
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం రేపింది. దేవస్థానం అనుమతి లేకుండా ఆలయ పరిధిలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. డ్రోన్ ఎగురవేసింది తణుకు చెందిన రమేష్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. డ్రోన్ పట్టుకుని సీసీ కంట్రోల్ రూమ్‌కి తరలించారు. ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment