weapons recovered
-
అల్లర్లకు చెక్!.. మణిపూర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం
ఇంపాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ మొత్తంలో ఆయుధ సామాగ్రిని ఆర్మీ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు చేపట్టి మందుగుండు సామగ్రితో సహా అనేక అక్రమ ఆయుధాలను పట్టుకున్నారు.మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలో 21 సెప్టెంబర్ 2024న భారత సైన్యం, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా రెండు జాయింట్ ఆపరేషన్లు చేపట్టారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో ఆయుధాలను, మందుగుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొదటి ఆపరేషన్‌లో, చురచంద్‌పూర్ జిల్లాలోని థాంగ్జింగ్ రిడ్జ్‌లోని దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా రెండు 9 ఎంఎం పిస్టల్స్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, ఒక సింగిల్ బ్యారెల్ రైఫిల్, రెండు స్థానికంగా తయారు చేసిన రాకెట్లు, ఒక లాంగ్ రేంజ్ మోర్టార్, రెండు మీడియం రేంజ్ మోర్టార్లు, నాలుగు మోర్టార్ బాంబులు, 9 ఎంఎం మందుగుండు సామగ్రి, 6.2 కిలోల గ్రేడ్-2 పేలుడు పదార్థాలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.రెండో ఆపరేషన్‌లో భాగంగా తౌబాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చాంగ్బీ గ్రామంలో సోదాలు నిర్వహించగా.. రెండు కార్బైన్ మెషిన్ గన్లు, రెండు పిస్టల్స్, సింగిల్ బ్యారెల్ గన్, 9 గ్రెనేడ్లు, చిన్న ఆయుధాల మందుగుండు సామగ్రితో సహా అనేక అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం మణిపూర్ పోలీసులకు అప్పగించారు.ఇదిలా ఉండగా..గత ఏడాది మే నుంచి మణిపూర్‌లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా 200 మందికి పౌరులు మృత్యువాత పడ్డారు. వేలాది మంది ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. ఇక, తాజాగా మిలిటెంట్లు ఇప్పుడు ప్రత్యర్థి వర్గానికి చెందిన గ్రామాలను లక్ష్యంగా చేసుకోవడానికి డ్రోన్లు, అధునాతన రాకెట్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిరోజులు క్రితమే విద్యార్థులు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి: దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్‌పై కంగన మండిపాటు -
కశ్మీర్ సరిహద్దుల్లో ఆయుధాలు జారవిడిచిన డ్రోన్
జమ్మూ: కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో డ్రోన్ జారవిడిచిన ఆయుధాలను సకాలంలో భద్రతా బలగాలు గుర్తించడంతో లష్కరే తోయిబా కుట్ర భగ్నమైంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, ది రెసిస్టాన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)అనే ఉగ్రసంస్థలు పంపిన ఆయుధాలతో సరిహద్దులకు సమీపంలో డ్రోన్ సంచరిస్తోందన్న సమాచారం మేరకు బలగాలు గాలింపు చేపట్టాయి. జమ్మూ జిల్లా ఆర్‌ఎస్‌పురా–ఆర్నియా ప్రాంతంలోని ట్రెవా గ్రామం సమీపంలో భద్రతా బలగాలకు ఒక పిస్టల్, రెండు మ్యాగజీన్లు, మూడు ఐఈడీలు, మూడు బాటిళ్ల పేలుడు పదార్థాలు తదితరాలు లభ్యమయ్యాయి. సరిహద్దు అవతల నుంచి వచ్చిన డ్రోన్ వీటిని అక్కడ జారవిడిచి వెళ్లినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. చదవండి: ('ఇది వినాశనానికే.. రష్యాకు ఏ మాత్రమూ మేలు చేయదు') -
Pakistan Drone: పాకిస్తాన్ మరో కుతంత్రం
జమ్మూకశ్మీర్: భారత్‌పై దాయాది దేశం పాకి స్తాన్ కుట్రలు ఆగడం లేదు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్ డ్రోన్ జార విడిచిన ఏకే–47 తుపాకీ, ఒక పిస్టల్, మరికొంత ఆయుధ సామగ్రిని బీఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. భారత్–పాక్ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ డ్రోన్ పాకిస్తాన్ భూభాగం నుంచే వచ్చినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ జారవిడిచిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం గొప్ప విజయమని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట తాము ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విజయంలో పాలుపంచుకున్న సిబ్బందిని అభినందించారు. -
పాతబస్తీలో కార్డన్ సెర్చ్.. ఆయుధాలు స్వాధీనం
హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్షాహి ప్రాంతాల్లో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారు జామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 220 ద్విచక్ర వాహనాలు, రెండు ఆయుధాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 60 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మందిపై నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ కాగా తప్పించుకు తిరుగుతున్నారు. నకిలీ స్టాంప్ వెండర్లు కూడా పట్టుబడ్డారు. గుడుంబా తయారుచేస్తున్న గ్యాంగ్, తెల్లవారుజాము వరకు హుక్కా సెంటర్లు నడుపుతున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులు ఉదయం 5 గంటల నుంచి కార్డన్ సెర్చ్ కొనసాగిస్తున్నారు.