drone flying
-
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం తారువలో ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్ సాయంతో విజువల్స్ తీశారు. దీంతో, అనుమానం వచ్చి స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరా తీశారు. విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు.అనంతరం దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. దీంతో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న బీజేపీ కండువాలను, జెండాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్కడ డ్రోన్‌ను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ముత్యాల నాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
డ్రోన్లు నడపాలనుకుంటున్నారా? ఉచిత శిక్షణ ఇదిగో!
అభివృద్ధి చెందిన దేశాలు చాలా పంటల్లో వందశాతం యాంత్రీకరణను సాధించాయి. సాగును సరళతరం చేస్తూ ‘స్మార్ట్ వ్యవసాయం’ దిశగా పరుగులు తీస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. ఇండియా అభివృద్ధికి వ్యవసాయరంగ పురోగతి అత్యంత కీలకం. ప్రపంచ ఆహార భద్రత నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. వాతావరణ మార్పులవల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గుతున్నాయి. ఇందుకోసం సాగులో యంత్రీకరణను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్పత్తుల పెంపే లక్ష్యంగా అనేక దేశాలు, సంస్థలు కృషి చేస్తున్నాయి. డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా పనిచేసే వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకుని, ఉత్పాదకతను పెంచుకోవడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి. ఇండియా కన్నా చైనాలో వ్యవసాయ యోగ్యమైన భూమి తక్కువ. దిగుబడి మాత్రం అధికం. అభివృద్ధి చెందిన దేశాలు సాగు రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై అధికంగా దృష్టి సారిస్తున్నాయి. వ్యవసాయంలో పూర్తి యంత్రాలను అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ ఇటీవలి కాలంలో సాగులో డ్రోన్లు, రోబోల వాడకం ప్రారంభమైంది. అందుకుతోడుగా హైదరాబాద్‌కు చెందిన మారుత్ డ్రోన్స్ అనే అంకురసంస్థ వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లను తయారుచేసేందుకు డీజీసీఏ అనుమతులు పొందింది. డ్రోన్స్ ద్వారా ఉపాధి పొందాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లకు, నూతన సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో దిగుబడి పెంచుకోవాలనుకునే రైతులతోపాటు స్వయంగా ఉపాధి పొందాలనుకునే మహిళలకు రెండు వారాల్లోనే డ్రోన్ లైసెన్సులు అందజేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 500 మందికి పైగా.. ఇతర రాష్ట్రాల్లో 300 మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. కంపెనీ తయారుచేసిన ‘ఏజీ 365ఎస్ కిసాన్డ్రోన్’ (మల్టీయుటిలిటీ అగ్రికల్చర్ స్మాల్ కేటగిరీ డ్రోన్) ద్వారా మరింత మందికి శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. 25 కేజీల కంటే తక్కువ బరువు ఉండే ఈ డ్రోన్ ఫ్లైయింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు తాజాగా డీజీసీఏ అనుమతి పొందింది. పదేళ్ల గడువుతో లైసెన్సు.. తాజా డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ చేయాలంటే 18 ఏళ్ల వయసు, పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. దాదాపు రెండు వారాల్లో ఫ్లైయింగ్‌లో మెలకువలు పొందిన తర్వాత ఇన్స్ట్రక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన అనంతరం పదేళ్ల వ్యవధి ఉన్న లైసెన్సులు జారీ చేస్తారు. దేశంలోనే ప్రథమం ‘ఏజీ 365 కిసాన్డ్రోన్’...చిన్న, మధ్యస్థ విభాగంలో బ్యాటరీతో పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ అన్నారు. ఏజీ 365 డ్రోన్‌ను 1.5లక్షల ఎకరాల్లో విస్తృతంగా పరీక్షించినట్లు చెప్పారు. దీన్ని వ్యవసాయంలో, డ్రోన్ శిక్షణ కోసం వినియోగించేందుకు ‘రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఆర్పీటీఓ)’ అనుమతి లభించిందన్నారు. ఇలా రెండు ధ్రువీకరణలు అందుకున్న దేశంలోని తొలి డ్రోన్ ఇదేనని చెప్పారు. ఈ డ్రోన్‌కు 22 నిముషాల పాటు ఎగిరే సామర్థ్యం ఉంది. దీంతో పంట పొలాల్లో మందు పిచికారీ సులభం అవుతుంది. రైతులకు పొలాల వద్దే శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: చివరకు ఏఐలోనూ లింగవివక్ష! కేంద్రప్రభుత్వ నిర్ణయం ప్రకారం స్వయంఉపాది పొందాలనుకునే మహిళలు, మహిళా రైతులకు రెండువారాలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన మహిళలు రోజూ డ్రోన్లను నడుపుతూ రూ.1500 వరకు సంపాదించే అవకాశం ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే రైతులకు తక్కువ వడ్డీకే రూ.10లక్షల వరకు, సర్వీస్ ప్రొవైడర్లకు రూ.2కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 50-100 శాతం సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉందన్నారు. అయితే ఆ రుణాలు ఎలా పొందాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఇంఫాల్ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం
ఇంఫాల్: గగనతలంలో డ్రోన్లు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కని్పంచినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. విమానాల రాకపోకలను కూడా నిలిపేశారు. రెండు విమానాలను దారి మళ్లించగా అక్కణ్నుంచి బయల్దేరాల్సిన మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. మూడు గంటల విరామం అనంతరం సేవలను పునరుద్ధరించారు. తూర్పున మయన్మార్‌తో మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. -
సెంట్రల్ ఢిల్లీలో డ్రోన్ కలకలం
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రం జరుగుతున్న సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఓ డ్రోన్ ఎగరడంతో పోలీస్ అధికారులను చెమటలు పట్టించింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీని షూట్ చేసేందుకు వాడిన డ్రోన్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని సంబంధీకుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జీ20 సదస్సు నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తగా ఆగస్ట్ 29 నుంచి ఈ నెల 12 వరకు పలు భద్రతా చర్యలు ప్రకటించారు. పారా గ్లైడర్లు, బెలూన్లు, డ్రోన్ల వంటివి ఎగరేయడంపై నిషేధం కూడా అందులో ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా సెంట్రల్ ఢిల్లీలోని షాది ఖాంపూర్‌కు చెందిన హర్మన్‌జీత్ సింగ్(29) బంధువు పుట్టిన రోజు వేడుకను తన నివాసం టెర్రస్‌పై ఏర్పాటు చేశాడు. దీనిని షూట్ చేసేందుకు డ్రోన్‌ను వాడాడు. జీ20 శిఖరాగ్రం జరుగుతున్న ప్రాంతంలో ఇది ఆకాశంలో ఎగురుతుండటం గమనించిన కంట్రోల్ స్టేషన్ అధికారులు, అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. వారు వెంటనే డ్రోన్‌ను వినియోగిస్తున్న హర్మన్‌జీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్లోని ఫుటేజీని పరిశీలించడగా అది బర్త్‌డే పార్టీకి సంబంధించిందేనని తేలింది. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
'ఆకాశవీధిలో'.. డ్రోన్ల లేజర్ షో..
మహబూబ్‌నగర్: పాలమూరులోని మినీట్యాంకుబండ్పై ఆదివారం రాత్రి రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 450 డ్రోన్ల ద్వారా నిర్వహించిన మెగా లేజర్ షో ఆకాశంలో కనువిందు చేసింది. 15 నిమిషాల పాటు ఆకాశంలో నిర్వహించిన వివిధ ప్రదర్శనలు అద్భుతంగా అనిపించాయి. కొన్నిరోజులుగా జిల్లా అధికారులు ఈ ప్రదర్శనపై విస్తృతంగా ప్రచారం కల్పించడంతో వేలాది మంది తరలివచ్చారు. సాయంత్రం ఐదు గంటల నుంచే జనం రాక మొదలైంది. ఒకవైపు మినీ ట్యాంక్‌బండ్ ప్రధాన ద్వారమైన మోడ్రన్ రైతుబజార్ పక్క నుంచి, మరోవైపు షాషాబ్‌గుట్ట–భగీరథకాలనీచౌరస్తా మధ్యనున్న కట్ట నుంచి స్టేజీ వద్దకు అనుమతించారు. ముందుగా హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు తెలంగాణపై పాడిన పాటలు ఆహుతులను అలరించాయి. ముఖ్యంగా రేలారేలారే.. నా తెలంగాణ, బలగం సినిమాలోని ఊరు.. పల్లెటూరు.. తదితర పాటలకు యువత కేరింతలు కొట్టారు. కార్యక్రమం రాత్రి 8 గంటలకు ముగియగా జనం ఒక్కసారిగా బయటకు వస్తుండగా రెండు మార్గాల్లోనూ గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోగా.. పోలీసులు క్లియర్ చేశారు. అట్టహాసంగా ప్రారంభం.. లేజర్ షో ప్రదర్శనకు ముఖ్య అతిథి హాజరైన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ శ్రీనివాస్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఇంత పెద్ద డ్రోన్‌షో నిర్వహించడం దేశంలోనే మొదటిసారి అన్నారు. క్రమం తప్పకుండా ఇలాంటి ఈవెంట్స్ భవిష్యత్‌లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ కె.నరసింహ, డీసీసీబీ ఇన్చార్జ్ చైర్మన్ వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, జిల్లా గొర్రెల పెంపకందారుల సంక్షేమ సంఘం అధ్యక్షు డు శాంతన్న యాదవ్, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేష్‌కుమార్, కమిషనర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం
-
నల్లగొండ: విమాన డ్రోన్ కలకలం.. ఎయిర్టెల్ సిమ్, సీసీ కెమెరాలు..
శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలోని పంటపొలాల్లో ఆదివారం విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ పడిపోయింది. అదే సమయంలో ఆప్రాంతంలో మేకలు మేపుతున్న ఓ మేకల కాపరి కొంత భయాందోళనకు గురయ్యాడు. కాసేపటి తర్వాత దగ్గరకు వెళ్లి చూసి ఆ విషయాన్ని తన కుమారుడికి ఫోన్‌చేసి చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన కొంతమంది యువకులు డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పగా, ఎస్ఐ సతీష్ అక్కడికి వచ్చి డ్రోన్‌ను పరిశీలించారు. ఈ డ్రోన్‌లో ఎయిర్టెల్ సిమ్, సీసీ కెమెరాలు, జీపీఎస్, బ్యాటరీ ఉన్నట్లు గుర్తించారు. 76 నంబర్‌తో ఉన్న ఈ డ్రోన్ రెక్కలపై ఎఫ్ఎల్216020220415099 నంబర్ ఉన్నట్లు ఎస్ఐ చెప్పారు. ఐదడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పుతో ఉన్న ఈ డ్రోన్ 15 కిలోల బరువు ఉందన్నారు. పంటపొలాల్లో పడిపోయిన ఈ డ్రోన్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తర్వాత బాంబ్ స్క్వాడ్ ఘటనాస్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో ఎలాంటి బాంబుల ఆనవాళ్లు లేవని నిర్ధారించింది. డ్రోన్లోని సిమ్‌కార్డును తీసి కనెక్ట్ చేసేందుకు యత్నించగా, సిమ్‌కార్డు కనెక్ట్‌కాలేదు. అనంతరం డ్రోన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇది కూడా చదవండి: మరో రెండ్రోజులు ఉక్కపోతే.. -
‘తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు’
తిరుపతి: తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని, త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ అందుబాఠులోకి వస్తుందన్నారు. తిరుమలలో డ్రోన్ల వ్యవహారంపై కేసు నమోదైన సంగతిని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ ఆపరేటర్లు అత్యుత్సాహంతో వీడియోలో తీసుకుంటే చర్యలు చేపడతామన్నారు. కాగా, టీటీడీ భద్రత సిబ్బంది కళ్లుగప్పి... ఓ డ్రోన్ స్వామి వారి ఆలయం పై చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. స్వామి వారి ఆలయానికి సంబంధించినదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. సెక్యూరిటీ పరమైన ఆంక్షలు ఉండి.... స్వామి వారి ఏరియల్ వ్యూ ను బయటకు రాకుండా చూసుకుంటుంది టీటీడీ. అయితే ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ చేసిన నిర్వాకం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతోంది. చదవండి: తిరుమల: ‘అందుకే డ్రోన్లు ఎగురవేశారు!’ శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్‌పై టీటీడీ సీరియస్.. విచారణకు ఆదేశం -
కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..!
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తమ గగనతలంలోకి మరోసారి కిమ్ దేశానికి చెందిన డ్రోన్లు ప్రవేశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అవసరమైతే 2018లో కుదుర్చుకున్న సైనిక ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కిమ్ దేశం హద్దులు మీరొద్దని తేల్చి చెప్పారు. గతవారం ఉత్తరకొరియా డ్రోన్లు దక్షిణ కొరియాలోకి ప్రవేశించాయి. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దు దాటి చక్కర్లు కొట్టాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన యూన్ సుక్.. పొరుగు దేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమ సైన్యం ఈ విషయంలో వ్యవహిరించిన తీరుపైనా మండిపడ్డారు. డ్రోన్లు తమ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు సైన్యం సరైన రీతిలో స్పందించాల్సిందని వ్యాఖ్యానించారు. హద్దు మీరినప్పుడు చూస్తూ ఉరుకోవద్దన్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య దశాబ్దాల కాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. యూన్ సుక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పొరుగు దేశంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కిమ్ దేశం నిబంధనలు ఉల్లంఘిస్తే దీటుగా బదులిస్తున్నారు. చదవండి: రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్‌పై దాడి దృశ్యాలు.. పుతిన్ కీలక ఆదేశాలు -
విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం...
న్యూఢిల్లీ: కోల్‌కతాలో స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకలకు ముందే ఇద్దరు బంగ్లదేశ్ పౌరులు విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరువేశారు. దీంతో భారత్ హై కమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. భారీ కంటైనర్లలో పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సుమారు ఆరుగురు అనుమానితుల్ని అదపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....మీరట్ జైలులో ఉన్న అనిల్ గ్యాంగ్ స్టర్‌కి ఈ ఆపరేషన్‌లో ప్రమేయం ఉన్నట్లు చెబుత్నున్నారు. ఈ మేరకు జౌన్‌పర్ నివాసి సద్దాం కోసం అనిల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రుడూన్‌లోని గన్‌హౌస్ నుంచి ఈ ఆయుధాల కంటైనర్లను సిద్ధం చేశాడని తెలిపారు. అంతేకాదు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఒకరు గన్‌హౌస్ యజమాని. దీన్ని ఉగ్రవాదుల కుట్రగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు ఆగస్టు 6న ఆనంద్ విహార్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌తో సహా అనుమానస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు రెండు బరువైన బ్యాగులను తరలిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో తాము వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలతో కూడిన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను లక్నోకు సరఫరా చేయన్నుట్లు విచారణలో తేలిందని చెప్పారు. అలాగే స్మారక చిహ్నంపై డ్రోన్లు ఎగరువేసిన బంగ్లాదేశ్ పౌరులు మహ్మద్ షిఫాత్, మహ్మద్ జిల్లూర్ రెహమాన్‌లుగా గుర్తించామని చెప్పారు. ఆ వ్యక్తులు స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరు వేయడమే కాకుండా పరిసరాల్లో ఫోటోలు తీస్తుండటంతో సీఎస్ఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనలతో భారత ప్రభుత్వం అప్రమత్తమై గట్టి బంధోబస్తు ఏర్పాటు చేసింది. అదీగాక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశవ్యాప్తంగా గట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం తోపాటు, తనీఖీలు కూడా ముమ్మరం చేశారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్లతో సహా అన్ని ప్రజా సందోహం ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. -
పంజాబ్‌లో పాక్ డ్రోన్ కలకలం
అమృత్సర్: పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ పంజాబ్‌లో జారవిడిచిన 4 కిలోల ఆర్డీఎక్స్, తుపాకీ, బాంబు తయారీ సామగ్రిని రికవరీ చేశామని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) బుధవారం తెలిపింది. అర్ధరాత్రి సమయంలో పాక్ నుంచి వస్తున్న డ్రోన్‌పైకి గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని పంజ్‌గ్రైన్ వద్ద రక్షణ సిబ్బంది కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సోదా చేయగా రెండు ప్యాకెట్లు లభించాయని చెప్పారు. వీటిలో డ్రగ్స్ ఉంటాయని తొలుత భావించామని, తెరిచి చూస్తే 4.7 కిలోల ఆర్డీఎక్స్, చైనా తయారీ తుపాకీ, 22 బుల్లెట్లతో కూడిన మ్యాగ్జైన్, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, టైమర్, డిటోనేటింగ్ కార్డ్, స్టీల్ కంటైనర్, నైలాన్ తాడు, ప్లాస్టిక్ పైను, లక్ష రూపాయల నగదు కనిపించాయని తెలిపారు. వీటిని ఐఈడీ (పేలుడు పదార్థాలు) తయారీకి వినియోగిస్తారన్నారు. వీటిని జారవిడిచిన అనంతరం డ్రోన్ తిరిగి పాక్‌లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. భారతీయ జాలర్లను అరెస్టు చేసిన పాక్ భారత్‌కు చెందిన 36 మంది జాలర్లను పాకిస్తాన్ నావికాధికారులు అరెస్టు చేశారు. వీరికి చెందిన 6 పడవలను కూడా పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న కారణంపై వీరిని పాక్ అదుపులోకి తీసుకుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. పాక్ ఈఈజెడ్‌లో ఈ జాలర్లు ప్రవేశించారని, అందుకే అరెస్టు చేశామని పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. -
లియో... ద రోబో డ్రోన్
ఎగిరే డ్రోన్స్ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్ వచ్చేసింది. సెంటర్ ఫర్ అటానమస్‌సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (కాస్ట్) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్ పేరు లియోనార్డో... (లెగ్స్ ఆన్‌బోర్డ్ డ్రోన్). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్ తాడుపై నడవడమే కాదు... స్కేటింగ్ కూడా చేయగలదు. అవసరం ఉన్న చోట సాధారణ డ్రోన్ మాదిరిగానే ఎగురుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడుస్తుంది. రెండు కాళ్లకు ఉన్న హైబ్రిడ్ మూవ్మెంట్ వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా కదులుతుంది. ఎగురుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. సాధారణ డ్రోన్ ఆపరేటింగ్ కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ డ్రోన్ సునాయాసంగా పని చేయగలుగుతుందని చెబుతున్నది బృందం. ‘‘ఆకాశంలో ఎగురుతూ, నేల మీద నడుస్తూ తమ అవసరాలకనుగుణంగా కదిలే పక్షులే మాకు స్ఫూర్తి. ఎగిరే డ్రోన్లకు కొన్ని పరిమితులున్నాయి. విద్యుత్ వినియోగం ఎక్కువ. కానీ లియో అలా కాదు. పరిస్థితులకు అనుగుణంగా దాని మోడ్‌ను మార్చుకుంటుంది. జెట్సూట్ వేసుకున్న మనిషి భూమి మీద వాలేప్పుడు, ఎగరడానికి ముందు కాళ్లను నియంత్రించినట్టుగానే ఈ రోబో డ్రోన్ సైతం నియంత్రిస్తుంది. హై వోల్టేజ్ లైన్ల తనిఖీ, అంతరిక్ష కేంద్రంలోని వివిధ భాగాల మరమ్మతుల వంటివి చాలా ప్రమాదంతో కూడుకున్నవి. అలాంటి వాటిని సైతం లియో ఒక్కటే చేసేస్తుంది’’అని ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సూన్ జో చుంగ్ తెలిపారు. అయితే మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దాని ధర ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇంకా పయ్రోగ స్థాయిలో ఉన్న ఈ రోబో... తయారీ కోసం ఏదైనా కంపెనీ ముందుకొస్తే త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. -
దేశంలో ఎగిరే టాక్సీలకి తొలిగిన అడ్డంకి
మన దేశంలో రాబోయే కాలంలో నగర రోడ్లపై ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కావచ్చు. దేశంలో డ్రోన్(Drone) కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేస్తూ నూతన 2021 డ్రోన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్ నిబంధనలు-2021(Drone Rules) పేరిట వీటిని విడుదల చేసింది. "ఎయిర్ టాక్సీలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోదనలు జరుగుతున్నాయి.. దీనికోసం అనేకా స్టార్టప్ లు ముందుకు వస్తున్నాయి. మీరు రోడ్లపై చూసే ఉబెర్ టాక్సీల వలే, కొత్త డ్రోన్ పాలసీ కింద మీరు గాలిలో ఎగిరే టాక్సీలను చూసే సమయం చాలా దూరంలో లేదు. త్వరలోనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నా' అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం.. డ్రోన్ల ఆపరేషన్ కోసం లైసెన్స్ నమోదు లేదా జారీ చేయడానికి ముందు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు. అంతేగాకుండా, ఈ లైసెన్స్ ఫీజులను గణనీయంగా తగ్గించారు. కార్గో డెలివరీల కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. డ్రోన్లు గరిష్ఠంగా మోసుకెళ్లే సామర్ధ్యాన్ని 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచారు. డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారాలను 25 నుంచి 5కు తగ్గించింది. ఆపరేటర్ నుంచి వసూలు చేసే ఫీజుల రకాలను 72 నుంచి నాలుగుకు తగ్గించింది. ఇక అన్ని డ్రోన్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారం ద్వారా జరుగుతాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సిఫారసు చేసే నిబంధనలకు అనుగుణంగా అన్ని డ్రోన్ ట్రైనింగ్, పరీక్షలు నిర్వహించబడతాయి.(చదవండి: అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!) జర్మన్ ఫ్లయింగ్ టాక్సీ స్టార్టప్ వోలోకాప్టర్ 2024 పారిస్ లో జరిగే ఒలింపిక్స్ సమయానికి తన ఎయిర్ టాక్సీని అందుబాటులోకి తీసుకొనిరావలని చూస్తుంది. భారీ డ్రోన్ లాగా కనిపించే ఈ ఎగిరే టాక్సీ రెండు సీట్లను కలిగి ఉంటుంది. ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులు కూడా ఈ రంగంలో ఆసక్తిని కనబరుస్తున్నారు సింధియా అన్నారు. హ్యుందాయ్ 2025 నాటికి తన ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ దక్షిణ కొరియా కంపెనీ ఎయిర్ టాక్సీలను అభివృద్ధి చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీల పనిచేస్తుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే పట్టణ కేంద్రాల నుంచి విమానాశ్రయాలకు ఐదు నుంచి ఆరు మందిని రవాణా చేయగలదు. -
టెక్నాలజీ సాయంతో చమురు చోరీ, నిఘాకు ఐవోసీ డ్రోన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న చమురు పైప్లైన్ల భద్రతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డ్రోన్లను రంగంలోకి దింపింది. ఢిల్లీ– పానిపట్ మార్గంలో 120 కిలోమీటర్ల పైప్‌లైన్‌పై నిఘా కోసం డ్రోన్ సేవలను ప్రారంభించింది. చమురు దొంగతనాలను నిరోధించడమే కాకుండా, ప్రమాదాలను అరికట్టడం కోసం టెక్నాలజీ వినియోగం అవసరమని సంస్థ భావిస్తోంది. 15,000 కిలోమీటర్ల పరిధిలో సంస్థకు పైపులైన్లు విస్తరించి ఉండగా.. వీటిల్లో లీకేజీలను గుర్తించేందుకు ఇప్పటికే ఎంతో అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తోంది. ఇప్పుడు పైపులైన్ల పర్యవేక్షణకు డ్రోన్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్టు ఐవోసీ అధికారులు తెలిపారు. టెక్నాలజీ సాయంతో చమురు చోరీకి సంబంధించి 2020–21లో 34 ప్రయత్నాలను అడ్డుకున్నట్టు, 53 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఆప్టికల్ఫైబర్ ఆధారిత పైపులైన్ ఇంట్రూజర్ డిటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ (పీఐడీడబ్ల్యూఎస్)ను ఐవోసీ 5,474 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తోంది. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
ఫిట్నెస్ డ్రోన్స్ వచ్చేస్తున్నాయ్.. సమస్యలూ లేకపోలేదు!
ఇప్పటివరకు డ్రోన్స్ అంటే మిలటరీలో వాడతారని, అమెరికా లాంటి దేశాల్లో సరుకుల డెలివరీకి వాడతారని, మనదగ్గరైతే ఫొటోషూట్స్ కోసం వాడతారని తెలుసు. కానీ త్వరలో పర్సనల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ రంగంలో డ్రోన్స్ కాలుమోపనున్నాయి. ఫిట్నెస్ డ్రోన్లతో రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జాగోబోట్ పేరిట కొన్ని నమూనాలు ఫిట్నెస్ రంగంలో హల్చల్ చేస్తున్నాయి. మెల్బోర్న్కు చెందిన ఎక్సర్షన్ గేమ్స్ ల్యాబ్ 2012లోనే దీన్ని సృష్టించింది. ఈ డ్రోన్ జాగింగ్ చేసేవారు ధరించే టీషర్ట్‌పై ఉండే ప్రత్యేక మార్కర్‌ను గుర్తించి దానికి పదడుగుల దూరంలో ఎగురుతూ ఉంటుంది. జాగింగ్‌లో దీన్ని తోడుగా కొందరు భావిస్తే, కొందరు పేసర్‌గా వాడుకుంటున్నారు. అయితే ఎక్కువమంది దీన్ని జాగింగ్‌లో స్నేహితుడిగా భావించడమే ఆశ్చర్యాన్నిస్తోందని దీని సృష్టికర్త ముల్లర్ చెప్పారు. మనిషి సంఘజీవి అని, ఒంటరిగా ఎక్కువసేపు ఉండడం ఎక్కువమందికి చేతకాదని వివరించారు. అందుకే చాలామంది ఫ్రెండ్స్‌తో, కుటుంబసభ్యులతో లేదా పెంపుడు కుక్కతో జాగింగ్‌కు వెళ్తుంటారన్నారు. ఇప్పుడు అంతా మెకానికల్ లైఫ్ అవుతున్న దశలో సరైన జాగింగ్ పార్టనర్ దొరకడం కష్టమవుతోంది. అలాంటివారికి జాగ్బాట్ స్నేహితుడిలా ఉపయోగపడుతోంది. పరిమితులున్నాయి హాలీవుడ్ సినిమాల్లోలాగా జాగ్బాట్ అన్నీ చేసేయదు. దీనికి కొన్ని పరిమితులున్నాయి. దీంతో జాగింగ్ చేయాలంటే సరళమార్గాల్లోనే పరుగెత్తాలి. అలాగే దీని బ్యాటరీ లైఫ్ 30 నిమిషాలే ఉంటుంది. ఈ లోటుపాట్లను అర్ధం చేసుకొని మరికొన్ని కంపెనీలు మరింత ఉన్నత సాంకేతికతతో కూడిన ఫిట్నెస్ డ్రోన్ల తయారీకి ముందు కొస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన హాంగిక్ యూనివర్సిటీ విద్యార్థ్ధులు తాజాగా ట్రావెర్స్ డ్రోన్ పేరిట కొత్త నమూనా రూపొందించారు. కొత్తగా వ్యాయామాలు మొదలెట్టేవారికి పర్సనల్ ట్రైనర్‌గా వ్యవహరించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం దీనిలో అనేక కెమేరాలు, సెన్సర్లు అమర్చారు. డ్రోన్ వాడే కస్టమర్లు చిన్న పాడ్ లాంటిదాన్ని మెడలో వేసుకుంటే సరిపోతుంది. దీనిద్వారా డ్రోన్ కంట్రోల్స్‌ను మార్చుకోవడంతో పాటు, వాయిస్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. త్వరలో దీన్ని ఉత్పత్తి దశకు తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఎలక్ట్రానిక్ ట్రైనింగ్ యంత్రాల సాయం దివ్యాంగులకు మరింత ఎక్కువ ఉపయుక్తమని రిసెర్చర్లు భావిస్తున్నారు. ఈ దిశగా రోబోటిక్స్ రిసెర్చ్ ల్యాబ్ బ్లైండ్ రన్నర్లకు సహాయకారిగా ఉండే డ్రోన్లను రూపొందించింది. – డి. శాయి ప్రమోద్ సమస్యలు కూడా ఉన్నాయి ఇలాంటి యంత్రాల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ప్రతిధ్వని సమస్య. ఒక గదిలో వ్యాయామాలు చేస్తున్నప్పుడు డ్రోన్ కు ఇచ్చే వాయిస్కమాండ్ గదిలో ప్రతిధ్వనిస్తే డ్రోన్ కరెక్ట్‌గా గ్రహించలేదు. అలాగే బయట వాతావరణంలో పలు శబ్దాల మధ్య మన గొంతును కచ్ఛితంగా గుర్తుపట్టడం కూడా డ్రోన్ కు సమస్యే!. ఇక మరో అతిపెద్ద సమస్య డ్రోన్ తో ఢీ కొనడం! బ్లైండ్రన్నర్లు పరిగెత్తే సమయంలో డ్రోన్ మూవ్మెంట్ మొరాయిస్తే ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే దీర్ఘకాలిక బ్యాటరీ శక్తిని సమకూర్చడం కూడా అవసరం. ఈ సమస్యలకు పరిష్కారాల కోసం పరిశోధకులు యత్నిస్తున్నారు. ఇక ఫిట్నెస్ డ్రోన్లంటే కేవలం జాగింగ్, రన్నింగ్‌కు మాత్రమే సాయం చేస్తాయనుకుంటే పొరపాటే! పలు యూరోపియన్ సాకర్ టీమ్‌లు ప్రత్యర్ధి టీమ్ వ్యూహాలు, బాల్ కదలికలను అధ్యయనం చేసుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. అలాగే కొన్ని క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పోశ్చర్‌ను అన్ని కోణాల్లో చూసుకొని తప్పులు దిద్దుకునేందుకు డ్రోన్లను వాడుతున్నారు. పైన చెప్పుకున్న ఎక్సర్షన్ ల్యాబ్ తాజాగా ధ్యాన డ్రోన్స్‌ను తయారు చేయాలని భావిస్తోంది. డ్రోన్ ఛిగా పిలిచే ఈ డ్రోన్ చైనా మార్షల్ ఆర్ట్ తాయ్ఛికి ప్రతిరూపమని తెలిపింది. ఇప్పటికీ ఈ డ్రోన్ ప్రొటోటైప్స్‌ను సంస్థ రూపొందించింది. భవిష్యత్‌లో ఈ డ్రోన్లు ఫిట్నెస్ విషయంలో మెకానికల్ భాగస్వాములుగా మారనున్నాయంటే అతిశయోక్తి కాదేమో! -
డ్రోన్లు ఎగరాలంటే ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: భారత సైన్యంపై డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ వాటి ముప్పు గురించిన చర్చ మొదలైంది. అయితే, డ్రోన్ల వల్ల తలెత్తే అవాంఛనీయ పరిస్థితులను ముందే పసిగట్టిన మన రాష్ట్ర పోలీసులు వాటికి విరుగుడుగా గత ఏడాది గరుడదళం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ దళం ఉనికి, పనితీరు గురించిన పురోగతిని ఇంతవరకూ పోలీసు శాఖ వెల్లడించకపోవడం గమనార్హం. ప్రధానంగా మావోయిస్టులను కట్టడి చేయడమే ధ్యేయంగా ఈ గరుడదళానికి పురుడుపోశారు. ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్రల నుంచి మావోలు అప్పుడప్పుడూ రాష్ట్రంలోకి ప్రవేశించేవారు. డ్రోన్ల సాయంతో కూంబింగ్ దళాల ఉనికిని తెలుసుకొని గోదావరి–ప్రాణహిత నదులను దాటుతూ తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో తక్కువ ఎత్తులో ఎగిరే అనుమానాస్పద డ్రోన్లను పట్టుకునేందుకు ‘‘గరుడస్క్వాడ్’’పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయా లని 2020 ఆగస్టులో పోలీసు శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని గద్దలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇద్దరు శిక్షకులను కూడా నియమించింది. ఈ శిక్షణ 2021 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఆ తరువాత అవి విధుల్లో చేరతాయని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది జూలై వచ్చినా వీటి గురించి ఎలాంటి సమాచారం లేదు. జిల్లాల్లో ఇష్టానుసారంగా.. జిల్లాల్లో కొందరు ఫొటో, వీడియోగ్రాఫర్లు ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం డ్రోన్లను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. కొందరు అర కిలోమీటరు ఎత్తు వరకు ఎగిరే డ్రోన్లను కిరాయికి తీసుకు వస్తున్నారు. మరికొందరు నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బర్త్‌డే పార్టీలు, పెళ్లిళ్లు, బారసాలలు, జాతరలు, ర్యాలీలు, ఉత్సవాలు, రాజకీయనేతల సభలు, సమావేశాల్లో వీటిని ఎడాపెడా వాడుతున్నారు. ముఖ్యంగా వీఐపీల నివాసాలు, సాగునీటి ప్రాజెక్టుల సమీపంలో ఎగరేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ డ్రోన్లు దాదాపు 500 గ్రాముల బరువును మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటాయి. 90 శాతం డ్రోన్లకు అనుమతుల్లేవు.. పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రోన్ల వివరాలు సేకరిస్తోంది. అధికారిక కార్యక్రమాలు మినహా ప్రైవేట్ కార్యక్రమాలలో వినియోగించే డ్రోన్లపై దృష్టి సారించింది. ఎక్కడైనా డ్రోన్లను ఎగరేయాలనుకుంటే ముందుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అనుమతి తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 నుంచి 2,000 వరకు డ్రోన్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. గ్రేటర్ పరిధిలోనే 800లకుపైగా ఉన్నట్టు సమాచారం. సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం... వీటిలో 90 శాతం డ్రోన్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అని 2014లోనే కేంద్రం హెచ్చరించింది. నెదర్లాండ్స్ స్ఫూర్తితో... డ్రోన్లను పట్టుకునేందుకు నెదర్లాండ్స్ దేశంలోని పోలీసులు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో వీరిబాటనే పలు దేశాలు అనుసరిస్తున్నాయి. డ్రోన్లతో ఉగ్రముప్పు ఉన్న విషయాన్ని ముందుగానే ఊహించిన తెలంగాణ పోలీసులు ఆ మేరకు గతేడాదే సంసిద్ధులయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్టుల ఆటకట్టించే దిశగా ఎంపిక చేసిన గద్దలకు శిక్షణ ప్రారంభించారు. కానీ, వాటి పురోగతిని మాత్రం తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారు. -
శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై సమగ్ర దర్యాప్తు
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై పోలీస్ శాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఎస్పీ ఫక్కీరప్ప సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రుతితో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. పోలీసులు సున్నిపెంటలో అనుమానిత వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. లంబాడీ కాలనీలో నివాసం ఉంటున్న గుంటె బాలకృష్ణ అలియాస్ బాలును అదుపులోకి తీసుకున్నారు. గతంలో తాను ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంకు చెందిన వెంకట్ అనే వ్యక్తి నుంచి డ్రోన్‌ను అద్దెకు తీసుకుని డ్యాం పరిసర ప్రాంతాలను వీడియో తీసినట్టు బాలకృష్ణ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం తాను డ్రోన్‌ను వినియోగించడం లేదన్నాడు. అతడికి చెందిన కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం రాత్రి మరోసారి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ తిరగడం కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్డులో డీఎస్పీ శ్రుతి పోలీస్ సిబ్బందితో వెళుతుండగా ఇది కనిపించింది. -
శ్రీశైలంలో డ్రోన్ కలకలం
శ్రీశైలం: గుర్తు తెలియని డ్రోన్ నాలుగు రోజులుగా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ఎత్తులో చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణం, మల్లమ్మ గుడి వెనుకాల నుంచి తక్కువ ఎత్తులోకి రావడంతో గమనించిన భద్రతా సిబ్బంది ఆలయాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విషయం తెలియజేశారు. దీంతో దేవస్థాన అధికారులతో పాటు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. దానిని వెంబడించేందుకు దేవస్థానం డ్రోన్‌ను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని గమనించి డ్రోన్‌ను నియంత్రిస్తున్న అపరిచిత వ్యక్తి సిగ్నల్స్‌ను ఆపివేశారు. అనంతరం అది కనిపించకుండాపోయింది. శ్రీశైల మహాక్షేత్రానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గతంలోనే హెచ్చరించాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పరిధిలోని రెండో పవర్‌హౌస్‌లో విద్యుదుత్పాదనను నిరంతరం కొనసాగిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా సెకండ్ పవర్‌హౌస్ వద్ద పోలీస్ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన టెక్నికల్ సిబ్బంది డ్రోన్‌ను వినియోగించి ఫొటోలు, వీడియోల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారన్న అనుమానాలూ లేకపోలేదు. ఘటనపై శ్రీశైలం సీఐ వెంకటరమణ మాట్లాడుతూ డ్రోన్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. శ్రీశైలంలోని సత్రాలు, అతిథి గృహాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. డ్యామ్ వద్ద 40 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
భారత ఎంబసీపై డ్రోన్ చక్కర్లు
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై గతవారం ఒక డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటన భారత్ స్పందించింది. ఆ ఘటనపై విచారణ జరపాలని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఈ ఘటనపై పాక్‌లోని భారత హై కమిషన్ కూడా పాకిస్తాన్‌కు ఘాటుగా లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ కార్యాలయ భవనంపై జూన్ 26న ఒక డ్రోన్ ఎగురుతుండడాన్ని గుర్తించాం. దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పాకిస్తాన్ విచారణ జరుపుతుందని, ఇలాంటి భద్రతాపరమైన లోపాలు మళ్లీ తలెత్తకుండా చూస్తుందని భావిస్తున్నాం’ అని శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్ బాగ్చీ మీడియాకు తెలిపారు. జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై జూన్ 27న జరిగిన డ్రోన్ దాడి ఉగ్రవాదుల దుశ్చర్యేనని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా శుక్రవారం పేర్కొన్నారు. అది భారత్ తప్పుడు ప్రచారం భారత హైకమిషన్ కార్యాలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టిందన్న ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అది భారత్ చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎదురుదాడి చేసింది. భారత హై కమిషన్ కార్యాలయ భవనంపై ఎలాంటి డ్రోన్లు తిరగలేదని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌధరి చెప్పారు. డ్రోన్ చక్కర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా భారత్ తమకు అందించలేదన్నారు. జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిపై ఆయన స్పందించలేదు. కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం భద్రత బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒక డిస్ట్రిక్ట్ కమాండర్ కూడా ఉన్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒక జవాను, అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొది లారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, రాజ్‌పొరా ప్రాంతంలో ఉన్న హంజిన్ గ్రామం వద్ద భద్రత బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డారని కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఘటన స్థలానికి అదనపు బలగాలు చేరుకుని టెర్రరిస్ట్‌లపై కాల్పులు జరిపాయన్నారు. ఈ కాల్పుల్లో లష్కరే జిల్లా కమాండర్ నిషాజ్ లోన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. హతుల్లో ఒక పాకిస్తానీ కూడా ఉన్నాడన్నారు. పాక్ డ్రోన్‌పై కాల్పులు జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఒక డ్రోన్‌పై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. అది పాకిస్తానీ నిఘా డ్రోన్‌గా అనుమానిస్తున్నారు. జమ్మూ శివార్లలోని ఆర్ని యా సెక్టార్లో శుక్రవారం తెల్లవారు జామున ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. వెంటనే ఆ డ్రోన్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం, ఆ డ్రోన్ మళ్లీ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంపై నిఘా వేసేందుకు ఆ డ్రోన్‌ను ప్రయోగించి ఉంటారని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని కీలక రక్షణ స్థావరాలపై సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి సమయంలో పలు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. -
పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీలో డ్రోన్ కలకలం
-
జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్మూ: జమ్మూలోని మూడు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. ఈ పరిణామంతో పోలీసులు, సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిరాన్ సాహిబ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.23 గంటలకు ఒక డ్రోన్ కనిపించగా, కలుచక్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకి ఒక డ్రోన్, కుంజ్‌వానిలో 4.52 గంటలకి మరో డ్రోన్ కనిపించిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగిన దగ్గర్నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట డ్రోన్లు కనిపిస్తూనే ఉన్నాయి. జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వైమానిక స్థావరంపైనే ఆదివారం డ్రోన్లతో తొలిసారిగా దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రోన్లతో ఏ క్షణంలో ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని ఈ వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, సాఫ్ట్ జామర్లు ఏర్పాటు చేసినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో చైనాకు చెందిన డ్రోన్లు వాడినట్టుగా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. డ్రోన్ల నుంచి పేలుడు పదార్థాలను జారవిడిచినట్టుగా భావిస్తున్నారు. నైట్ విజన్, నావిగేషన్ వ్యవస్థ కలిగిన డ్రోన్లను ముష్కరులు వాడినట్టుగా భద్రతా అధికారులు వెల్ల డించారు. మరోవైపు రాజౌరి జిల్లాలో ఏ అవసరానికైనా డ్రోన్లను వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు. -
విచ్చలవిడిగా డ్రోన్ల వినియోగం.. హైదరాబాద్‌కూ ముప్పు!
సాక్షి, హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లో వరుసగా వెలుగులోకి వచ్చిన ‘డ్రోన్ల ఉదంతాలు’ రాజధానికి ఉన్న మప్పును చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడా డీఆర్డీఓ, ఎన్ఎఫ్సీ సహా అనేక రక్షణ సంబంధిత, సున్నిత సంస్థలు ఉండటం, డ్రోన్ల వినియోగం విచ్చలవిడిగా సాగుతుండటం కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అడపాదడపా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. పూర్తిస్థాయిలో కట్టడి మాత్రం సాధ్యం కావట్లేదు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారాగ్లైడర్లు, డ్రోన్లతో పాటు అనధికారికంగా వినియోగించే అన్ని రకాలైన ఎగిరే వస్తువులపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర నిఘా వర్గాలు పదేపదే స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటి కి ఇది అవసరమైన విధంగా అమలుకావట్లేదు. చదవండి: ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యం.. డ్రోన్ల దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నా... ► కేంద్ర నిఘా వర్గాలు ఈ తరహా గగనతల దాడుల అంశంపై ఐదేళ్ల నుంచి పదేపదే హెచ్చరిస్తున్నాయి. ► దేశ వ్యాప్తంగా పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలకు ఆధారాలనూ నిఘా వర్గాలు సేకరించాయి. ► పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబాకు చెందిన ఉగ్రవాది సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జుందాల్, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ, ఖలిస్థాన్ మిలిటెంట్ నాయకుడు జక్తార్ సింగ్ తారాలను కేంద్ర నిఘా వర్గాలు విచారించిన నేపథ్యంలో ముష్కర సంస్థల గగనతల దాడుల వ్యూహం వెలుగులోకి వచి్చంది. ► పాకిస్థాన్‌కి చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్యాడర్‌కు గగనతల దాడుల్లో శిక్షణ ఇస్తున్నట్లు వీరు బయటపెట్టారు. ► పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన ఓ వింగ్ ఈ ఉగ్రవాదులకు పారాచూట్ జంపింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు రాజధానిలో అనధికారిక డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా పని చేసే ఎగిరే వస్తువులు, చిన్నపాటి మానవ రహిత విమానాల వినియోగించడంపై నిషేధాన్ని విధించారు. ► దీన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ అనేక పెళ్లిళ్లు, శుభకార్యాల్లో డ్రోన్ల వినియోగం కనిపిస్తూ ఉంటోంది. ► 95 శాతం మంది ఎలాంటి అనుమతులు లేకుండానే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీల కోసం వాడేస్తున్నారు. ► ‘నగరంలో వీటి వినియోగంపై అనునిత్యం నిఘా ఉంచుతున్నాం. ఎవరైనా అనుమతి కోరినా ఆచితూచి జారీ చేస్తున్నాం. అనధికారికంగా వాడే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అయితే కఠిన చట్టాలు లేని కారణంగా ప్రస్తుతానికి పెట్టీ కేసులు పెట్టాల్సి వస్తోంది’ అని నగర పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. చదవండి: కరీంనగర్ సిగలో మరో తీగల మణిహారం, కేబుల్ బ్రిడ్జికి సర్వం సిద్ధం -
ఉగ్రవాదులు డ్రోన్లతో దాడిచేస్తే ఏంటి పరిస్థితి?
ఇన్నాళ్లూ భయపడిందే జరిగింది. ఉగ్రవాదుల చేతుల్లోకి డ్రోన్లు వెళితే ఎంత ముప్పు ఉంటుందో మనకి తెలిసివచ్చింది. నక్కజిత్తుల పాకిస్తాన్ ఇన్నాళ్లూ ఆయుధాల సరఫరాకి వాడిన డ్రోన్లను ఇప్పుడు ఏకంగా దాడులకే వినియోగించింది. ఇలాంటి కిల్లర్ డ్రోన్లతో మనకి ముప్పు ఎంత? వీటిని ఎదుర్కొనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ సత్తా మనకి ఎంత? కీలకమైన రక్షణరంగ పరిశోధన సంస్థలు, సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడిచేస్తే ఏంటి పరిస్థితి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ), వీటినే సింపుల్‌గా డ్రోన్లు అని పిలుస్తారు. ప్రకృతి వి పత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలకి, మా రుమూల ప్రాంతాల్లో మందుల పంపిణీకి, విందు వినోదాల సమయాల్లో వీడియోలు తీయడానికి, ఉ పయోగపడే ఈ డ్రోన్ టెక్నాలజీని పాకిస్తాన్ తన ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా, యూకే, ఇజ్రాయెల్ తర్వాత మిలటరీ డ్రోన్లను పాకిస్తానే ఎక్కువగా వినియోగిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019, ఆగస్టు 5 చేసిన తర్వాత పాకిస్తాన్ భారత్‌ని ముప్పులోకి నెట్టేలా డ్రోన్ల వినియోగాన్ని అధికం చేసింది. అదే సంవత్సరం జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్ల కదలికలు కనిపించాయి. సరిహద్లుల్లో నిఘా, యథేచ్ఛగా ఆయుధాలు మందుగుండు సామాగ్రి పంపిణీకి పాకిస్తాన్ డ్రోన్లను వినియోగిస్తోంది. డ్రోన్ల సహాయంతో ఆయుధాలను సరిహద్దులు దాటించి భారత భూభాగంలోని ఉగ్రవాదుల సమీపంలో జారవిడుస్తోంది. 2019లో ఆగస్టు 13న అమృత్సర్ సమీపంలోని మెహవా గ్రామం దగ్గర పాక్ డ్రోన్ కుప్పకూలిపోవడాన్ని భద్రతా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు ఎన్నోసార్లు వచ్చి ఆయుధాలు, మం దుగుండు సామగ్రిని సరఫరా చేశాయని పాక్‌కు చెందిన ఉగ్రవాదుల్ని విచారిస్తున్నప్పుడు తేలింది. 2020 జూన్‌లో జమ్మూలోని హీరానగర్‌లో పాక్ నిఘా డ్రోన్‌ని జవాన్లు కూల్చేశారు. 2020 సెప్టెంబర్‌లో అక్నూర్ సెక్టార్లో డ్రోన్ల ద్వారా పాక్ ఆయుధాలను జారవిడిచినట్టు తెలిసింది. డ్రోన్ దాడుల్ని ఎదుర్కోవడం ఎలా? పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల డ్రోన్ దాడులతో యాంటీ డ్రోన్ టెక్నాలజీపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ టెక్నాలజీలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. మన గగనతలంలోకి ప్రవేశించే డ్రోన్లు రాడార్లకి అందడం లేదు. రాడార్లతో గుర్తించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. థర్మల్ కెమెరాల సాయంతో గుర్తిస్తున్నా ప్రమాదం ముంచుకొచ్చేవరకు తెలియడం లేదు. డ్రోన్లను ఎదుర్కోవడానికి సాఫ్ట్‌కిల్, హార్డ్ కిల్ అనే రెండు రకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్ కిల్ టెక్నాలజీతో డ్రోన్లు మన గగనతలంలో ప్రవేశించకుండానే అడ్డుకొని వాటి వ్యవస్థని ఫ్రీజ్ చేయవచ్చును. ఇక హార్డ్‌కిల్ టెక్నాలజీతో డ్రోన్లను కూల్చేయవచ్చు. గత రెండేళ్లుగా సాఫ్ట్ కిల్ టెక్నాలజీని వాడాలని భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతూ వస్తోంది. ఇప్పుడు హార్డ్‌కిల్ వ్యవస్థపై కేంద్రం దృష్టి సారించింది. మన దేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) సొంతంగా తయారు చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థని గత ఏడాది స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద వినియోగించారు. అయితే ఈ వ్యవస్థ కేవలం 2 నుంచి 3 కి.మీ. పరిధిలోకి వచ్చాకే డ్రోన్లను గుర్తించగలదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్‌కి చెందిన స్మార్ట్ షూట్ సంస్థతో యాంటీ డ్రోన్ వ్యవస్థ కొనుగోలుపై కేంద్రం చర్చలు జరుపుతోంది. ఇప్పటికైనా కేంద్రం డ్రోన్లు కొనుగోలుపై కాకుండా, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 21 వేలకి పైగా మిలటరీ డ్రోన్లు ఉన్నట్టుగా అమెరికాకి చెందిన బార్డ్ కాలేజీ సెంటర్ ఫర్ స్టడీ ఆన్ డ్రోన్స్ అంచనా ► పదేళ్ల క్రితం 60 దేశాల్లో మిలటరీ డ్రోన్లు ఉంటే ఇప్పుడు ఈ దేశాల సంఖ్య 95కి పెరిగింది ► కదన రంగంలో వినియోగించే డ్రోన్లు ప్రస్తుతం 171 రకాలు ఉన్నాయి ► అమెరికా ఇజ్రాయెల్, యూకే, రష్యా, టర్కీ వంటి దేశాల తర్వాత పాకిస్తానే అత్యధికంగా మిలటరీ డ్రోన్లను వినియోగిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాక్ వాడుతోంది. ► ఇతర దేశాలకు డ్రోన్లను ఇజ్రాయెల్ అధికంగా ఎగుమతి చేస్తోంది. బ్రిటన్ నుంచి భారత్ వరకు గత ఎనిమిదేళ్లలో 460 కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లను ఆ దేశం ఎగుమతి చేసింది. ► మొట్టమొదటిసారిగా 1982లో సిరియా వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడి చేసింది. ► ఇటీవల కాలంలో సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై యెమన్‌కి చెందిన హౌతి ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు జరిపితే, ఇరాన్‌పై అమెరికా డ్రోన్లతోనే దాడులు సాగించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Pakistan Drone: పాకిస్తాన్ మరో కుతంత్రం
జమ్మూకశ్మీర్: భారత్‌పై దాయాది దేశం పాకి స్తాన్ కుట్రలు ఆగడం లేదు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్ డ్రోన్ జార విడిచిన ఏకే–47 తుపాకీ, ఒక పిస్టల్, మరికొంత ఆయుధ సామగ్రిని బీఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. భారత్–పాక్ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ డ్రోన్ పాకిస్తాన్ భూభాగం నుంచే వచ్చినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ జారవిడిచిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం గొప్ప విజయమని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట తాము ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విజయంలో పాలుపంచుకున్న సిబ్బందిని అభినందించారు. -
ఆకాశంలో యుద్ధం మొదలైందా?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా తమపై భద్రతా బలగాలు డ్రోన్ దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తమపై డ్రోన్ల సాయంతో బాంబు వేశారని ఆరోపించారు. ఏప్రిల్ 19వ తేదీని చీకటి దినంగా లేఖలో అభివర్ణించారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొత్తలంక, పాలగూడెం గ్రామాల సరిహద్దులో డ్రోన్ల సాయంతో 12 బాంబులు జారవిడిచారని పేర్కొన్నారు. మావోయిస్టులపై ఆకాశమార్గం ద్వారా జరిగిన ఈ దాడిని అన్ని వర్గాలవారు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఈ మేరకు దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. ఈ దాడిలో పశుపక్షాదులు, వృక్షాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఏప్రిల్ 3న బీజాపూర్‌లో భద్రతా బలగాలపై తాము జరిపిన దాడికి ఇది ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఆ దాడితో నీరుగారిపోయిన స్థానిక పోలీసులు, ఇక్కడ మైనింగ్ చేపట్టాలనుకుంటున్న కార్పొరేట్ శక్తుల్లో తిరిగి మనోధైర్యం కూడగట్టేందుకే ఈ వాయుదాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ చర్యలు వదిలి మావోల ఏరివేతపై దృష్టి సారించడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. ఆకాశ యుద్ధం మొదలైందా? ఈ పరిణామాలు చూస్తుంటే మావో–భద్రతా బలగాల మధ్య ఆకాశయుద్ధం మొదలైందా అన్న చర్చ మొదలైంది. డ్రోన్ దాడి జరిగిందని మావోలు, తాము చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే దేశ చరిత్రలో మావోలు, భద్రతా బలగాల పోరులో జరిగిన తొలి వాయుదాడి ఇదే అవుతుంది. మావోల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ ప్రహార్’మొదలుపెట్టిందని మావోలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే వాయు దాడులు జరిగాయంటున్నారు. అయితే స్థానిక ఎస్పీ కశ్యప్ ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాత్రం మావోల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మావోల కేడర్‌లో ఉన్న ఆధిపత్య పోరులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. తాము స్థానిక ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వారు అమర్చిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్)లతో మహిళలు, చిన్నారులు సహా వేలాది మంది మరణాలకు మావోలే కారణమని ఆరోపించారు. బుధవారం కూడా ఐఈడీ కారణంగా ఓ ఐటీబీపీ జవాను గాయపడగా, ఓ ఆవు మరణించిందని వెల్లడించారు. మరోవైపు ఈ దాడిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. స్థానికంగా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వాడే డ్రోన్ల సామర్థ్యం చాలా తక్కువని, అవి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఎగురుతాయని, 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణిస్తాయని చెబుతున్నారు. అందులోనూ అవి నిఘా సంబంధిత సమాచారం మాత్రమే సేకరిస్తాయని, వీటికి బాంబులు మోసుకెళ్లే శక్తి లేదని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ డ్రోన్ దాడి జరిగి ఉంటే అవి బీజాపూర్‌కు సమీపంలో ఉన్న బిలాయ్ (389 కి.మీ.), జగదల్పూర్ (189 కి.మీ.), హైదరాబాద్ (301 కి.మీ.) నుంచి వచ్చి ఉండాలని స్థానికంగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నగరాల్లో మాత్రమే దాడి చేసే డ్రోన్లను నియంత్రించగలిగే సాంకేతికత అందుబాటులో ఉందన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఎందుకీ ఘర్షణ.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని బస్తర్ డివిజన్లో ‘జనతన సర్కార్’ పేరిట సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టు పార్టీకి, పోలీసు బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. సాధారణ పౌరులకు హాని కలగకుండా, ఆస్తులకు నష్టం జరగకుండా బలగాలు పోరు చేస్తుండగా.. ఆదివాసీల మద్దతు తీసుకుంటూ మావోయిస్టులు యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో బలగాలు, మావోల మధ్య పోరుతో దండకారణ్యం రక్తసిక్తం అవుతోంది. ఈ పోరులో వేలాది మంది మావోయిస్టులు, బలగాలు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 3న బీజాపూర్ జిల్లా తెర్రెం–జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోల వ్యూహాత్మక దాడిలో 23 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వియత్నాం తరహా గెరిల్లా యుద్ధతంత్రాన్ని మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్జీఏ దండకారణ్య ఆర్మీ కమాండర్ మడవి హిడ్మా ఆధ్వర్యంలో అమలు చేశారు. హిడ్మా ఫిలిప్పీన్స్‌లో ఈ తరహా శిక్షణ పొంది వచ్చాడు.