
ఇంఫాల్: గగనతలంలో డ్రోన్లు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కని్పంచినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు.
విమానాల రాకపోకలను కూడా నిలిపేశారు. రెండు విమానాలను దారి మళ్లించగా అక్కణ్నుంచి బయల్దేరాల్సిన మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. మూడు గంటల విరామం అనంతరం సేవలను పునరుద్ధరించారు. తూర్పున మయన్మార్‌తో మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment