శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలోని పంటపొలాల్లో ఆదివారం విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ పడిపోయింది. అదే సమయంలో ఆప్రాంతంలో మేకలు మేపుతున్న ఓ మేకల కాపరి కొంత భయాందోళనకు గురయ్యాడు.
కాసేపటి తర్వాత దగ్గరకు వెళ్లి చూసి ఆ విషయాన్ని తన కుమారుడికి ఫోన్‌చేసి చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన కొంతమంది యువకులు డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పగా, ఎస్‌ఐ సతీష్ అక్కడికి వచ్చి డ్రోన్‌ను పరిశీలించారు. ఈ డ్రోన్‌లో ఎయిర్‌టెల్ సిమ్, సీసీ కెమెరాలు, జీపీఎస్, బ్యాటరీ ఉన్నట్లు గుర్తించారు. 76 నంబర్‌తో ఉన్న ఈ డ్రోన్ రెక్కలపై ఎఫ్‌ఎల్216020220415099 నంబర్ ఉన్నట్లు ఎస్‌ఐ చెప్పారు. ఐదడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పుతో ఉన్న ఈ డ్రోన్ 15 కిలోల బరువు ఉందన్నారు.
పంటపొలాల్లో పడిపోయిన ఈ డ్రోన్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తర్వాత బాంబ్ స్క్వాడ్ ఘటనాస్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో ఎలాంటి బాంబుల ఆనవాళ్లు లేవని నిర్ధారించింది. డ్రోన్‌లోని సిమ్‌కార్డును తీసి కనెక్ట్ చేసేందుకు యత్నించగా, సిమ్‌కార్డు కనెక్ట్‌కాలేదు. అనంతరం డ్రోన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: మరో రెండ్రోజులు ఉక్కపోతే..
Comments
Please login to add a commentAdd a comment