jayesh ranjan it secretary
-
ఏఐపై మరింత అవగాహన అవసరం
ప్రస్తుత సమాజంలో ఏఐ విస్తతంగా వ్యాపించిందని కానీ దానిపై సామాన్యులకు, విద్యార్థులకు మరింత అవగాహన అవసరమని తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. తెలంగాణలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆన్ లైన్ లో ఉచిత శిక్షణ అందించేందుకు టాస్క్ సంస్థతో మాటా ఒప్పందం కుదరచుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. హెదరాబాద్ మాసబ్ ట్యాంక్ టాస్క్ కార్యాలయంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, మాట ఫౌండర్ శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. మాట ఫౌండర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వారానికి నాలుగు క్లాస్‌లు, రోజుకు రెండు గంటలు పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని ఇది కంటిన్యూ ప్రాసెస్ అని ఆయన తెలిపారు తొలుత ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో ప్రారంభించిన ట్లు తెలిపారు 200 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మంచి స్పందన వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేసారు.హైదరాబాద్ హెచ్ఐసిసి లో ఈనెల 4 5 తేదీల్లో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద ఏఐ సిటిని 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం అన్నారు. నిరుద్యోగ యువతకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ఐటీ కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. -
ఆవిష్కరణలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న స్థానిక సమస్యలకు కొత్త ఆవిష్కరణల ద్వారా పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటికి క్షేత్ర స్థాయి నుంచే సామాజిక ఆవిష్కరణలను ప్రోత్సహించి వాటికి వాణిజ్య రూపం ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పన, రాష్ట్ర ఆదాయం కూడా పెంచడం సాధ్యమని అంచనా వేస్తోంది. ఈ తరహా ఆవిష్కరణల కోసం జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా)తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న స్టార్టప్ వాతావరణం అంశం గ్లోబల్ స్టార్టప్ ఇకో సిస్టమ్ 2020 (జీఎస్‌ఈఆర్) నివేదికలో ప్రస్తావనకు నోచుకుంది. రాష్ట్రంలోని మూడున్నర కోట్ల జనాభాలో 2.1 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా పట్టణ వాసులతో పోలిస్తే వారు విభిన్న సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి భిన్నమైన మార్గాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘జికా’సాయంతో క్షేత్రస్థాయిలో సామాజిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆవిష్కరణలు, వాణిజ్య, ఇతర సామర్థ్యాల పట్ల ఆసక్తితో ఉన్న జికా ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తోంది. దీంతో మరిన్ని అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు కూడా ఈ రంగంలో పెట్టుబడులతో ముందుకొచ్చే అవకాశముందని సర్కారు భావిస్తోంది. తద్వారా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పన, ఉత్పాదకతతో పాటు జీడీపీ పెరుగుతుందని అంచనా వేస్తోంది. దీంతో ఇన్నాళ్లూ ఆవిష్కరణల కేంద్రాలుగా ఉన్న నగరాల నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ఆవిష్కరణల వాతావరణం విస్తరించే అవకాశముంది. సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణలకు రూ.660 కోట్లు స్టార్టప్‌ల ద్వారా వెలుగు చూస్తున్న ఆవిష్కరణలు రాష్ట్ర ఆర్థికాభివృద్దిలో కీలకంగా మారుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో పురుడు పోసుకుంటున్న ఆవిష్కరణలు మాత్రం వెలుగు చూడటం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణల ద్వారా వాణిజ్య కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు రూ.660 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు జికా మద్దతు ఇస్తుంది. ఇందులో రూ.100 కోట్లు సోషల్ ఇంపాక్ట్ సెక్టార్లో మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం కేటాయిస్తారు. రూ.117.61 కోట్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలు, కళాశాలల్లో ఎంట్రప్రెన్యూర్ల ప్రోత్సాహానికి, మరో రూ.56.72 కోట్లు గిరిజనుల్లో పోషకాహార సమస్యలు, మురుగునీరు నిర్వహణ, పారిశుధ్యం, అంటు వ్యాధులు తదితరాల కోసం ఉపయోగిస్తారు. వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలను గుర్తించేందుకు రూ.90.5 కోట్లు, రాష్ట్రంలో ఐటీ టవర్లు కలిగిన ఐదు జిల్లాలతో పాటు, హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.264 కోట్లు వెచ్చిస్తారు. జిల్లాల్లో ఉన్న ఐదు ఐటీ టవర్లు క్షేత్ర స్థాయిలో సామాజిక ఆవిష్కరణలకు మూల కేంద్రాలుగా పనిచేస్తూ హైదరాబాద్‌పై ఆధారపడటాన్ని కొంత మేర తగ్గించగలుగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోగాత్మకంగా గిరిజనుల్లో పోషకాహార లోపం, మురుగునీరు, పారిశుధ్య నిర్వహణ, అంటు వ్యాధులు, తాగునీరు పారిశుధ్యం, పరిశుభ్రత, వ్యవసాయ ఉత్పాదక పెంపు వంటి వాటికి ఆవిష్కర్తలు పరిష్కారం చూపుతారు. 20 లక్షల మందికి అవగాహన కల్పించడమే లక్ష్యం ‘జికా’సాయంతో చేపట్టే ప్రాజెక్టు లక్ష్యాలు, ఉద్దేశాల గురించి వివరించడంతో పాటు కొత్త ఆవిష్కరణలపై 20 లక్షల మంది సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, యాత్రలు, విలేజ్ ఇన్నోవేషన్ చాలెంజెస్, హ్యాకథాన్స్ వంటివి నిర్వహిస్తారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 3,200 మంది బాలికలు, మహిళలు, 1.38 లక్షల మంది విద్యార్థులు, 1,456 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,190 క్షేత్ర స్థాయి ఆవిష్కరణలను సృష్టించడం లక్ష్యం కాగా, వీటిలో 4,188 ఆవిష్కరణలను ప్రపంచస్థాయి ఉత్పత్తులుగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తద్వారా ఉత్పాదక, ఉత్పత్తి పెరిగి రాష్ట్ర ఆర్థికాభివృద్దికి బాటలు వేయనుంది. ఈ ఆవిష్కరణల ద్వారా 1,880 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు జీవం పోయడంతోపాటు మరో 645 ఎంఎస్ఎంఈల పునరుజ్జీవనానికి దారితీస్తుంది. వీటిలో 1,370 ఎంఎస్ఎంఈలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో సర్దుబాటు చేస్తారు. వీటి ద్వారా 7,600 మందికి ప్రత్యక్షంగా, 22 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించడంతోపాటు ఆదాయం, కొనుగోలు శక్తి, అనుబంధ ఎంటర్ప్రైజెస్ వృద్ధి, పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణల ప్రోత్సాహక ప్రాజెక్టు కోసం ‘జికా’తో జరుపుతున్న సంప్రదింపులు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. సామాజిక ఆవిష్కరణలు.. సంగారెడ్డి జిల్లాకు చెందిన సంగమేశ్వర్ అనే ఉపాధ్యాయుడు ఎరువులను పిచికారీ చేసేందుకు కంప్రెసర్ ద్వారా నడిచే వీల్ స్ప్రేయింగ్ పంప్‌ను రూపొందించారు. పంటల అవసరాలకు అనుగుణంగా స్ప్రేయర్ ఎత్తును సర్దుబాటు చేయొచ్చు. నల్గొండకు చెందిన అరుణజ్యోతి లోఖండే అనే మహిళ వంటింటి కూరగాయల వ్యర్థాలతో ‘సీడ్ పేపర్ న్యాప్కిన్లు‘ తయారు చేశారు. విత్తనాలు లేని న్యాప్కిన్లను ముక్కలుగా చేసి మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. విత్తనాలు ఉన్న న్యాప్కిన్లను నర్సరీల్లో ఉపయోగించవచ్చు. ఇలా సామాజిక అవసరాలు లేదా సమస్యలకు ప్రస్తుతం ఉన్న పరిష్కారాలకంటే మెరుగైన వాటిని కనుగొనడమే సామాజిక ఆవిష్కరణల లక్ష్యం. ఇలాంటి ఆవిష్కరణలను వాణిజ్యపరంగా తయారు చేసేందుకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు చేస్తే ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
డ్రోన్ల ఫ్లయింగ్ శిక్షణ
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఐటీ, ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ ఆధ్వర్యంలో డ్రోన్ల ఫ్లయింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ)లతో ఒప్పందం చేసుకుంది. ఇది తెలంగాణలో తొలి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సర్టిఫైడ్ ట్రయినింగ్ అని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఎంవోయూలో భాగంగా సైయంట్ శిక్షణ ఉపకరణాలను, టీఎస్‌ఏఏ మౌలిక వసతులు, నిర్వహణ బాధ్యతలను చేపడుతుందని తెలిపారు. ఐదు రోజుల శిక్షణ అనంతరం డీజీసీఏ రిమోట్ పైలెట్ లైసెన్స్ సర్టిఫికెట్ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఏఏ సీఈఓ జీబీ రెడ్డి, సైయంట్ ఎండీ అండ్ సీఈఓ కృష్ణా బోడనపు పాల్గొన్నారు. -
సినీ రంగంలో ఇది విప్లవం
‘విక్రమ్’ సినిమాతో పరిచయమై దాదాపు అందరి టాప్ యాక్టర్స్‌తో నటించిన నాయిక శోభన. యాక్టర్ నుంచి ఇప్పుడు మరో కొత్త రూపంలో ప్రేక్షకులకు చేరువ కానున్నారు. జాదూజ్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు తెలంగాణ పభుత్వ ‘టి.ఫైబర్’తో కలసి రంగారెడ్డిలోని తూములూరు గ్రామంలో జాదూజ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ‘‘సినిమాను మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసే అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడం హ్యాపీ. ఇదొక విప్లవం కానుంది’’ అన్నారు శోభన. ‘‘జాదూజ్ ద్వారా గ్రామీణులకు విజ్ఞానంతోపాటు వినోదం అందించనున్నాం’’ లోహిత్ అన్నారు. ‘‘తొలి విడతగా 8వేల గ్రామాల్లో 500 జాదూజ్ సెంటర్లు నెలకొల్పుతాం. సినిమాలు ప్రదర్శిస్తాం. ఈ సెంటర్స్‌లో ‘చాయ్ నాస్తా కేఫ్‌లు’ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా వంద మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్లు) ఆదాయంతో పాటు 5 వేల మందికి ఉపాధి దొరుకు తుంది’’ అన్నారు రాహుల్ నెహ్రా. ‘‘సామాన్యులకు దూరమైన సినిమాను దగ్గర చేయడానికి కృషి చేస్తున్న ‘జాదూజ్’ని అభినందిస్తు న్నా’’ అని తెలంగాణ ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ‘‘ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం’’ అని శ్రీధర్‌రావు అన్నారు. -
యాక్ట్ ఫైబర్‌నెట్ గిగా స్పీడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో ఉన్న యాక్ట్ ఫైబర్‌నెట్ గిగా స్పీడ్స్ జాబితాలోకి చేరింది. భారత్‌లో 1 జీబీపీఎస్ (1024 ఎంబీపీఎస్) డౌన్లోడ్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తున్న తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. అయితే ఈ సేవలకు హైదరాబాద్ వేదిక కావడం విశేషం. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా యాక్ట్ ఫైబర్‌నెట్ గిగా ప్లాన్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. దేశంలో ఇంటర్నెట్ సగటు వేగం 2.5 ఎంబీపీఎస్ ఉంది. దేశ సగటు కన్నా హైదరాబాద్‌లో నెట్ స్పీడ్ 400 రెట్లు అధికం అయిందని కంపెనీ సీఈవో బాల మల్లాది ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇంటర్నెట్ విస్తరణ పరంగా భాగ్యనగరి దేశంలో టాప్–1లో ఉందన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లోనే గిగా స్పీడ్ అందుబాటులో ఉందని చెప్పారు. విస్తరణకు రెండేళ్లలో రూ. 1,200 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. యాక్ట్ గిగా ప్లాన్ ధర నెలకు రూ.5,999గా నిర్ణయించారు. దీని కింద 1 టీబీ (1024 జీబీ) డేటా ఉచితం. 3,000 వైఫై హాట్‌స్పాట్స్..: గిగా స్పీడ్ జాబితాలో హైదరాబాద్ చేరడం గర్వంగా ఉందని తారక రామారావు అన్నారు. భాగ్యనగరిలో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు నెలకు సగటున 75 జీబీ డేటా వాడుతున్నారని గుర్తు చేశారు. నగరంలో 3,000 వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. వీటిలో 1,000 హాట్‌స్పాట్స్‌ను యాక్ట్ ఫైబర్‌నెట్ నెలకొల్పుతోందని చెప్పారు. సెక్రటేరియట్, రాజ్ భవన్, సీఎం క్యాంప్ కార్యాలయానికి గిగా స్పీడ్ ఇంటర్నెట్ను అందించాల్సిందిగా కోరారు. కంపెనీ ప్రస్తుతం 200 ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్ను అందిస్తోంది. మరిన్ని స్కూళ్లకు ఈ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు. వైఫై ప్రాజెక్టు ఏప్రిల్‌లో ప్రారంభం అవుతోందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులో నంబర్–1 బ్రాడ్‌బ్యాండ్ కంపెనీగా యాక్ట్ నిలిచింది. ఆడి క్యూ3 కొత్త వేరియంట్ : 32.2 లక్షలు ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి, క్యూ3 మోడల్లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. 1.4 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కొత్త వేరియంట్ ధర రూ.32.2 లక్షలుగా (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆడి క్యూ3 పెట్రోల్ వేరియంట్ 16.9 కి.మీ. మైలేజీనిస్తుందని, 0–100 కిమీ. వేగాన్ని 8.9 సెకన్లలోనే అందుకుంటుందని తెలియజేశారు. పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన కంపెనీ ఏకైక ఎస్యూవీ ఇదొక్కటే.