పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌షాహి ప్రాంతాల్లో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారు జామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌షాహి ప్రాంతాల్లో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారు జామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 220 ద్విచక్ర వాహనాలు, రెండు ఆయుధాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 60 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో 10 మందిపై నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ కాగా తప్పించుకు తిరుగుతున్నారు. నకిలీ స్టాంప్ వెండర్లు కూడా పట్టుబడ్డారు. గుడుంబా తయారుచేస్తున్న గ్యాంగ్, తెల్లవారుజాము వరకు హుక్కా సెంటర్లు నడుపుతున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులు ఉదయం 5 గంటల నుంచి కార్డన్ సెర్చ్ కొనసాగిస్తున్నారు.