సాక్షి, అనకాపల్లి: ఇసుక దొంగలను వదిలేసి వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా రాత్రికి రాత్రే తరలించుకుపోతున్నారని ధ్వజమెత్తారు. ఇసుక దొంగలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే, తిరిగి వారి మీదే అక్రమ కేసులు బనాయించారంటూ మండిపడ్డారు.
పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. స్పీకర్ అయ్యన్న ఒత్తిడితోనే వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు మేము భయపడం. వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment