సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం తారువలో ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్ సాయంతో విజువల్స్ తీశారు. దీంతో, అనుమానం వచ్చి స్థానికులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆరా తీశారు. విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు.
అనంతరం దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. దీంతో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న బీజేపీ కండువాలను, జెండాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్కడ డ్రోన్‌ను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ముత్యాల నాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment