మహబూబ్‌నగర్: పాలమూరులోని మినీట్యాంకుబండ్‌పై ఆదివారం రాత్రి రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 450 డ్రోన్ల ద్వారా నిర్వహించిన మెగా లేజర్ షో ఆకాశంలో కనువిందు చేసింది. 15 నిమిషాల పాటు ఆకాశంలో నిర్వహించిన వివిధ ప్రదర్శనలు అద్భుతంగా అనిపించాయి. కొన్నిరోజులుగా జిల్లా అధికారులు ఈ ప్రదర్శనపై విస్తృతంగా ప్రచారం కల్పించడంతో వేలాది మంది తరలివచ్చారు. సాయంత్రం ఐదు గంటల నుంచే జనం రాక మొదలైంది.
ఒకవైపు మినీ ట్యాంక్‌బండ్ ప్రధాన ద్వారమైన మోడ్రన్ రైతుబజార్ పక్క నుంచి, మరోవైపు షాషాబ్‌గుట్ట–భగీరథకాలనీచౌరస్తా మధ్యనున్న కట్ట నుంచి స్టేజీ వద్దకు అనుమతించారు. ముందుగా హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు తెలంగాణపై పాడిన పాటలు ఆహుతులను అలరించాయి. ముఖ్యంగా రేలారేలారే.. నా తెలంగాణ, బలగం సినిమాలోని ఊరు.. పల్లెటూరు.. తదితర పాటలకు యువత కేరింతలు కొట్టారు. కార్యక్రమం రాత్రి 8 గంటలకు ముగియగా జనం ఒక్కసారిగా బయటకు వస్తుండగా రెండు మార్గాల్లోనూ గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోగా.. పోలీసులు క్లియర్ చేశారు.
అట్టహాసంగా ప్రారంభం..
లేజర్ షో ప్రదర్శనకు ముఖ్య అతిథి హాజరైన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ శ్రీనివాస్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఇంత పెద్ద డ్రోన్‌షో నిర్వహించడం దేశంలోనే మొదటిసారి అన్నారు. క్రమం తప్పకుండా ఇలాంటి ఈవెంట్స్ భవిష్యత్‌లోనూ ఏర్పాటు చేస్తామన్నారు.
కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ కె.నరసింహ, డీసీసీబీ ఇన్‌చార్జ్ చైర్మన్ వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, జిల్లా గొర్రెల పెంపకందారుల సంక్షేమ సంఘం అధ్యక్షు డు శాంతన్న యాదవ్, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేష్‌కుమార్, కమిషనర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment