![Weapons Dropped By Drone Along Border In Jammu Recovered: Police - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/25/kashmir.jpg.webp?itok=n_92we9A)
జమ్మూ: కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో డ్రోన్ జారవిడిచిన ఆయుధాలను సకాలంలో భద్రతా బలగాలు గుర్తించడంతో లష్కరే తోయిబా కుట్ర భగ్నమైంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, ది రెసిస్టాన్స్ ఫోర్స్(టీఆర్‌ఎఫ్)అనే ఉగ్రసంస్థలు పంపిన ఆయుధాలతో సరిహద్దులకు సమీపంలో డ్రోన్ సంచరిస్తోందన్న సమాచారం మేరకు బలగాలు గాలింపు చేపట్టాయి.
జమ్మూ జిల్లా ఆర్‌ఎస్‌పురా–ఆర్నియా ప్రాంతంలోని ట్రెవా గ్రామం సమీపంలో భద్రతా బలగాలకు ఒక పిస్టల్, రెండు మ్యాగజీన్లు, మూడు ఐఈడీలు, మూడు బాటిళ్ల పేలుడు పదార్థాలు తదితరాలు లభ్యమయ్యాయి. సరిహద్దు అవతల నుంచి వచ్చిన డ్రోన్ వీటిని అక్కడ జారవిడిచి వెళ్లినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment