
ప్రతీకాత్మక చిత్రం
చెన్నైలోని నేవీ కేంద్రం మీదుగా డ్రోన్ వెళ్లడం కలకలం సృష్టించింది.
చెన్నై: చెన్నైలోని నేవీ కేంద్రం మీదుగా డ్రోన్ వెళ్లడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐఎన్‌ఎస్ అడయార్ క్యాంపస్ మీదుగా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని డ్రోన్ ఎగురూతూ వెళ్లినట్లు నేవీ సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు.
వారం రోజుల వ్యవధిలో గుజరాత్, రాజస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్‌కు చెందిన రెండు డ్రోన్లను భారత బలగాలు కూల్చిన సంగతి తెలిసిందే. పూల్వమా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని తీవ్రవాద తండాలపై భారత వైమానిక దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు వైమానిక దాడులకు తెగబడే అవకాశముందున్న నిఘా వర్గాల హెచ్చరికలతో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.