
నర్సీపట్నం(అనకాపల్లి): కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీశ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వరుస అరెస్ట్ లకు తెరతీసింది. ఆదివారం నర్సీపట్నం వైఎస్సార్‌సీపీయూత్ లీడర్ ఈశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను మోసం చేశాడని అక్రమ కేసు బనాయింది అరెస్ట్ చేశారు పోలీసులు. ఈశ్వర్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. ఈశ్వర్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. దీనిలో భాగంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్‌సీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని అయన్న పాత్రుడు పని చేస్తున్నాడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితోనే అధికారులు పని చేస్తున్నారు. ఈ శ్వర్ పై పెట్టిన కేసు అక్రమ కేసని పోలీసుల మనస్సాక్షికి కూడా తెలుసు. కానీ అయ్యన్న ఒత్తిడి ముందు ఆలోచించి పనిచేస్తున్నారు. చీటింగ్ కేసులో స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగడం ఆశ్చర్యం కల్గించింది’ అని పేర్కొన్నారు.
ఇటీవల వైఎస్సార్ సీపీకి చెందిన నేత వల్లభనేని వంశీతో పాటు, ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని సైతం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment