
న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించింది. టర్కీలో తయారైన అధునాతన బేరక్తార్ టిబి2 డ్రోన్లను పశ్చిమబెంగాల్‌లోని సరిహద్దుల్లో బంగ్లాదేశ్ మోహరించింది. దాంతో భారత్ అప్రమత్తమైంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఉధృతమయ్యాయనే వార్తల నేపథ్యంలో భారత్ నిఘాను మరింత పెంచింది.
బేరక్తార్ టిబి2 డ్రోన్ల మోహరింపునకు సంబంధించి భారత ఆర్మీ వాస్తవాలను బేరీజు వేస్తోంది. బంగ్లాదేశ్ ఇంటలిజెన్స్, సర్వైలెన్స్ 67 విభాగం ఈ డ్రోన్లను పర్యవేక్షిస్తోంది. రక్షణ చర్యల్లో భాగంగా ఈ డ్రోన్లను రంగంలోకి దింపామని బంగ్లా చెబుతున్నా పశ్చిమబెంగాల్‌తో వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో వీటిని మోహరించడంపై భారత్ అప్రమత్తమైంది. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయని, చొరబాటు ప్రయత్నాలు పెరిగాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment