మన గగనతలంలో పాక్‌ డ్రోన్‌ ప్రత్యక్షం.. | Another Pakistan Drone Enters Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ ప్రత్యక్షం

Published Wed, Oct 16 2019 11:04 AM | Last Updated on Wed, Oct 16 2019 11:28 AM

Another Pakistan Drone Enters Punjab - Sakshi

చండీగఢ్‌ : పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ వద్ద వారం కిందట పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ చక్కర్లు కొట్టిన అనంతరం మరోసారి పంజాబ్‌లో పాక్‌ సరిహద్దు సమీపంలో పొరుగు దేశానికి చెందిన డ్రోన్‌ స్ధానికుల కంటపడింది. ఇండో-పాక్‌ సరిహద్దు గ్రామాలు హజారాసింగ్‌ వాలా, బక్డీ ప్రాంతంలో పాక్‌ డ్రోన్‌ ఎగురుతూ గ్రామస్తుల కంటపడిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌ వైపు నుంచి భారత గగనతలంలో ఒక కిలోమీటర్‌ వరకూ ఈ డ్రోన్‌ దూసుకువచ్చిందని స్ధానికులు చెప్పారు. బీఎస్‌ఎఫ్‌ హెచ్‌కే టవర్‌ సమీపంలో పంట పొలాల మీదుగా డ్రోన్‌ చక్కర్లు కొడుతూ సరిహద్దు దాటిందని, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఈ డ్రోన్‌ భారత్‌ వైపు ఏమైనా జారవిడిచిందా అనేది నిర్ధారించాల్సి ఉందని బీఎస్‌ఎఫ్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement