య, నర్సింహ్మా, రామచంద్రయ్య, శంకరయ్య, గోదల వెంకట్‌రెడ్డి, తొట్ల పుల్లయ్య, బీరం నర్సిరెడ్డి, అశోక్, తదితరులు ఉన్నారు. -
డెంగీతో వ్యక్తి మృతి
శాలిగౌరారం శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధి శాలిలింగోటంలో డెంగీతో ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. కుటింబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిలింగోటం గ్రామానికి చెందిన కన్నెబోయిన అవిలయ్య(32) వ్యత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందిన అవిలయ్య మెరుగైన వైద్యచికిత్సల కోసం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ నుంచి ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన అవిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అక్కడ నుండి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా డెంగీగా నిర్ధారించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, చిన్నారులైన ఇద్దరు కుమార్తెలు, కుమారునితో పాటు వృద్ధ వికలాంగులైన తల్లిదండ్రులు ఉన్నారు. రోడ్డునపడిన కుటుంబం: శాలిలింగోటంలో డెంగ్యూతో మృతిచెందిన కన్నెబోయిన అవిలయ్య కుటుంబం ఆయన మృతితో రోడ్డునపడింది. చిన్న సన్నకారు రైతు కుటుంబానికి చెందిన అవిలయ్య తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృద్ధాప్యంలో అంగవైకల్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా మారిన ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. తన కుమారుని మృతితో ఇంటివద్ద వారు రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరనీ కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
గల్లంతైన పవన్ మృతదేహం లభ్యం
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టు కుడి అలుగు వరదనీటి ప్రవాహంలో స్థానిక గండికుంట గల్లంతైన అమరగాని పవన్‌కుమార్ (36) మృతదేహం సోమవారం లభ్యమైంది. శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు గల్లంతైన పవన్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం 12:55 గంటలకు మండలంలోని అడ్లూరు చెరువు సమీపంలో వరదనీటి కాల్వలో లభించింది. మృతదేహం గుర్తింపు కోసం మూడు రోజులుగా నల్లగొండ డీఎస్పీ సుధాకర్, ఆర్డీఓ వెంకటాచారి నేతృత్వంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పవన్‌కుమార్ మృతదేహాన్ని గండికుంటకు సుమారు కిలోమీటరు దూరంలో అడ్లూరు చెరువు సమీపంలో కాల్వలోని కంపచెట్ల పొదల్లో గుర్తించారు. కుళ్లిపోయిన మృతదేహాన్ని కర్రల సహాయంతో కాల్వ నుంచి బయటకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసుకురాగానే బాధిత కుటింబీకుల రోదనలు అక్కడకు వచ్చినవారికి కంటతడిపెట్టించాయి. రెస్క్యూటీం, జాలర్ల సహాయంతో... మూడు రోజుల క్రితం వరదనీటిలో గల్లంతైన పవన్‌కుమార్ ఆచూకి కోసం సోమవారం నాగార్జునసాగర్‌కు చెందిన రెస్క్యూటీంతో గాలింపు చేపట్టారు. ఆక్సిజన్ మాస్క్‌ల సాయంతో గాలింపు చేపట్టినా మొదట ఫలితం కన్పించలేదు. దీంతో వారికి తోడుగా జాలర్లు, పోలీసులు గాలింపు చేపట్టారు. కాల్వలో వరదనీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భారీ పొక్లెయిన్‌తో కాల్వకు అడ్డుకట్ట వేసి వరదనీటిని పంటపొలాల్లోకి దారి మళ్లించారు. అనంతరం డీఎస్సీ సుధాకర్ నేతృత్వంలో కాల్వలో నిల్వ ఉన్న నాలుగు అడుగుల లోతు నీటిలో గాలింపు చే పట్టారు. కంప చెట్లపొదల్లో ఉన్న పవన్‌కుమార్ మృతదేహాన్ని మొదట డీఎస్పీ గుర్తించి బయటకు తీశారు. వెంటనే పోలీసులు స్థానికులతో కలిసి కర్రల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. నీటిలో నుంచి మృతదేహాన్ని తరలించేందుకు అందుబాటులో ఏమిలేకపోవడంతో డీఎస్పీ తన శరీరంపై ఉన్న రెయిన్‌కోట్‌ను విడిచి అందులో మృతదేహాన్ని కట్టుకుని బయటకు తీసుకువచ్చారు. స్వయంగా డీఎస్సీ ఎంతో సాహసంతో వరదనీటిలో గాలింపు చేపట్టడంతో పాటు మృతదేహాన్ని గుర్తించడం, రెయిన్‌కోట్‌లో మృతదేహాన్ని తరలించి సహాయక చర్యలకు ఆదర్శంగా నిలిచారు. పరిశీలించిన ఎస్పీ పవన్‌కుమార్ గల్లంతైన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన తీరు, చేపడుతున్న గాలింపు చర్యలు తదితర విషయాలను డీఎస్పీ సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని, అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి ఎస్పీ సూచించారు. వరద నీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో పోలీసులు వరదనీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు గండి కుంట వద్ద కల్వకు అడ్డుగా ఇసుక బస్తాలను వేశారు. అనంతరం భారీ పొక్లెయిన్ సాయంతో కాల్వకు అడ్డుకట్ట వేసి నీటిని పంటపొలాల్లోకి దారిమళ్లించి గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలానికి శాలిగౌరారం, నకిరేకల్, మునగాల మండలాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం జనంతో నిండిపోయింది. గాలింపు చర్యల్లో శాలిగౌరారం, కట్టంగూరు, నార్కట్‌పల్లికి చెందిన పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి. -
కాలువలో వ్యక్తి గల్లంతు
శాలిగౌరారం శాలిగౌరారం ప్రాజెక్టు కుడి అలుగు కాలువలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండల కేంద్రానికి చెందిన అమరగాని పవన్‌కుమార్(36) తన భార్యతో కలిసి సంవత్సర కాలంగా నకిరేకల్‌లో నివాసం ఉంటున్నాడు. పవన్‌కుమార్ భార్య జానకి ప్రస్తుతం శాలిగౌరారం గ్రామంలో ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్నారు. పవన్‌కుమార్ తన స్నేహితుడైన శాలిగౌరారం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగరాజుతో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై మండలకేంద్రానికి వచ్చారు. ఏఈ నాగరాజు విధులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో వయా ఆకారం మీదుగా నల్లగొండకు బయలుదేరారు. ఈ క్రమంలో శాలిగౌరారం ప్రాజెక్ట్‌కు కుడిఅలుగుకు అనుసంధానంగా ఉన్న గండికుంట మీదుగా వెళ్లే క్రమంలో కల్వర్టు పైనుంచి వస్తున్న వరదనీటిని దాటుతున్నారు. పవన్‌కుమార్ ద్విచక్రవాహనం దిగి కాలినడకన కల్వర్టును దాటే క్రమంలో కాలుజారి వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఏఈ నాగరాజుతో పాటు ఆ ప్రాంతంలోని ఉన్నవారు లబోదిబోమనే సరికి నీటిలో మునుగుతూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వరద ప్రవాహాం ఉధృతంగా ఉండటం వలన అక్కడ ఉన్న స్థానికులు కాపాడలేకపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ అయోధ్య సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గల్లంతైన పవన్‌కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటన స్థలంలో బిక్కుబిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ, డీఎస్పీ పవన్‌కుమార్ కాల్వలో గల్లంతైన విషమం తెలుసుకుని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్‌లు సాయంత్రం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం తీసుకుంటున్న సహాయకచర్యలను తెలుసుకున్నారు. వరద ఉధృతి ఏ విధంగా ఉందని అధికారులతో సమీక్షించారు. -
జాతీయ స్థాయి చెస్ పోటీలకు శాలిగౌరారం విద్యార్థి
శాలిగౌరారం: మండల కేంద్రానికి చెందిన షేక్ సయ్యద్, జుబేదాల కుమారుడు షరీఫ్ పాష అండర్–19 చెస్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 17 నుంచి 19 వరకు రంగారెడ్డి జిల్లా నాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించడంతో పాటు జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. షరీఫ్ పాష గతంలో 2015–16లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికకాగా, ప్రస్తుతం మరోమారు జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థిని స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌లు అభినందించారు. షరీఫ్ ప్రస్తుతం నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
చిత్తలూరులో ఘనంగా బోనాల పండుగ
చిత్తలూరు(శాలిగౌరారం) మండలంలోని చిత్తలూరు గ్రామంలో మంగళవారం మహంకాళమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మహంకాళమ్మ దేవతకు దూపదీపనైవేద్యాలను బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలతో తమ పాడిపంటలు మంచిగా వృద్ధిచెందాలని కోరుకుంటూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక సర్పంచ్ బొమ్మగాని రవి, ఎంపీటీసీ సుంకరి కరుణ వీరయ్య, ఉపసర్పంచ్ తరాల సువర్ణ అంతయ్య, మండల కోఆప్షన్ సభ్యులు దాసరి దేవచిత్తం, నాయకులు జయప్రకాశ్, శ్రీను, కొండల్కుమార్, నతానియేల్, కృష్ణమోహన్, మల్లయ్య, పాపయ్యలు దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
భారమయ్యారని..తల్లిదండ్రులను నడిరోడ్డుపై వదిలేసిన కొడుకులు
శాలిగౌరారం, న్యూస్‌లైన్ : నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులు నడిరోడ్డుపై వదిలేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మల్లాల గ్రామానికి చెందిన నర్సయ్య(98), లింగమ్మ(85)లకు ముగ్గురు కుమారులు రామచంద్రయ్య, వెంకటయ్య, సత్తయ్యలతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. వీరికి వివాహాలు జరిగాయి. నర్సయ్య రెక్కల కష్టంతో సంపాదించిన ఆరు ఎకరాల భూమిని కుమారులకు సమానంగా పంచాడు. ఇటీవల వారి ఆరోగ్యం క్షీణించడంతో పూర్తిగా కొడుకులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను చూసుకునే విషయంలో కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. చిన్నకొడుకు సత్తయ్య తనకు వాటా తక్కువ వచ్చిందని తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు. కులపెద్దలు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో అతనిని కులం నుంచి వెలేశారు. తమ్ముడు పట్టించుకోవడం లేదు కాబట్టి.. తామూ చూసుకోమంటూ శనివారం గ్రామ ప్రధాన కూడలిలోని మర్రిచెట్టు కింద వదిలి వెళ్లిపోయారు. గ్రామపెద్దల తీర్మానానికి సత్తయ్య ససేమిరా అనడంతో మిగిలిన ఇద్దరూ అదే దారిలో వెళ్లారు. ఉదయం నుంచి చెట్టు కిందనే ఉన్న వృద్ధులను చూసి చలించిన చుట్టుపక్కల వారు మంచినీళ్లు, ఆహారం అందించారు.