
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను భారత భదత్ర బలగాలు కూల్చి వేసాయి. కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలతో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. 19వ బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది. రాతువా సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి, ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయవంతంగా నేలమట్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.
Comments
Please login to add a commentAdd a comment