
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన నాకు టీడీపీలో చేరితే రూ. 30 కోట్లు ఇస్తామన్నారు.
సాక్షి, అనకాపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తనకు టీడీపీలో చేరితే రూ. 30 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పారని వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష ఉపనాయకుడు, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయడు వెల్లడించారు. విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీనగరంలో ఆదివారం పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలకా ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్ పలకా రవితో పాటు మాజీ కౌన్సిలర్లు, వందలాది మంది వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉండేదన్నారు. 2014లో జగన్ ఆశీస్సులతోనే ఆ కోరిక నెరవేరిందన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి గంటా, అయ్యన్న, అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. గంటా, అయ్యన్న గనులు, భూములు దోచుకుంటున్నారని విమర్శించారు. గంటా ఆస్తి 10 వేల కోట్లు, అయ్యన్న ఆస్తి 5 వేల కోట్లు, పీలా గోవింద్ ఆస్తి వేయి కోట్లు ఎలా పెరిగాయో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ చీకటి ఒప్పందానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. గతంలో వైఎస్ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో, జగన్ అలాగే పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనను చంపేందుకు కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రా>ష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, నేతలు మళ్ల బుల్లిబాబు, దంతులూరి శ్రీధర్‌రాజు, మూనూరు శ్రీనివాసరావు మాట్లాడారు.