Pakistan Drone: పాకిస్తాన్‌ మరో కుతంత్రం | BSF Recovers Weapons Consignment Dropped By Pakistan Drone In Samba | Sakshi
Sakshi News home page

Pakistan Drone: పాకిస్తాన్‌ మరో కుతంత్రం

Published Sat, May 15 2021 3:00 AM | Last Updated on Sat, May 15 2021 2:17 PM

BSF Recovers Weapons Consignment Dropped By Pakistan Drone In Samba - Sakshi

జమ్మూకశ్మీర్‌: భారత్‌పై దాయాది దేశం పాకి స్తాన్‌ కుట్రలు ఆగడం లేదు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్‌ డ్రోన్‌ జార విడిచిన ఏకే–47 తుపాకీ, ఒక పిస్టల్, మరికొంత ఆయుధ సామగ్రిని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. భారత్‌–పాక్‌ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ డ్రోన్‌ పాకిస్తాన్‌ భూభాగం నుంచే వచ్చినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్‌ జారవిడిచిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం గొప్ప విజయమని బీఎస్‌ఎఫ్‌ జమ్మూ ఐజీ ఎన్‌ఎస్‌ జమ్వాల్‌ చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట తాము ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విజయంలో పాలుపంచుకున్న సిబ్బందిని అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement