డ్రోన్ల ఫ్లయింగ్‌ శిక్షణ | Drones flying training in hyderabad | Sakshi
Sakshi News home page

డ్రోన్ల ఫ్లయింగ్‌ శిక్షణ

Published Tue, Apr 9 2019 3:25 AM | Last Updated on Tue, Apr 9 2019 3:25 AM

Drones flying training in hyderabad - Sakshi

సైయంట్‌ సంస్థతో ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసిన ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌. సైయంట్‌ ఎం.డీ,సీఈఓ కృష్ణ బోదనపు, టీఎస్‌ఏఏ సీఈఓ జిబిరెడ్డి

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఐటీ, ఇంజనీరింగ్‌ సేవల కంపెనీ సైయంట్‌ ఆధ్వర్యంలో డ్రోన్ల ఫ్లయింగ్‌ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ (టీఎస్‌ఏఏ)లతో ఒప్పందం చేసుకుంది. ఇది తెలంగాణలో తొలి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సర్టిఫైడ్‌ ట్రయినింగ్‌ అని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ఎంవోయూలో భాగంగా సైయంట్‌ శిక్షణ ఉపకరణాలను, టీఎస్‌ఏఏ మౌలిక వసతులు, నిర్వహణ బాధ్యతలను చేపడుతుందని తెలిపారు. ఐదు రోజుల శిక్షణ అనంతరం డీజీసీఏ రిమోట్‌ పైలెట్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఏఏ సీఈఓ జీబీ రెడ్డి, సైయంట్‌ ఎండీ అండ్‌ సీఈఓ కృష్ణా బోడనపు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement